ప్రకృతి రమణీయత.. నల్లమలలో కాలినడక.. ఆదిదేవుణ్ని దర్శించుకోవాలంటే ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే

|

Feb 27, 2022 | 11:48 AM

శివరాత్రి పర్వదినం సందర్భంగా కర్నూలు జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రం శ్రీగిరి(Sri Giri) ఆలయానికి భక్తుల రాక మొదలైంది. దీంతో నల్లమల్ల(Nallamala Forest) అరణ్యంలో జనాల సందడి కనిపిస్తోంది...

ప్రకృతి రమణీయత.. నల్లమలలో కాలినడక.. ఆదిదేవుణ్ని దర్శించుకోవాలంటే ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే
Srisailam
Follow us on

శివరాత్రి పర్వదినం సందర్భంగా కర్నూలు జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రం శ్రీగిరి(Sri Giri) ఆలయానికి భక్తుల రాక మొదలైంది. దీంతో నల్లమల్ల(Nallamala Forest) అరణ్యంలో జనాల సందడి కనిపిస్తోంది. శివనామస్మరణతో ఆలయ పరిసరాలు మార్మోగుతున్నాయి. కొండపై కొలువైన కైలాసనాధుడిని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా, పొరుగున ఉన్న కర్ణాటక నుంచీ భక్తులు వస్తున్నారు. పాదయాత్రగా వచ్చే వారందరూ అరణ్యమార్గంలో 43 కి.మీలు, ఆత్మకూరు నుంచి రోడ్డు మార్గంలో 120 కిలోమీటర్లు ప్రయాణిస్తే శ్రీగిరి క్షేత్రానికి చేరుకోవచ్చు. అయితే అటవీ ప్రాంతం కావడంతో కాలినడకన వచ్చే భక్తులు కొన్ని జాగ్రత్తలు పాటించాలని అటవీశాఖ అధికారులు సూచిస్తున్నారు.

అడవిలో సూచికలను అనుసరించి అనువైన దారిలోనే వెళ్లాలి. పులుల అభయారణ్యం కావడంతో ఇతర దారుల్లో వెళ్లడం మంచిదికాదు. అటవీ ప్రాంతం కావడంతో సిగ్నల్స్ రావు. దీంతో సెల్ ఫోన్ లు పనిచేయవు. అనారోగ్య సమస్యలు ఉన్నవారు పాదయాత్ర చేయడం మంచిది కాదు. దారిలో అస్వస్థతకు గురైతే.. వైద్య సేవలు అందుబాటులో ఉండవు. వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చి, ప్రథమ చికిత్స చేయించుకుని సమీప గ్రామాల్లోని ఆరోగ్య కేంద్రాలకు వెళ్లాల్సి ఉంటుంది. ఎండలు ఎక్కువవుతున్నందున నీటి సీసాలు తీసుకెళ్లాలి. బీడీ, సిగరెట్‌, అగ్గిపెట్టె వంటివి అడవిలోకి అనుతించబడవు. మధ్యమధ్యలో విశ్రాంతి తీసుకుంటూ పాదయాత్రను కొనసాగించాలి. శివరాత్రి వేడుకల దృష్ట్యా భక్తుల కోసం అన్నదాన శిబిరాలు ఏర్పాట్లు చేశారు.

Also Read

Telugu Students: ఉక్రెయిన్ నుంచి బయటపడ్డ భారతీయులు.. హైదరాబాద్ చేరిన తెలుగు విద్యార్థులు

ప్రేమ పేరుతో శారీరకంగా దగ్గరయ్యాడు.. గర్భం దాల్చడంతో పరారయ్యాడు.. కట్ చేస్తే

Bheemla Nayak: ఇది కదా మాకు కావాల్సింది.. పవర్‌స్టార్‌ సినిమాపై నితిన్‌ ట్వీట్‌..