Bhadrachalam: రామయ్య భక్తులకు బిగ్ అలర్ట్.. ఆన్ లైన్ లో వైకుంఠ ఏకాదశి టికెట్లు.. అక్కడ మాత్రం..

|

Dec 01, 2022 | 9:56 AM

భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ఈ నెల 23 నుంచి జరిగే ఈ వేడుకలకు ఏర్పాట్లు చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు..

Bhadrachalam: రామయ్య భక్తులకు బిగ్ అలర్ట్.. ఆన్ లైన్ లో వైకుంఠ ఏకాదశి టికెట్లు.. అక్కడ మాత్రం..
Bhadrachalam Temple
Follow us on

భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ఈ నెల 23 నుంచి జరిగే ఈ వేడుకలకు ఏర్పాట్లు చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. 2023 జనవరి 1న గోదావరిలో తెప్పోత్సవం, 2న ఉదయం ఉత్తర(వైకుంఠ) ద్వార దర్శన పూజల చూసేందుకు ప్రత్యేకంగా సెక్టార్లు ఏర్పాటు చేసి, టికెట్లు విక్రయించనున్నారు. రూ.2వేలు, రూ.వెయ్యి, రూ.500, రూ.250ల టికెట్లు నేటి నుంచి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయని రామాలయ అధికారులు తెలిపారు. భక్తులు www.bhadrachalamonline.com వెబ్‌సైట్‌ ద్వారా భక్తులు టికెట్లు పొందవచ్చని తెలిపారు. కొత్తగూడెం, భద్రాచలం ఆర్డీవో కార్యాలయం, రామాలయంలోని ప్రధాన కౌంటర్‌, తానీషా కల్యాణ మండపం, బ్రిడ్జి వద్ద ఉన్న రామాలయ సమాచార కౌంటర్‌లో ఈ టికెట్లను నేరుగా విక్రయించనున్నట్లు వివరించారు.

మరోవైపు.. తిరుమల శ్రీవారిని దర్శించుకునే బ్రేక్ దర్శన సమయం మార్పు చేస్తున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. ఇవాళ్టి (గురువారం) నుంచి ప్రయోగాత్మకంగా ఈ ప్రక్రియ చేపడుతున్నట్లు తెలిపారు. బ్రేక్ దర్శనం సమయాన్ని ఉదయం 8 గంటలకు మారుస్తున్నట్లు తెలిపారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో రాత్రివేళ వేచి ఉండే భక్తులకు ఉదయం త్వరితగతిన దర్శనం కల్పించేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. దీంతో తిరుమలలో గదులపై ఒత్తిడి తగ్గే అవకాశముందని అంచనా వేస్తున్నారు. శ్రీవాణి ట్రస్టు దాతల కోసం తిరుపతిలోని మాధవం విశ్రాంతి గృహంలో బుధవారం ఉదయం 10 గంటలకు టికెట్ కౌంటర్ ప్రారంభించారు. శ్రీవాణి ట్రస్ట్ దాతలకు అక్కడే ఆఫ్ లైన్ టికెట్లతో పాటు గదులు కూడా ఇక్కడే మంజూరు చేస్తారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి