Parijatha Tree : పారిజాత చెట్టుతో క‌లిగే ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు.. మీకు తెలియని రహస్యాలు ఇవి..!

|

Oct 22, 2022 | 5:58 PM

పారిజాత పువ్వు పూజకు, శ్రేయస్సుకు మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. వైద్యంలో దీని మొక్కను, ఆకులను, గింజలు, పూలను ఎక్కువగా వినియోగిస్తారు.

Parijatha Tree : పారిజాత చెట్టుతో క‌లిగే ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు.. మీకు తెలియని రహస్యాలు ఇవి..!
Parijatha Tree
Follow us on

మన ప్రకృతిలో అనేక ర‌కాల పూల మొక్క‌లు ఉంటాయి. అయితే కొన్నిర‌కాల పూల‌ను మాత్ర‌మే దైవారాధనకు ఉప‌యోగిస్తారు. అలాంటి పూలలో పారిజాతం పూలు ఎంతో ప్రత్యేకమైనవి. దైవ పూజ‌కు కోసం వీటిని ప్ర‌త్యేకంగా పెంచుకుంటారు చాలా మంది. వీటిని నైట్ ఫ్ల‌వ‌ర్ జాస్మిన్ అని కూడా పిలుస్తారు. ఈ పూలు చూడ‌డానికి ఎంతో అందంగా కనిపిస్తాయి. చ‌క్క‌ని సువాస‌న‌ కలిగి ఉంటాయి. ఈ పూలు రాత్రిపూట విక‌సించి తెల్లవారు జాము వ‌ర‌కు రాలిపోతుంటాయి. ఇదే వీటి ప్రత్యేకత. అలా నేలరాలిన పూలతోనే పూజకు వాడుతుంటారు. అయితే, ఈ పారిజాతానికి ఆయుర్వేద శాస్త్రంలో కూడా ఎంతో ప్రత్యేకత ఉంది. పారిజాత పువ్వు పూజకు, శ్రేయస్సుకు మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఆయుర్వేదం ప్రకారం, పారిజాత రసం గుండె సంబంధిత సమస్యలను నయం చేస్తుంది. దీని ఆకులకు, పుష్ఫాలకు ఎంతో విశిష్ట గుణాలున్నాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. పారిజాతం పూలల్లో ఎన్నో ఔషధ గుణాలున్నాయట. వైద్యంలో దీని మొక్కను, ఆకులను, గింజలు, పూలను ఎక్కువగా వినియోగిస్తారని తెలుస్తోంది. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ మొక్కలోని ఔషధ గుణాలు పలు రకాల వ్యాధులను నయం చేయడంలో కీలకపాత్ర పోషిస్తాయని చెబుతున్నారు.

ఇంట్లో పారిజాత మొక్కను నాటడం చాలా శుభప్రదంగా భావిస్తారు. ఎందుకంటే, పారిజాత మొక్క భగవంతుని నిలయమని నమ్ముతారు. పారిజాత మొక్కను ఇంటి చుట్టూ ఉత్తరం లేదా తూర్పు దిశలో నాటడం వల్ల ఇంటి వాస్తు దోషాలు తొలగిపోతాయని కూడా నమ్ముతారు. అంతే కాదు పారిజాతం అందానికి, ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. పారిజాత మొక్క వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం…

చర్మ సమస్యలకు పరిష్కారం:
పారిజాత మొక్క ఆకులను మెత్తగా నూరి చర్మానికి రాసుకుంటే చర్మ సమస్యలు నయమవుతాయి. దీని పువ్వుల ముద్దను ముఖానికి రాసుకుంటే ముఖం మెరుస్తుంది.

ఇవి కూడా చదవండి

ఈ ఆరోగ్య సమస్యలకు పారిజాత ఔషధం:
ఆర్థరైటిస్, సయాటికా, ఎముకల పగుళ్లు, చర్మ వ్యాధులు, పైల్స్, జ్వరం, డెంగ్యూ, మలేరియా, పొడి దగ్గు, మధుమేహం మొదలైన వివిధ రుగ్మతలు, వ్యాధుల చికిత్సకు కూడా పారిజాత ఉపయోగించబడుతుంది.

స్త్రీల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది :
పారిజాత స్త్రీల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది. ఆరోగ్యకరమైన, సంతోషకరమైన జీవితాన్ని గడపడానికి సహాయపడుతుంది.

పారిజాతం చెట్టు గింజ‌ల‌ను ఎండ‌బెట్టి పొడి చేసి..అందులో కొద్దిగా నీటిని క‌లిపి పేస్ట్ లా చేసుకుని త‌లకు ప‌ట్టించ‌డం వ‌ల్ల త‌ల‌లో వ‌చ్చే కురుపులు, పుండ్లు త‌గ్గుతాయి. ఈ గింజ‌ల చూర్ణానికి కొబ్బ‌రి నూనెను క‌లిపి త‌ల‌కు రాసుకుని ఒక గంట త‌రువాత త‌ల‌స్నానం చేయ‌డం వ‌ల్ల చుండ్రు స‌మ‌స్య త‌గ్గుతుంది.

పారిజాతం చెట్టు ఆకుల‌ను మెత్త‌గా నూరి ఆ మిశ్ర‌మాన్ని ఆముదంలో వేసి చిన్న మంట‌పై వేడి చేయాలి. ఈ మిశ్ర‌మాన్ని వాత‌పు నొప్పుల‌పై ఉంచి క‌ట్టుక‌ట్ట‌డం వ‌ల్ల నొప్పులు త‌గ్గుతాయి.

పారిజాతం చెట్టు గింజ‌ల‌ను మ‌ట్టిపాత్ర‌లో వేసి న‌ల్ల‌గా అయ్యే వ‌ర‌కు వేడి చేయాలి. త‌రువాత ఈ గింజ‌ల‌ను పొడిగా చేసి దానికి హార‌తి క‌ర్పూరం పొడిని, కొబ్బ‌రి నూనెను క‌లిపి పేస్ట్ గా చేసుకోవాలి. ఈ పేస్ట్ ను లేప‌నంగా రాయ‌డం వ‌ల్ల గజ్జి, తామ‌ర వంటి చ‌ర్మ వ్యాధులు త‌గ్గుతాయి.

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)