Vinayaka Chavithi:  విఘ్నాలు తొలగిపోవాలంటూ.. బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో గణపతికి ప్రత్యేక పూజలు చేసిన బాలకృష్ణ

Vinayaka Chavithi 2021: వినాయక చవితి పండగని పురష్కరించుకుని భాగ్యనగరంలో మండపాలలో గణపతి కొలువుదీరాడు. ఇక సెలబ్రెటీల నుంచి సామాన్యుల వరకూ గణేష్ చతుర్థి పర్వదినాన్ని అత్యంత ఘనంగా జరుపుకుంటున్నారు. తాజాగా బసవతారకం..

Vinayaka Chavithi:  విఘ్నాలు తొలగిపోవాలంటూ.. బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో గణపతికి ప్రత్యేక పూజలు చేసిన బాలకృష్ణ
Balakrishna 1

Updated on: Sep 10, 2021 | 7:21 PM

Vinayaka Chavithi 2021: వినాయక చవితి పండగని పురష్కరించుకుని భాగ్యనగరంలో మండపాలలో గణపతి కొలువుదీరాడు. ఇక సెలబ్రెటీల నుంచి సామాన్యుల వరకూ గణేష్ చతుర్థి పర్వదినాన్ని అత్యంత ఘనంగా జరుపుకుంటున్నారు. తాజాగా బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ లో వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.  ఈరోజు ఉదయం హాస్పిటల్ ఆవరణలో ఏర్పాటు చేసిన వినాయకునికి సినీ హీరో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పూజలను నిర్వహించారు. ఈ  పూజా కార్యక్రమంలో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చి ఇన్సిస్టిట్యూట్  సిబ్బంది పాల్గొన్నారు. గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజానంతరం ప్రసాద వితరణ చేశారు.

ఈ సందర్భంగా  నందమూరి బాలకృష్ణ తెలుగు ప్రజలకు ప్రత్యేక వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలెదుర్కొంటున్న విఘ్నాలన్నీ తొలగిపోవాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో శ్రీ నందమూరి బాలకృష్ణ తో పాటూ డా. ఆర్ వి ప్రభాకర రావు,  సీఈవో డా. ఫణి కోటేశ్వర రావు, మెడికల్ సూపర్నింటెండెంట్ లతో పాటు హాస్పిటల్ కు చెందిన వైద్యులు, వైద్యేతర సిబ్బంది పాల్గొన్నారు. అంతకు ముందు హాస్పిటల్ ఆవరణలో ఉన్న గణేష్ మందిరంలో  బాలకృష్ణ ప్రత్యేక పూజలు చేశారు.

Balakrishna

 

Also Read : Ganesh Chaturthi 2021: గణపతికి రూ. 6 కోట్ల విలువజేసే బంగారం కిరీటం కానుకగా ఇచ్చిన భక్తుడు .. ఎక్కడంటే.