Muslim Woman Raises Funds:రాముడు పుట్టిన భూమిలో జన్మించాం.. మందిర నిర్మాణం కోసం విరాళమిద్దాంమంటున్న ముస్లిం మహిళ

|

Jan 20, 2021 | 3:45 PM

రామ మందిర నిర్మాణం కోసం కులమతాలకు అతీతంగా విరాళాలు అందజేస్తున్నారు. తాజాగా, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముస్లిం మహిళ సైతం ఆయోధ్య రామాలయం కోసం విరాళాల సేకరణ ప్రారంభించింది. కులమతాలకు అతీతంగా విజయవాడలో..

Muslim Woman Raises Funds:రాముడు పుట్టిన భూమిలో జన్మించాం.. మందిర నిర్మాణం కోసం విరాళమిద్దాంమంటున్న ముస్లిం మహిళ
Follow us on

Muslim Woman Raises Funds:కొన్ని శతాబ్దాలుగా హిందువుల కల రామ జన్మభూమి అయోధ్యలో మందిర నిర్మాణం.. ఆ కల తీరే సమయం ఆసన్నమైంది. దీంతో ప్రతి హిందువు నిర్మాణంలో భాగస్వామ్యం చేయాలని ఆలయ ట్రస్ట్ భావించింది. అందుకనే దేశ వ్యాప్తంగా శ్రీరామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర, విశ్వహిందూ పరిషత్‌లు విరాళాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించింది. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నుంచి మొదటి విరాళం సేకరించి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టగా భవ్యమైన రామమందిర నిర్మించాలనే ప్రతి హిందువులు అభిలషిస్తున్నాడు. తనకు తోచిన విరాళాన్ని మందిర నిర్మాణానికి ఇస్తున్నారు. మందిర నిర్మాణం కోసం కులమతాలకు అతీతంగా విరాళాలు అందజేస్తున్నారు.

తాజాగా, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముస్లిం మహిళ సైతం ఆయోధ్య రామాలయం కోసం విరాళాల సేకరణ ప్రారంభించింది. కులమతాలకు అతీతంగా విజయవాడలో తాహేరా ట్రస్ట్ నడుపుతోన్న జహారా బేగం.. రాముడికి విరాళాలు ఇవ్వాలని ముస్లిం వర్గాలను ఆమె కోరుతున్నారు. భారతీయ సంస్కృతిలో అన్ని మతాలు సమానమేనని ఆమె అన్నారు.

రాముడి పుట్టిన ఈ దేశంలో జన్మించాం.. మన కాలంలో ఆలయం నిర్మించబడటం అదృష్టం.. రాముడి ధర్మాన్ని ఒక జీవన విధానంగా బోధించాడు.. మొత్తం ప్రపంచానికి ఆయన ఒక ఉదాహరణగా నిలుస్తాడని చెప్పిన జహారా ఈ దైవ కార్యానికి అందరూ కలిసిరావాలని కోరారు. భవ్యమైన రామమందిర నిర్మాణానికి హృదయపూర్వకంగా సహకరించాలని ఆమె విజ్ఞ‌ప్తి చేశారు.

హిందువులు ముస్లిం కోసం మసీదుల, దర్గాల నిర్మాణానికి తమ భూములను సైతం ఇచ్చారు.. గత ఇన్నేళ్ళుగా కలిసి అన్నదమ్ముల్లా జీవిస్తున్నాం.. వినాయక చవితి, దసరా, శ్రీరామ నవమి వంటి హిందూవుల పండగలకు ముస్లింలుచందాలు ఇస్తారు.. ముస్లిం లు హిందువు దేవుళ్ళకు దూపం వేసి.. జీవనాధారంగా బతుకుతారు.. ఇదీ మన దేశం యొక్క గొప్పదనమని చెప్పారు జహారా..  రామ్ రహీం ఎవరైనా మనం అందరం భారతీయులం.. కనుక మన సోదరుల కోరికను తీర్చేవిధంగా నిర్మిస్తున్న రామ మందిర నిర్మణానికి ఎవరికి ఎంత తోస్తే అంత విరాళంగా ఇవ్వొచ్చని.. కనీసం  రూ. 10 విరాళంగా ఇవ్వొచ్చని అన్నారు.

ప్రపంచం ఏ ఎక్కడ ఏ దేశంలోని లౌకిక వాదం మన దేశం సొంతం.. భారత దేశం అంటే ఆధ్యాత్మికత, గొప్ప వారసత్వం, భిన్న సాంప్రదాయాలు, విభిన్న సంస్కృతులు, బహుళ భాషలకు నిలయం.. ప్రపంచంలోని మరే ఇతర దేశాలలోనూ ఈ వైవిధ్యం లేదు.. ముస్లింలతో సహా అన్ని వర్గాల ప్రజలు ఇక్కడ ఇతర దేశాలకు భిన్నంగా స్వేచ్ఛను కలిగి ఉన్నారు. ఒకరినొకరు గౌరవించుకుంటూ.. సుఖసంతోషాలతో జీవిస్తాన్నామని చెప్పారు.

Also Read: దేశంలో రోజురోజుకీ వ్యాపిస్తున్న బర్డ్ ఫ్లూ… కేరళ, మహారాష్ట్రల్లోని మరిన్ని పౌల్ట్రీల్లో గుర్తింపు