బంగారు వర్ణంలో మెరిసిపోతున్న మేడారం.. వనదేవతల దర్శనం కోసం పోటెత్తున్న భక్తులు..!

మేడారానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. వనదేవతలు సమ్మక్క, సారలమ్మలను దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు. మహా జాతర సమీపిస్తుండడంతో రోజురోజుకు భక్తుల రద్దీ పెరుగుతోంది. మహా జాతర ముందే.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతోపాటు.. వివిధ ప్రాంతాల నుంచి భక్తజనం లక్షలాదిగా తరలివస్తున్నారు. దీంతో మేడారంలో ఉదయం నుంచి రాత్రి వరకు భక్తుల రద్దీ కొనసాగుతోంది.

బంగారు వర్ణంలో మెరిసిపోతున్న మేడారం.. వనదేవతల దర్శనం కోసం పోటెత్తున్న భక్తులు..!
Medaram Maha Jathara

Updated on: Jan 25, 2026 | 7:14 AM

మేడారానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. వనదేవతలు సమ్మక్క, సారలమ్మలను దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు. మహా జాతర సమీపిస్తుండడంతో రోజురోజుకు భక్తుల రద్దీ పెరుగుతోంది. మహా జాతర ముందే.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతోపాటు.. వివిధ ప్రాంతాల నుంచి భక్తజనం లక్షలాదిగా తరలివస్తున్నారు. దీంతో మేడారంలో ఉదయం నుంచి రాత్రి వరకు భక్తుల రద్దీ కొనసాగుతోంది. ప్రత్యేకించి.. మేడారంలోని పలు ప్రాంతాల్లో ఉదయం-సాయంత్రం- రాత్రి వేళ్లలోని డ్రోన్‌ దృశ్యాలు స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలుస్తున్నాయి. సమ్మక్క-సారలమ్మ గద్దెల ప్రాంగణం రాత్రి వేళ బంగారు వర్ణంలో మెరిసిపోయింది. ఆయా దృశ్యాలను చూసేందుకు రెండు కళ్లు చాలవన్నట్లుగా ఉన్నాయి.

సెలవు దినాలు కావడంతో మేడారం వైపు జనం అడుగులు పడుతున్నాయి. భక్తుల రద్దీ దృష్ట్యా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులన్నీ భక్తులతో కిక్కిరిసిపోతున్నాయి. ప్రైవేటు వాహనాల్లోనూ వేలల్లో తరలివస్తున్నారు. నార్లాపూర్, ఊరట్టం, మేడారంలోని ఖాళీ స్థలాలు, జాతర పరిసరాల్లో ప్రైవేటు వాహనాల జాతర కొనసాగుతోంది. వీటికి సంబంధించిన డ్రోన్ దృశ్యాలు అలరిస్తున్నాయి. మేడారం దార్లు, సెంటర్లు, సర్కిల్స్‌ అన్నీ.. కలర్‌ ఫుల్‌ విద్యుత్‌ దీపాలతో వెలుగులు విరజిమ్ముతున్నాయి.

అటు.. మేడారం ప్రధాన రహదారులు, జంపన్నవాగు పరిసరాల్లో, అద్దె సత్రాల్లో ఎక్కడ చూసినా భక్తులే దర్శనమిస్తున్నారు. గద్దెల పరిసరాల్లో రద్దీ పెరగడంతో చుట్టుపక్కల ఉన్న మార్గాలన్నీ మూసివేసి క్యూలైన్ల ద్వారా మాత్రమే భక్తులను అనుమతించారు. దీంతో.. క్యూ లైన్లు కిలోమీటర్ల మేర రద్దీని తలపిస్తున్నాయి. మొత్తంగా.. మేడారంలో భక్తుల రద్దీ.. నాలుగు రోజుల ముందే మహాజాతరను కళ్లకు కడుతోంది.

వీడియో ఇక్కడ చూడండి…

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…