హిందూ మతంలో మార్గశిర పౌర్ణిమికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ మార్గశిర మాసం కూడా విష్ణువుకు అంకితం చేయబడింది. ఈ మాసంలో వచ్చే పౌర్ణమి దేవతలందరికీ ప్రత్యేకమైన రోజుగా పరిగణించబడుతుంది. ఈ రోజున పూజించడం వల్ల దేవతలందరూ సంతోషిస్తారు. ఈ రోజున ఆచారాల ప్రకారం పూజించడం వల్ల సుఖం, ఐశ్వర్యం, ఆరోగ్యం, మోక్షం లభిస్తాయి.
పంచాంగం ప్రకారం మార్గశిర మాసం పౌర్ణమి తిథి డిసెంబర్ 14, శనివారం సాయంత్రం 4:58 గంటలకు ప్రారంభమై డిసెంబర్ 15 ఆదివారం మధ్యాహ్నం 2:31 గంటలకు ముగుస్తుంది. ఉదయ తిథి ప్రకారం పౌర్ణమి తిథి ఉపవాసం డిసెంబర్ 15న ఆచరిస్తారు. డిసెంబర్ 15 న చంద్రోదయం సాయంత్రం 5:14 గంటలకు జరుగుతుంది.
మార్గశిర పౌర్ణమి రోజున దానం చేయడం వల్ల పుణ్యం లభిస్తుంది. జీవితంలో సుఖ సంతోషాలు కలుగుతాయి. మార్గశిర పౌర్ణమి రోజున ఆహారం, బట్టలు, డబ్బు వంటి ఏదైనా దానం చేయవచ్చు. ఈ రోజున చేసే పూజల వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు, ఐశ్వర్యం పెరుగుతాయి. పాపాలు నశిస్తాయి. అలాగే ఈ రోజున చేసే పూజ చంద్రుడి ఆశీస్సుతో మనస్సును ప్రశాంతపరుస్తుంది. ఆధ్యాత్మిక పురోగతికి దారితీస్తుంది.జీవితంలో సానుకూల శక్తి వస్తుంది. అన్ని కోరికలు నెరవేరుతాయి.
మరిన్ని ఆధ్మాతిక వార్తల కోసం క్లిక్ చేయండి..
నోట్ : పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి.