Maha Kumbha Mela: కుంభ మేళా కోసం ప్రయాగ్ రాజ్ కు వెళ్తున్నారా.. ఈ ప్రాచీన దేవాలయాలను తప్పనిసరిగా సందర్శించండి..

|

Dec 25, 2024 | 12:04 PM

ప్రయాగ్ రాజ్ లో జరగనున్న మహా కుంభ మేళాకు కౌంట్ డౌన్ స్టార్ అయింది. 12 సంవత్సరాల తర్వాత 2025లో ప్రయాగ్‌రాజ్‌లో నిర్వహించనున్నారు. ఈ మహా కుంభ మేళాలో పాల్గొనేందుకు భారీ సంఖ్యలో భక్తులు, సాధువులు భారీ సంఖ్యలో ప్రయాగ్ రాజ్ కు చేరుకుంటారు. ప్రతిచోటా వీక్షణ అద్భుతంగా ఉంటుంది. మీరు కూడా మహా కుంభ మేళాలో భాగం కావడానికి ప్రయాగ్‌రాజ్‌కు వెళుతున్నట్లయితే.. ఖచ్చితంగా అక్కడ కొన్ని దేవాలయాలను సందర్శించండి.

Maha Kumbha Mela: కుంభ మేళా కోసం ప్రయాగ్ రాజ్ కు వెళ్తున్నారా.. ఈ ప్రాచీన దేవాలయాలను తప్పనిసరిగా సందర్శించండి..
Prayagraj
Follow us on

13 జనవరి 2025 నుంచి ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభ మేళా ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన సన్నాహాలు జోరందుకున్నాయి. ఋషులు, సాధువుల సమాహారం ఉన్న ఈ సంగమంలో, భారీ సంఖ్యలో భక్తులు చేరుకుంటారు. మహా కుంభ మేళాలో ప్రతి ఒక్కరూ చూడాలనుకునే విధంగా విభిన్న దృశ్యంతో కనుల విందు చేస్తుంది. మీరు కూడా మహా కుంభ మేళాలో పాల్గొనడానికి ప్రయాగ్‌రాజ్‌కి వెళ్లాలని ప్లాన్ చేస్తుంటే.. మీ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని మరింత ప్రశాంతంగా మార్చుకోవడానికి అక్కడ ఉన్న కొన్ని ప్రసిద్ధ దేవాలయాలను సందర్శించవచ్చు. ఆ ఆలయాలు గుర్తింపు పొందడమే కాదు ప్రాచీన చరిత్ర కూడా ఉంది.

ప్రయాగ్‌రాజ్ ఆధ్యాత్మికంగా ప్రత్యేకమైన నగరం. ఇక్కడ అనేక ప్రధాన సంస్థలతో పాటు, మతపరమైన ప్రదేశాలు కూడా ఉన్నాయి. త్రివేణి సంగమం క్షేత్రం ప్రయాగ్‌రాజ్ ఆధ్యాత్మికంగా కేంద్రంగా మారింది. మహా కుంభ మేళాలో పాల్గొనడానికి వెళ్ళే భక్తులు సమీపంలోని హనుమంతుని దర్శనం చేసుకోవచ్చు, ఇక్కడ నిర్మించిన అనేక పురాతన దేవాలయాలు మీ మహా కుంభ మేళా యాత్రను మరింత ఆనందదాయకంగా మారుస్తాయి. కనుక ఈ ఆలయాల గురించి తెలుసుకుందాం.

ఆది శంకర విమాన మండపం: ప్రయాగ్‌రాజ్‌కి వెళుతున్నట్లయితే తప్పని సరిగా ఆది శంకర విమాన మండపాన్ని సందర్శించండి. ఈ ప్రదేశాన్ని సందర్శించడం ద్వారా ఆధ్యాత్మిక శాంతిని పొందడమే కాదు.. కళాకృతికి ఇది ఒక ప్రత్యేక ఉదాహరణ. కామాక్షి దేవికి అంకితం చేయబడిన ఈ మూడు అంతస్తుల ఆలయం చూడటానికి చాలా అందంగా ఉంటుంది. ఇక్కడ శివుడు, శ్రీ మహా విష్ణువుని కూడా దర్శించుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

అలోపి దేవి ఆలయం: ప్రయాగ్‌రాజ్‌లోని అలోప శంకరి ఆలయాన్ని సందర్శించవచ్చు. ఇక్కడ ఎటువంటి విగ్రహం లేని ఆలయం. అలోపి దేవి ఆలయం శక్తిపీఠంగా పరిగణించబడుతుంది. ఇక్కడ మాతృ దేవత పేరుతో ఊయలను పూజిస్తారు. ఈ ఊయల మీద పందిరి ఏర్పాటు చేయబడింది. ప్రసిద్ధి చెందిన ఈ ఆలయాన్ని సందర్శించేందుకు సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు వస్తుంటారు.

శ్రీ వేణి మాధవ దేవాలయం: ప్రయాగ్‌రాజ్‌లోని శ్రీ వేణి మాధవ్ ఆలయాన్ని కూడా సందర్శించావచ్చు. ఈ ఆలయం త్రివేణీ సంగం ప్రాంతంలోని దర్గంజ్‌లో ఉంది. ఇందులో విష్ణువు మాధవ రూపంలో దర్శనం ఇస్తాడు. సంగమంలో స్నానం చేసిన తర్వాత తప్పనిసరిగా ఈ ఆలయాన్ని సందర్శించాలని నమ్ముతారు.

మంకమేశ్వర మహాదేవ ఆలయం: ప్రయాగ్‌రాజ్‌లోని ప్రసిద్ధ దేవాలయాల గురించి చెప్పాలంటే మంకమేశ్వర మహాదేవ ఆలయం కీర్తి చాలా విస్తృతమైనది. శ్రావణ మాసంలో భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడకు వస్తారు. ఆలయ ప్రాంగణంలో సిద్ధేశ్వర, శ్రణ్ముక్తేశ్వర శివలింగాన్ని చూడవచ్చు, దీనితో పాటు దక్షిణం వైపున హనుమంతుని విగ్రహం కూడా దర్శనం ఇస్తుంది.

ఈ పోస్ట్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో చూడండి
మహా కుంభ్ (@mahakumbh_25) ద్వారా భాగస్వామ్యం చేయబడిన పోస్ట్

నాగవాసుకి దేవాలయం: ప్రయాగ్‌రాజ్‌లోని మహా కుంభ మేళాకు వెళ్లనున్నట్లు అయితే త్రివేణీ సంగం ఒడ్డున ఉన్న ‘నాగవాసుకి ఆలయాన్ని’ సందర్శించడం మర్చిపోవద్దు. ఈ ప్రసిద్ధ ఆలయ వైభవం మిమ్మల్ని ఆకర్షిస్తుంది.

 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..