ఎక్కడా ఒక్క నిమ్మకాయ ధర వేలల్లో ఉండదు. కనుక నిమ్మకాయ ఒకటి అన్ని వేలు ఉండడం ఏమిటి అనుకుంటున్నారా. అవును మీరు విన్నది నిజమే. నిమ్మకాయ వేలం వేస్తే ఒక్క నిమ్మకాయ 35వేల రూపాయల ధర పలికింది. తమిళనాడులో ఈ వింత ఘటన చోటుచేసుకుంది. ఓ ఆలయంలో నిర్వహించిన వేలంలో ఒక్క నిమ్మకాయ ఏకంగా 35 వేల రూపాయలు పలికి ఔరా అనిపించింది.
వాస్తవానికి వేసవి వచ్చిందంటే చాలు నిమ్మకాయ ధర కొండెక్కుతుంది. ఈ విషయం అందరికీ తెలిసిందే.. అయితే పదో పాతికో పెరుగుతాయి కానీ. ఎక్కడా ఒక్క నిమ్మకాయ ధర వేలల్లో ఉండదు. కనుక నిమ్మకాయ ఒకటి అన్ని వేలు ఉండడం ఏమిటి అనుకుంటున్నారా. అవును మీరు విన్నది నిజమే. నిమ్మకాయ వేలం వేస్తే ఒక్క నిమ్మకాయ 35వేల రూపాయల ధర పలికింది. తమిళనాడులో ఈ వింత ఘటన చోటుచేసుకుంది. ఓ ఆలయంలో నిర్వహించిన వేలంలో ఒక్క నిమ్మకాయ ఏకంగా 35 వేల రూపాయలు పలికి అందరికి షాక్ ఇచ్చింది. వివరాల్లోకి వెళ్తే..
ఈరోడ్‌కి 35 కిలోమీటర్ల దూరంలోని శివగిరి గ్రామ సమీపంలోని పాతపూసయ్య ఆలయంలో శివరాత్రి సందర్భంగా ఆ మహా శివుడికి నిర్వహించిన పూజల్లో పండ్లు, నిమ్మకాయలు వంటి వాటిని వినియోగించారు. అలా పూజ చేసిన వస్తువులను ఆలయ అధికారులు వేలం వేయడం ఆ ఆలయ సంప్రదాయం. ఇలా వేలం వేసినప్పుడు పూజలో పెట్టిన నిమ్మకాయను ఆలయ పూజారి వేలం వేయగా ఓ భక్తుడు 35 వేల రూపాయలకు దక్కించుకున్నాడు.
మహా శివరాత్రి ఉత్సవాల సందర్భంగా శివుడికి సమర్పించిన నిమ్మకాయ, పండ్లతోపాటు ఇతర వస్తువులను ఆచారం ప్రకారం వేలం వేశారు. ఈ వేలంలో సుమారు 15 మంది భక్తులు పాల్గొన్నారు. అయితే అన్ని వస్తువుల కంటే వేలంలో నిమ్మకాయను అధిక ధరకు పడుకున్నారని.. 35వేలకు నిమ్మకాయను ఓ భక్తుడు దక్కించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. వేలంలో నిమ్మకాయ దక్కించుకున్న భక్తుడికి ఆ నిమ్మకాయను కూడా మళ్ళీ శివుడి ముందు ఉంచి పూజ చేసి ఆలయ పూజారి.. అక్కడ ఉన్న భక్తుల సమక్షంలో అందజేశారు.
ఈ ఆలయంలో శివ రాత్రి సందర్భంగా చేసే పూజలో స్వామివారికి సమర్పించిన నిమ్మకాయను సొంతం చేసుకోవడం అదృష్టంగా భక్తులు భావిస్తారు. ఇలా నిమ్మకాయ దక్కిన వారి ఇంట అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయని.. ఆయురారోగ్యాలతో ఉంటారని విశ్వాసం. అందుకనే ప్రతి ఏడాది శివరాత్రి ఉత్సవం అనంతరం.. నిమ్మకాయ వేలంపాటను నిర్వహిస్తారు. అయితే ఇలా ఒక్క నిమ్మకాయ వేలలో పలకడం ఇదే మొదటి సారి.. దీంతో ప్రజలు ఆశర్య పడ్డారు. శివుడి పూజలు అందుకున్న వస్తువులను దక్కించుకున్నవారు ఎల్లపుడూ సుఖ సంతోషాలతో జీవిస్తారని స్థానికుల నమ్మకం.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..