2025లో ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభ మేళా జాతర ప్రారంభం కానుంది. ఈ కుంభమేళా సమయంలో నాగ సాధువులు కనిపిస్తారు. నాగ సాధువుల గురించి వినే ఉంటారు. లేదా చదివి ఉంటారు. అయితే మహిళా నాగ సాధుల గురించి చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. నిజానికి పురుషులు నాగ సాధువుల వలెనే.. మహిళా నాగ సాధువులు కూడా ఉన్నారు. పురుషుల్లాగే స్త్రీలు కూడా నాగ సాధువులు అవుతారు.
మహిళా నాగ సాధువులు కూడా తమ జీవితమంతా భగవంతుడికి అంకితం చేస్తారు. తమ జీవితాంతం భగవంతుని భక్తిలో నిమగ్నమై ఉంటారు. మగ నాగ సాధువుల వలె.. స్త్రీ నాగ సాధువుల జీవితంలోని రహస్యాలు ఇప్పటికీ బహిర్గతం కాలేదు. అయితే స్త్రీ నాగ సాధువు ఎలా అవుతుంది? మహిళా నాగ సాధువుల రోజువారీ జీవితం ఏమిటి? వారి దినచర్య ఏమిటి? వంటి అనేక ప్రశ్నలకు సమాధానం .. మహిళా నాగ సాధువులకు సంబంధించిన అనేక విషయాలను గురించి ఈ రోజు తెలుసుకుందాం..
స్త్రీలు నాగ సాధువులుగా మారడం అంత ఈజీ కాదని అంటున్నారు. మహిళలు నాగ సాధువులుగా మారే ప్రక్రియ అంత సులభం కాదు. ఇది చాలా కష్ట తరం. మహిళా నాగ సాధువులు చాలా కష్టమైన తపస్సు చేస్తారు. ఆడ నాగ సాధువు జీవితమంతా భగవంతుని అనుగ్రహం కోసం ప్రార్ధిస్తూ ఉంటారు. ఆడ నాగ సాధువులు బయటి ప్రపంచంలో చాలా అరుదుగా కనిపిస్తారు. ఆడ నాగ సాధువులు అడవులు, అఖారాలలో నివసిస్తారు. అనేక సంవత్సరాలు కఠోర తపస్సు చేస్తుంది.
ఎవరైనా స్త్రీ నాగ సాధువుగా మారాలని కోరుకుంటే.. ఆమె మొదటి 6 నుంచి 12 సంవత్సరాల వరకు కఠిన బ్రహ్మచర్యం పాటించాలి. ఈ నియమం పూర్తి చేసిన.. విజయం సాధించిన స్త్రీకి నాగ సాధువుగా మారేందుకు గురువులు అనుమతి ఇస్తారు. నాగ సాధువుగా మారిన మహిళ గత జీవితం గురించిన సమాచారాన్ని తెలుసుకుంటారు. అలాగే నాగ సాధువుగా మారిన స్త్రీ తన సామర్థ్యాన్ని చూపించి తన గురువులను ఒప్పించాలి.
ఇది మాత్రమే కాదు.. నాగ సాధువుగా మారాలనుకున్న స్త్రీ బ్రహ్మచర్యం దీక్ష అనంతరం ఆమె జుట్టు తీసి తల గుండు చేస్తారు. నాగ సాధువు కావడానికి అత్యంత ముఖ్యమైన దశ పిండ ప్రదానం. ఆడ నాగ సాధువు కావడానికి.. ముందు బతికి ఉండగానే పిండ ప్రదానం నిర్వహించుకోవాల్సి ఉంటుంది. ఇలా పిండ ప్రదానం చేసిన తరువాత.. స్త్రీ తన జీవితం పూర్తి స్వేచ్ఛను పొందుతుంది. దీని తరువాత మహిళా నాగ సాధు ఇప్పుడు ఆధ్యాత్మిక యాత్ర మొదలవుతుంది. తన జీవితమంతా దేవునికి అంకితం చేయనున్నానని ప్రమాణం చేస్తుంది.
మగ నాగ సాధువులు నగ్నంగా పూజిస్తారు.. అయితే ఆడ నాగ సాధువులు కాషాయం రంగు దుస్తులు ధరించవచ్చు. అయితే ఆ వస్త్రానికి ఎక్కడా కుట్లు ఉండరాదు. మహిళా నాగ సాధువుల నుదుటిపై తిలకం ఉంటుంది. ఆమె తన శరీరమంతా భస్మాన్ని పూసుకుంటుంది. నాగ సాధువుల వలె వీరు కూడా కుంభమేళా సమయంలో రాజ స్నానం చేస్తారు. అయితే వేరే ప్రదేశంలో ఉంటారు. మహిళా నాగ సాధువులు ఆధ్యాత్మిక చింతనలో సాధారణ జీవితాన్ని గడుపుతారు.
మరిన్ని ఆధ్మాతిక వార్తల కోసం క్లిక్ చేయండి..
నోట్ : పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి.