Mystery Temple: ఈ శివాలయంలో త్రిశూలానికి బదులుగా పంచశూలాన్ని ఎందుకు ఉపయోగించారు.. ఈ ఆలయం రహస్యం ఏమిటో తెలుసా?

|

Jan 17, 2023 | 6:56 AM

ఈ ఆలయం జ్యోతిర్లింగంతో పాటు, మరో ప్రత్యేకతను కలిగి ఉంది. అది ఏమిటంటే..  త్రిశూలానికి బదులుగా పంచశూలాన్ని శిఖరంపై ఉంటుంది. దీని వెనుక ఉన్న సనాతన ధర్మంలోని మతపరమైన  రహస్యం గురించి వివరంగా తెలుసుకుందాం.

Mystery Temple: ఈ శివాలయంలో త్రిశూలానికి బదులుగా పంచశూలాన్ని ఎందుకు ఉపయోగించారు.. ఈ ఆలయం రహస్యం ఏమిటో తెలుసా?
Pancha Shul In Shiva Temple
Follow us on

త్రిమూర్తులలో ఒకరు లయకారుడైన శివయ్య ఆరాధనకు శివాలయం లేని ప్రదేశం దేశంలో ఎక్కడా లేదు. సనాతన సంప్రదాయంలో.. శివుడిని ప్రసన్నం చేసుకోవడం అత్యంత సులభం. దేవుడిని నమ్మి అత్యంత విశ్వాసంతో జలంతో అభిషేకించినా చాలు కోరిన కోర్కెలు తీర్చే  భోలాశంకరుడు శివయ్య. అయితే శివాలయ నిర్మాణంలో కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి. అటువంటి శివాలయం జార్ఖండ్‌లోని డియోఘర్‌లో ఉంది. ఈ ఆలయం పన్నెండు జ్యోతిర్లింగాలలో అత్యంత ప్రతిష్టాత్మకంగా పరిగణించబడుతుంది. అవును దేవఘర్‌లో ఉన్న బాబా వైద్యనాధుడు ఆలయం గురించి ఈరోజు చెబుతున్నాం. ఇక్కడ ప్రతిరోజూ వేలాది మంది శివ భక్తులు మహాదేవుడిని దర్శించుకోవడానికి , పూజించడానికి భరీ సంఖ్యలో చేరుకుంటారు. ఈ ఆలయం జ్యోతిర్లింగంతో పాటు, మరో ప్రత్యేకతను కలిగి ఉంది. అది ఏమిటంటే..  త్రిశూలానికి బదులుగా పంచశూలాన్ని శిఖరంపై ఉంటుంది. దీని వెనుక ఉన్న సనాతన ధర్మంలోని మతపరమైన  రహస్యం గురించి వివరంగా తెలుసుకుందాం.

పంచశూలం అంటే ఏమిటి
శివుని ఆలయంలో ఉంచిన త్రిశూలంలో, మూడు కోణాలతో ఆయుధం ఉంటుంది. ఈ త్రిశూలం శివునికి ఇష్టమైన ఆయుధంగా పరిగణించబడుతుంది. ఏ పగోడాలోనైనా, అది శివలింగమైనా, మహాదేవుని విగ్రహమైనా, ఈ త్రిశూలంతో అలంకరించబడి ఉంటుంది. అయితే పంచ శూలం లో అయితే ఐదు కోణాల ముక్కులను తయారు చేస్తారు.

పంచశూలం ప్రాముఖ్యత
ఐదు సంఖ్య శివునికి చాలా ప్రీతికరమైనదని నమ్ముతారు. దేశంలోని అనేక ప్రాంతాల్లో పంచముఖి మహాదేవ ఆలయాలు కనిపించడానికి కారణం ఇదే. అదేవిధంగా, పంచముఖి రుద్రాక్ష, శివ పంచాక్షరి మంత్రం మొదలైనవి వారి సాధనకు అత్యంత పవిత్రమైనవి. ప్రయోజనకరమైనవిగా పరిగణించబడుతున్నాయి. అదేవిధంగా, డియోఘర్‌లోని బాబా వైద్యనాథ ఆలయం శిఖరంపై ఏర్పాటు చేసిన పంచశూలం మనిషిలోని ఐదు దుర్గుణాలు, కామం, కోపం, లోభం, దురాశ, అసూయ నుండి కాపాడుతుందనివిశ్వాసం.

ఇవి కూడా చదవండి

రామకథకు పంచశూలానికి గల సంబంధం ఏమిటంటే..
వైద్యనాథ ఆలయంలో ప్రతిష్టించిన పంచశూలం మనిషిని అన్ని బాధలను దూరం చేస్తుంది. వాస్తు, మతపరమైన దృక్కోణంలో దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది. త్రేతాయుగంలో.. లంక రాజు రావణుడు తన బంగారు నగరంలో పంచశూలాన్ని ప్రతిష్టించాడని నమ్ముతారు. ఎందుకంటే ఇది ఉన్న చోట ఒక రక్షణ కవచంగా మారుతుందని విశ్వాసం.  పంచాక్షరీమంత్రంగా కలిగిన పంచముఖ శివునకు పంచప్రాణాలు అంతర్నిహితంగా కలిగిన శివతత్త్వమే పంచశూలం  అని అర్ధం. పంచశూల రక్షణ కవచాన్ని ఎలా చేధించాలో ఒక్క రావవణుడికి మాత్రమే తెలుసు అని నమ్ముతారు. అటువంటి పరిస్థితిలో.. శ్రీరాముడు .. అతని సైన్యం లంకలోకి ప్రవేశించడం కష్టం..అయితే విభీషణుడి సహాయంతో, లంకలోకి ప్రవేశించే సమాచారం తెలుసుకుని.. లంకా నగర ప్రవేశం చేసి.. లంకదీశుడైన రావణుడిని సంహరించాడు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

(Note: ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)