Kanipakam Temple: రెండు రోజుల్లో కాణిపాకం వినాయక టెంపుల్ మూసివేత.. మూలవిరాట్ దర్శనం మళ్ళీ వినాయకచవితి నుంచే..

|

Mar 26, 2022 | 9:13 AM

Kanipakam Temple: చిత్తూరు జిల్లా(Chittoor District) లోని ప్రముఖ పుణ్యక్షేత్రం కాణిపాకం. ఇక్కడ శ్రీ వరసిద్ధి వినాయక ఆలయ(Sri Varasiddhivinayaka Temple) పునర్నిర్మాణ పనులు చేపట్టనున్నామని..

Kanipakam Temple: రెండు రోజుల్లో కాణిపాకం వినాయక టెంపుల్ మూసివేత.. మూలవిరాట్ దర్శనం మళ్ళీ వినాయకచవితి నుంచే..
Kanipakam Temple
Follow us on

Kanipakam Temple: చిత్తూరు జిల్లా(Chittoor District) లోని ప్రముఖ పుణ్యక్షేత్రం కాణిపాకం. ఇక్కడ శ్రీ వరసిద్ధి వినాయక ఆలయ(Sri Varasiddhivinayaka Temple) పునర్నిర్మాణ పనులు చేపట్టనున్నామని దేవస్థాన అధికారులు చెప్పారు. ఈ నేపథ్యంలో వినాయక మూలవిరాట్ దర్శనం భక్తులకు ఇక రెండు రోజులు మాత్రమేనని తెలిపారు. స్వామివారి ఆలయాన్ని రీమోడల్ చేస్తున్న నేపథ్యంలో గర్భాలయాన్ని దేవస్థానం మూసివేయనుంది. మళ్ళీ స్వయంభు వినాయకుడి మూలవిరాట్ పునః దర్శనం ఆగష్టు 31వ తేదీ వినాయక చవితి రోజు నుంచి మళ్ళీ భక్తులకు అందుబాటులోకి దేవస్థానం తీసుకుని రానున్నట్లు ప్రకటించింది.

అయితే అప్పటి వరకూ తాత్కాలికంగా స్వామివారి దర్శనం కోసం ఆలయ ప్రాంగణంలో బాల వినాయక ఆలయాన్ని దేవస్థానం నిర్మించింది. ఈ ప్రత్యేక బాల విఘ్నేశ్వరుడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట చేశారు. ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హోమాలు నిర్వహించి అనంతరం భక్తులకు సోమవారం నుంచి దర్శనం కలిగేలా చర్యలు తీసుకోనున్నారు.

Also Read: Olive Ridley Turtle: అరుదైన తాబేళ్లపాలిట యమపాశాలుగా నిషేధిత వలలు.. మృతి చెందుతున్న తాబేళ్ల స్పెషాలిటీ ఏమిటంటే

 

సమ్మర్ స్పెషల్ న్యూడిల్స్ ఐస్ క్రీమ్ అంటున్న రెస్టారెంట్.. వద్దుబాబోయ్ అంటున్న ఆహారప్రియులు