IRCTC – Ramayan Yatra: రామ భక్తులకు గుడ్‌ న్యూస్‌.. శ్రీరామాయణ యాత్రకు స్పెషల్‌ ట్రైన్స్‌.. ఎప్పటినుంచంటే..!

|

Sep 25, 2021 | 10:00 AM

IRCTC - Ramayan Yatra: రామభక్తులకు నిజంగా ఇది గుడ్‌న్యూస్‌ అనే చెప్పాలి. రామాయణ యాత్రకు వెళ్ళాలనుకునే భక్తుల కోసం ఇండియన్‌ రైల్వే స్పెషల్ టూరిస్ట్‌ రైళ్లను ప్రారంభిస్తోంది.

IRCTC - Ramayan Yatra: రామ భక్తులకు గుడ్‌ న్యూస్‌.. శ్రీరామాయణ యాత్రకు స్పెషల్‌ ట్రైన్స్‌.. ఎప్పటినుంచంటే..!
Ramayana
Follow us on

IRCTC – Ramayan Yatra: రామభక్తులకు నిజంగా ఇది గుడ్‌న్యూస్‌ అనే చెప్పాలి. రామాయణ యాత్రకు వెళ్ళాలనుకునే భక్తుల కోసం ఇండియన్‌ రైల్వే స్పెషల్ టూరిస్ట్‌ రైళ్లను ప్రారంభిస్తోంది. ‘దేఖో అప్నా దేశ్‌’ పేరుతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పథకంలో భాగంగా శ్రీ రామాయ‌ణ్ యాత్ర పేరుతో డీల‌క్స్ ఏసీ టూరిస్ట్ రైళ్లను ప్రారంభిస్తోంది. 17 రోజుల పాటు సాగే ఈ యాత్రలో శ్రీరాముని భ‌క్తులు దేశంలోని అధ్యాత్మిక కేంద్రాల‌ను సంద‌ర్శించ‌వ‌చ్చు.

దీనికి సంబంధించిన పూర్తి వివరాలను పరిశీలిస్తే.. దేశంలోని పుణ్యక్షేత్రాలను చుట్టి రావాలనుకునే వారికి ఇండియన్ రైల్వేస్ ఒక అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తోంది. హిందూమతంలో రామాయణ ఇతిహాసానికి ఉన్న ప్రాధాన్యత చెప్పలేనిది. ధర్మబద్ధమైన జీవనానికి మార్గదర్శకమైన రామాయణ మహాగ్రంధం ఎంతో ఆదర్శప్రాయం. రామాయణం జరిగిందనడానికి నేటికీ ప్రత్యక్ష్య సాక్ష్యాలుగా నిలిచే అనేక ప్రదేశాలను ఈ ట్రైన్ ద్వారా యాత్రికులు సందర్శించే అవకాశాన్ని కల్పిస్తోంది. దీనికి సంబంధించి ఇండియన్ రైల్వేస్ నుంచి తాజాగా రామాయణ ఎక్స్ ప్రెస్ మరో ఎడిషన్ ను ప్రారంభించబోతున్నట్లు రైల్వే బోర్డ్ ప్రకటించింది.

అధికారిక సమాచారం ప్రకారం.. న‌వంబ‌ర్ 7వ తేదీన ఢిల్లీలోని స‌ఫ్దర్జంగ్ రైల్వే స్టేష‌న్ నుంచి రామాయ‌ణ ఎక్స్ ప్రెస్ రైలు బయలుదేరుతుంది. ఈ యాత్రకు వెళ్ళాలనుకునేవారు ఐఆర్సీటీసీ వెబ్‌సైట్‌లో త‌మ టికెట్లను బుక్ చేసుకోవాలి. అయితే, ప్రయాణికులంతా కోవిడ్‌-19 రెండు డోస్‌లు వేసుకున్న స‌ర్టిఫికెట్లు వెంట తెచ్చుకోవాలి. ఈ యాత్రలో ప్రయాణికులు సుమారు 7,500 కి.మీ. దూరం ప్రయాణిస్తారు. ఈ రైలులో 156 మంది ప్రయాణీకులు ప్రయాణించవచ్చు. మొదటి ట్రైన్ బుకింగ్ దాదాపు పూర్తి అయినట్లు సమాచారం. ఈ పర్యటన ప్యాకేజీ ధర కనిష్టంగా 7,560 రూపాయలు కాగా గరిష్టంగా 16,065 రూపాయలుగా అధికారిక ప్రకటనలో తెలిపింది రైల్వే బోర్డ్. కోవిడ్‌ భద్రతాచర్యల్లో భాగంగా పర్యాటకులందరికీ ఫేస్ మాస్క్‌లు, హ్యాండ్ గ్లోవ్స్, శానిటైజర్‌తో కూడిన ఐఆర్‌సిటిసి సేఫ్టీ కిట్‌ను కూడా అందిస్తోంది. రైల్వే రెస్టారెంట్ల నుంచి ఆన్ బోర్డ్ వెజిటేరియ‌న్ భోజ‌న వ‌స‌తి క‌ల్పిస్తారు. ప్రయాణికులంద‌రికీ ట్రావెల్ ఇన్సూరెన్స్ సౌక‌ర్యం కూడా ఉంటుంది. ప్రయాణికుల‌కు పూర్తి భ‌ద్రత క‌ల్పిస్తారు.

Also read:

Divorce Party: 17 ఏళ్ల వైవాహిక బంధానికి ఎండ్ కార్డ్.. గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్న మహిళ..!

Andhra Pradesh: ఆరు నెలలకే స్కూల్ హెడ్‌మాస్టర్ బదిలీ.. ఆ పిల్లల వేదన అంతా ఇంతా కాదు..

పాలను పదే పదే మరిగిస్తున్నారా.? ఈ విషయం తెలిస్తే ఇకపై ఆ పని చేయరు.. వీడియో