Ayodhya Ram Mandir: అయోధ్య రామమందిర నిర్మాణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. రామాలయం నిర్మాణం కోసం తవ్వకాలు జరుపుతుండగా అత్యంత ప్రాచీనమైన విగ్రహాలు, చరణ పాదుకలు లభ్యమయ్యాయి. ఏళ్లతరబడి నలిగిన అయోధ్య రామమందిరం వివాదం.. సుప్రీంకోర్టు తీర్పుతో సమసిపోయింది. దేశ అత్యున్నత న్యాయ స్థానం ఆదేశాలతో అయోధ్యలో రామ మందిరం నిర్మాణ పనులు చేపట్టారు రామజన్మభూమి తీర్థ ట్రస్ట్ నిర్వాహకులు. గత ఏడాది ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా రామాలయం నిర్మాణం కోసం శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆలయ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఆలయ నిర్మాణం కోసం తవ్వకాలు చేపడుతుండగా.. అత్యంత పురాతన అవశేషాలు లభ్యమయ్యాయి. చరణ పాదుకలతో పాటు.. ప్రాచీన విగ్రహాల అవశేషాలు బయటపడ్డాయి. వీటిని గమనించిన రామజన్మభూమి తీర్థ ట్రస్ట్ నిర్వాహకులు.. జాగ్రత్తగా బయటకు తీశారు. వాటిని సురక్షితంగా భద్రపరిచారు. కాగా, తవ్వకాల్లో బయటపడిన వీటిని పురావస్తు శాస్త్రవేత్తలు పరిశీలిస్తారని ట్రస్ట్ నిర్వాహకులు తెలిపారు. కాగా, ఇంతకు ముందు కూడా ఇలాగే ప్రాచీన విగ్రహాలు లభ్యమైనట్లు రామజన్మభూమి ట్రస్ట్ నిర్వాహకులు చెబుతున్నారు. ఈ తవ్వకాల్లో బయటపడిన వస్తువులన్నింటినీ.. తదుపరి నిర్మించబోయే మ్యూజియంలో ఏర్పాటు చేస్తామని చెప్పారు.
Also read:
Gold Rates Today: బంగారం కొనాలనుకుంటున్నారా?.. అయితే ఈ గుడ్ న్యూస్ మీకోసమే.. ఇవాళ ఏకంగా…