Tirumala Rush: శ్రీవారి భక్తులకు అలెర్ట్.. స్వామివారి దర్శనానికి పోటెత్తిన భక్తులు.. దర్శనానికి 15 గంటల సమయం

|

May 14, 2022 | 7:16 PM

తిరుమల క్షేత్రంలో వారంతపు సెలవుల కారణంగా అనూహ్యంగా భక్తుల రద్దీ పెరిగింది. స్వామివారి దర్శనం కోసం భక్తులు వేచి చూస్తున్న భక్తులతో వైకుంఠ క్యూ కాంప్లెక్స్ కంపార్టుమెంట్లు నిండిపోయాయి..

Tirumala Rush: శ్రీవారి భక్తులకు అలెర్ట్.. స్వామివారి దర్శనానికి పోటెత్తిన భక్తులు.. దర్శనానికి 15 గంటల సమయం
Tirumala Rush
Follow us on

Tirumala Rush: ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతిలో కొలువైన శ్రీవెంకటేశ్వర స్వామిని( Sri Venkateswara Swami) దర్శించుకోవడానికి తెలుగు రాష్ట్రాలతో(Telugu states) పాటు, ఇతర రాష్ట్రాల నుంచి దేశ విదేశాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు వస్తారు. దీంతో స్వామివారి క్షేత్రంలో భక్తుల రద్దీ నెలకొంది. ఓ వైపు కరోనా తగ్గుముఖం పట్టడంతో భక్తులకు సర్వదర్శనానికి అనుమతిని ఇచ్చారు. మరోవైపు వేసవికాలం.. శని, ఆదివారాలు సెలవు దినాలు కావడంతో శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. దీంతో తిరుమల గిరులు భక్త సంద్రంతో నిండిపోయాయి. దీంతో స్వామివారి దర్శనానికి భక్తులు క్యూ లైన్లలో గంటల తరబడి ఎదురు చూడాల్సి వస్తుంది.

తిరుమల క్షేత్రంలో వారంతపు సెలవుల కారణంగా అనూహ్యంగా భక్తుల రద్దీ పెరిగింది. స్వామివారి దర్శనం కోసం భక్తులు వేచి చూస్తున్న భక్తులతో వైకుంఠ క్యూ కాంప్లెక్స్ కంపార్టుమెంట్లు నిండిపోయాయి. అంతేకాదు మరో రెండు కిలోమీటర్ల మేర భక్తులు వేచి చూస్తున్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి 15 గంటల సమయం పడుతుంది. మరోవైపు  తిరుమలకు చేరుకున్న యాత్రికులకు అద్దె గదుల కొరత ఏర్పడింది. రద్దీకి సరిపడా గదులు లేకపోవడంతో కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..