Tirumala Tirupati: తిరుమలలో అనూహ్యంగా పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 36 గంటల సమయం..

|

Aug 14, 2022 | 8:46 AM

Tirumala Tirupati: తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. తిరుమల కొండ నిండా భక్తులే ఉన్నారు. వీకెండ్ కావడంతో భక్తులు భారీగా తరలివచ్చారు.

Tirumala Tirupati: తిరుమలలో అనూహ్యంగా పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 36 గంటల సమయం..
Tirumala
Follow us on

Tirumala Tirupati: తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. తిరుమల కొండ నిండా భక్తులే ఉన్నారు. వీకెండ్ కావడంతో భక్తులు భారీగా తరలివచ్చారు. తిరుమల శ్రీవారి దర్శనానికి 36 గంటల సమయం పడుతోంది. వైకుంఠము రెండు లోని 33 కంపార్ట్మెంట్ లన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వైకుంఠము ఒకటి లోని 16 కంపార్ట్ మెంట్‌లో భక్తులు నిండిపోయారు. ఒక్కో కంపార్ట్మెంట్ లో 500 మంది భక్తులు వేచి ఉన్నారు. గంటకు 4 వేల మంది భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు అధికారులు. మరోవైపు పెరుగుతున్న క్యూలైన్‌తో దాదాపు 4 కిలో మీటర్ల వరకు చేరారు భక్తులు. 7 నారాయణ గిరి షెడ్లలోనూ భక్తులు నిండిపోయారు.

ఏటిసి సర్కిల్ నుంచి ఎస్ఎంసి మీదుగా లేపాక్షి, రామ్ భగీచ, ఫైర్ స్టేషన్, వరహా స్వామి గెస్ట్ హౌస్, సేవా సదన్ నుంచి స్వామి దర్శనం కోసం క్యూ లైన్‌లోకి భక్తులను అనుమతిస్తున్నారు టీటీడీ అధికారులు. మరి కాసేపట్లో గో గర్భం డ్యాం వరకు భక్తులు చేరే అవకాశం కనిపిస్తోంది. భక్తులు రద్దీ ఎక్కువగా ఉండటంతో.. వసతి సౌకర్యం దొరక్క ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు భక్తులు. ఇకపోతే, భక్తుల రద్దీ నేపథ్యంలో ఈనెల 21వ తేదీ వరకు బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది టీటీడీ. కాగా, అనూహ్యంగా భక్తులు పోటెత్తడంతో శ్రీవారి సేవా సదన్ వరకు రద్దీ నెలకొంది. శనివారం నాడు 83,422 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమల ఆదాయం రూ. 4.27 కోట్లు వచ్చిందని టీటీడీ వెల్లడించింది. 50,100 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..