Maha Shivaratri 2023: ఈ మహిమాన్విత శివ క్షేత్రాల గురించి మీకు తెలుసా? జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాల్సిందే..

|

Feb 17, 2023 | 5:30 PM

దేశంలోని ప్రధాన శివాయాలు ఏవి? అవి ఎక్కడ ఉన్నాయి? వాటి విశిష్టత ఏమిటి? భక్తుల్లో వాటిపై ఉన్న విశ్వాసాలు వంటి వివరాలు ఇప్పుడు చూద్దాం..

Maha Shivaratri 2023: ఈ మహిమాన్విత శివ క్షేత్రాల గురించి మీకు తెలుసా? జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాల్సిందే..
Follow us on

శివ పూజకు భక్తులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మహాశివరాత్రి సమీపించడంతో శివాలయాల్లో ఏర్పాట్లు చురుగ్గా చేస్తున్నారు. మన దేశంలో హిందువుల ప్రాముఖ్యమైన పండుగలలో మహాశివరాత్రి ఒకటి. ఏడాది పొడవునా ఈ పండుగ కోసం వారు ఆత్రుతగా ఎదురుచూస్తారు. ఆరోజు రాత్రంతా ఉపవాసంతో జాగారం చేస్తారు. శివాలయాలకు పోటెత్తుతారు. శివలింగానికి అభిషేకాలు చేసి, శివ, గౌరీలకు మొక్కుబడులు చెల్లిస్తారు. ఇలా చేయడం ద్వారా తమ అవసరాలు తీరుతాయని భక్తుల విశ్వాసం. ఈ నేపథ్యంలో దేశంలోని ప్రధాన శివాయాలు ఏవి? అవి ఎక్కడ ఉన్నాయి? వాటి విశిష్టత ఏమిటి? భక్తుల్లో వాటిపై ఉన్న విశ్వాసాలు వంటి వివరాలు ఇప్పుడు చూద్దాం..

రామేశ్వరం జ్యోతిర్లింగం (తమిళనాడు).. రామేశ్వరం ఒక పవిత్ర పుణ్యక్షేత్రం. ఇది తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో ఉంది. ఇక్కడ ప్రతిష్టితమైన శివలింగం పన్నెండు ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఉత్తర భారతదేశంలో కాశీ ఎలా గుర్తించబడిందో, రామేశ్వరం దక్షిణాన అదే స్థాయిని కలిగి ఉంది. సముద్రం మీద వంతెన (రామసేతు) నిర్మించడానికి ముందు రాముడు ఇక్కడ శివలింగాన్ని స్థాపించారని నమ్ముతారు. ఆయన ఇక్కడ శివునికి ప్రార్థనలు కూడా చేసారని భక్తులు విశ్వసిస్తారు.. అందుకే ఈ ఆలయాన్ని రామేశ్వరం అని పిలుస్తారు.

టుటీ జర్నా టెంపుల్ (జార్ఖండ్).. జార్ఖండ్‌లోని రామ్‌ఘర్‌లో టుటీ జర్నా ఆలయం ఉంది. ఈ ఆలయంలోని అతి పెద్ద విశేషం ఏమిటంటే, ఈ ఆలయంలో ప్రతిష్టించిన పవిత్ర శివలింగానికి సహజంగా నిరంతరం అభిషేకం జరుగుతూ ఉంటుంది. పూర్వం ఇక్కడి శివలింగంపై రాళ్ల నుంచి నీళ్లు పడేవి. తరువాత గంగా దేవి విగ్రహాన్ని నిర్మించి, గంగాదేవి చేతుల నుంచి వచ్చే నీటి నుండి శివలింగానికి అభిషేకం చేస్తున్నట్లుగా కనిపించేలా ఏర్పాట్లు చేశారు. ఈ ఆలయంలో పూజలు చేయడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం.

పౌరివాలా శివధామ్ (హిమాచల్ ప్రదేశ్).. ఈ శివధామ్ హిమాచల్ ప్రదేశ్‌లోని సిర్మూర్ జిల్లాలో నహాన్ నుంచి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయంలో మూడు నుంచి నాలుగు అడుగుల ఎత్తైన శివలింగాన్ని ప్రతిష్టించారు. ఈ శివలింగం త్రేతా యుగానికి చెందినదని, ప్రతి సంవత్సరం ఒక బియ్యం గింజతో సమానంగా పెరుగుతుందని నమ్ముతారు. పౌరీ వాలా వద్ద ఉన్న ఈ శివలింగంలో శివుడు ఉన్నాడని కూడా ఒక నమ్మకం ఉంది, ఇక్కడ ప్రార్థించిన ప్రతి భక్తుడి కోరికలు నెరవేరుతాయని విశ్వాసం.

లింగరాజ దేవాలయం (ఒడిశా).. ఒడిశాలోని లింగరాజ ఆలయం శివునికి అంకితం చేయబడింది. కానీ ఆయనతో పాటు, విష్ణువు కూడా ఇక్కడ పూజించబడతాడు, అందుకే దీనిని హరిహర క్షేత్రం అని కూడా పిలుస్తారు. ఒడిశాలోని దేవాలయాల నగరంలో ఉన్న ఈ ఆలయం చాలా పెద్దది. అద్భుతమైన చరిత్రను కలిగి ఉంది.

మృడేశ్వర్ మహాదేవ్ (గుజరాత్).. మృడేశ్వర్ మహాదేవ్ ఆలయం గుజరాత్‌లోని గోద్రాలో ఉంది. ఈ శివలింగం పరిమాణం ఒక సంవత్సరంలో ఒక బియ్యం గింజతో సమానంగా పెరుగుతుంది. ఇలా పెరుగతూ లింగం పరిమాణం ఎనిమిదిన్నర అడుగులు అవుతుందని, ఆ రోజు అది ఆలయ పైకప్పును తాకుతుందని ఒక నమ్మకం. ఇది జరిగిన రోజు విపత్తు వస్తుందని చెబుతారు. మృడేశ్వర్ శివలింగం యొక్క ప్రత్యేకత ఏమిటంటే, సహజంగా దాని నుండి నీటి ప్రవాహం వస్తూ ఉంటుంది, ఇది శివలింగానికి అభిషేకం చేస్తుంది.

త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం (నాసిక్).. మహారాష్ట్రలోని నాసిక్ నగరంలో ఉన్న త్రయంబకేశ్వర జ్యోతిర్లింగాన్ని చాలా పవిత్రంగా భావిస్తారు. ఇది శివుని ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి. ఆలయం లోపల ఒక చిన్న గొయ్యిలో మూడు చిన్న లింగాలు ఉన్నాయ. ఇవి బ్రహ్మ, విష్ణు, శివ – ముక్కోటి దేవతల చిహ్నాలుగా పరిగణించబడుతున్నాయి. పురాతన కాలంలో ఈ ప్రదేశం గౌతమ రుషి తపోభూమి అని నమ్ముతారు. తనపై విధించిన గోహత్య పాపాన్ని పోగొట్టుకోవడానికి, శివుని తపస్సు చేసి గోదావరిని ఇక్కడకు తెచ్చుకున్నాడని ప్రతీక.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం..