
హిందూ మత విశ్వాసాల ప్రకారం ఏడాదిలో వచ్చే ప్రతీ పౌర్ణమికి విశేషమైన ప్రాముఖ్యత ఉంది. ఆరోజు చేసే పూజ, దానాలతో అపారమైన పుణ్యం పొందడంతోపాటు జీవితంలో ప్రతికూలతలు తొలగిపోతాయని భావిస్తారు. పౌర్ణమి రోజును చంద్రుడు సంపూర్ణంగా ప్రకాశిస్తాడు. పౌర్ణమి రోజున ఆచరించే పవిత్ర స్నానం, సత్యనారాయణ స్వామి వ్రతం, లక్ష్మీపూజ, చంద్రుడి ఆరాధన, ఉపవాసాలు ఆధ్యాత్మిక పురోగతికి, జీవితంలో సానుకూల ప్రయోజనాలు పొందడానికి మార్గంగా భావిస్తారు. ఇక, 2026 సంవత్సరంలో మొత్తం 12 పౌర్ణమి తిథులు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం.
జనవరి 3, 2026 శనివారం – పుష్య శుక్ల పౌర్ణమి
ఫిబ్రవరి 1, 2026, ఆదివారం – మాఘ శుక్ల పౌర్ణమి
మార్చి 3, 2026, మంగళవారం – ఫాల్గుణ, శుక్ల పౌర్ణమి
ఏప్రిల్ 1, 2026, బుధవారం – చైత్ర, శుక్ల పౌర్ణమి
మే 1, 2026, శుక్రవారం – వైశాఖ, శుక్ల పౌర్ణమి
మే 30, 2026, శనివారం- జ్యేష్ఠ, శుక్ల పౌర్ణమి
జూన్ 30 2026, బుధవారం – ఆషాఢ, శుక్ల పౌర్ణమి
ఆగస్టు 27, 2026, గురువారం – శ్రావణ, శుక్ల పౌర్ణమి
28 సెప్టెంబర్ 26, 2026, శనివారం – భాద్రపాద, శుక్ల పౌర్ణమి
అక్టోబర్ 25, 2026, ఆదివారం – ఆశ్వీయుజ, శుక్ల పౌర్ణమి
నవంబర్ 24, 2026, మంగళవారం – కార్తీక, శుక్ల పౌర్ణమి
డిసెంబర్ 23, 2026, బుధవారం- మార్గశిర్ష, శుక్ల పౌర్ణమి
పౌర్ణమి రోజున చంద్రుడు(Moon)ని ఆరాధిస్తే సకల శుభాలు కలుగుతాయని విశ్వాసం. పౌర్ణమి రోజున రాగిపాత్రలో పాలు, నీళ్లు, పూలు, అక్షతలు, కొంచెం చక్కర కలిపి చంద్రోదయం సమయంలో అర్ఘ్యం సమర్పించాలి. ఓం చంద్రాయ నమ:, ఓం సోమాయ నమ: అనే మంత్రాలను అర్ఘ్యం సమర్పించేటప్పుడు పఠించాలి. ఈ మంత్రాలను 108 సార్లు జపిస్తే మరింత శుభప్రదంగా భావిస్తారు. చంద్రుడిని మనస్ఫూర్తిగా ఆరాధించడం వల్ల మానసిక ప్రశాంతతతోపాటు ఏవైనా దోషాలు ఉంటే తొలగిపోతాయని విశ్వాసం.
పౌర్ణమి రోజున మహా శివుడు, శ్రీ మహా విష్ణువు, మహాలక్ష్మికి ప్రత్యేక పూజలు, సత్యనారాయణ వ్రతం వంటి ఉపచారాలు చేస్తే విశేష ఫలితాలు ఉంటాయని చెబుతారు. ఇక, పౌర్ణమి రోజున నదీస్నానం, దీపారాధన, ప్రత్యేక పూజలు, వ్రతాలు ఆచరిస్తే ఎంతో పుణ్యం వస్తుందని, పాపాలు తొలగిపోతాయని ఆధ్యాత్మిక పండితులు చెబుతారు. ఈ రోజు దానాలు చేస్తే మీరు ఎదుర్కొంటున్న అటంకాలు తొలగిపోయి.. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు.
Note: ఈ సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు అందించడం జరిగింది.