God in Dreams Meaning: దేవతలు కలలోకి రావడం దేనికి సంకేతం..? ఫలితం ఏంటో తెలుసా.?

Divine visions dreams: కలలో దేవతలు కనిపించడం అనేది భగవత్ సాక్షాత్కారమా లేక కేవలం భ్రాంతా అనే ప్రశ్నపై బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ విలువైన అంతర్దృష్టిని పంచుకున్నారు. పూర్వ జన్మ సాధన, సూక్ష్మ భూమికల్లోని మనస్థితి ఇటువంటి అనుభవాలకు ఎలా దారితీస్తుందో వివరిస్తూ, సత్యాన్ని, భ్రాంతిని గుర్తించడం ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు.

God in Dreams Meaning: దేవతలు కలలోకి రావడం దేనికి సంకేతం..? ఫలితం ఏంటో తెలుసా.?
God In Dreams

Updated on: Jan 28, 2026 | 11:13 AM

మనం నిద్రిస్తున్న సమయంలో అనేక కలలు వస్తుంటాయి. కలల్లో వచ్చేవి మనకు కొన్ని సంకేతాలిస్తాయని శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. కలలో మనకు మంచి జరిగినట్లు లేదా చెడు సంకేతాలకు సంబంధించినవి కూడా రావచ్చు. ఇవి కొన్ని మన మానసిక పరిస్థితికి సంకేతం కావచ్చు. అయితే, కొన్ని కొన్ని సందర్భాల్లో మనకు కలలో దేవాలయాలు లేదా ఎవరైనా దేవతలు కూడా కనిపించవచ్చు. ఇలా దేవతలు కలలో కనిపించడం ఎలాంటి సంకేతం ఇస్తుందో చాలా మందికి తెలియదు. ఈ అంశంపై బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ చాలా మంచి వివరణ ఇచ్చారు. కలలో దేవతలు రావడం ఎలాంటి సంకేతం ఇస్తుందో ఆయన తెలియజేశారు.

కలలో దేవతలు కనిపించడం అనేది భగవత్ సాక్షాత్కారమా లేక కేవలం భ్రాంతా అనే ప్రశ్నపై బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ విలువైన అంతర్దృష్టిని పంచుకున్నారు. పూర్వ జన్మ సాధన, సూక్ష్మ భూమికల్లోని మనస్థితి ఇటువంటి అనుభవాలకు ఎలా దారితీస్తుందో వివరిస్తూ.. సత్యాన్ని, భ్రాంతిని గుర్తించడం ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు.

కలలో దేవతలు కనిపించడం వెనుక రహస్యం

బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ.. కలలో దేవతలు కనిపించడం, దాని వెనుక ఉన్న రహస్యం గురించి చర్చించారు. చాలామందికి కలలో దేవుళ్లు కనిపిస్తున్నారని, మరికొందరు నిజంగా దర్శనమిచ్చారని చెబుతుంటారనే ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. భగవత్ సాక్షాత్కారం అనేది అసాధ్యం కాదని షణ్ముఖ శర్మ వివరించారు. నిజమైన దైవ దర్శనాలతో పాటు, కొన్ని భ్రాంతులు కూడా ఉంటాయని, వీటిని సరిగ్గా గుర్తించడం ముఖ్యమని ఆయన అన్నారు.

సాధారణంగా దేవుడు అంత తేలికగా కనిపించడం జరగదని, ఇది వ్యక్తుల పూర్వ జన్మ సంస్కారాలు, సాధనపై ఆధారపడి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. స్వప్నం లేదా ధ్యానం వంటి సూక్ష్మ భూమికలలో ఉన్నప్పుడు.. మన మనస్సు భౌతిక ప్రపంచాన్ని దాటుతుంది. కలలో దేవతలు కనిపించినప్పుడు, అది సత్యమా లేక భ్రాంతా అనేది నిర్ణయించుకోవలసిన అవసరం ఉందన్నారు.

దేవుడు కలలోకి వస్తే అవి సాధారణ కలలుగా తోసిపారేయవద్దని సూచించారు. భగవంతుడు స్వప్నంలో సాత్కారించడం అనేది మంచి విషయమని అన్నారు. భగవంతుడు కలలోకి అనవసరంగా రావడం జరగదని.. దాని వెనుకాల ఏదో ఒక సంకేతం ఉంటుందన్నారు. భగవంతుని సాక్షాత్కారం కలలో కూడా కష్టమేనని అన్నారు. ఎక్కువగా ఆలయాలు కనిపించినప్పటికీ అందులోని దేవుడు మనకు కనిపించడని అన్నారు. అయితే, మనకు కలలో దేవుడు కనిపించినట్లయితే.. భగవంతుడి అనుగ్రహం మనకు కలిగినట్లేనని భావించవచ్చన్నారు.

కలల శాస్త్రం ఏం చెబుతోంది..?

భారతీయ కలల శాస్త్రం ప్రకారం.. కలలో దేవుని దర్శనం సాధారణంగా శుభ సూచికగా భావిస్తారు. మనసు శాంతి పొందుతుంది, ఆధ్యాత్మిక పరిణామం ఉంటుంది. కానీ, ఇది భౌతికంగా దేవుడు నిజంగా వచ్చాడు అనే అర్థం కాదు, అది మన భక్తి‑చైతన్య అభివృద్ధిని సూచిస్తుంది.

(Declaimer: ఈ వార్తలోని సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు అందించడం జరిగింది. దీనిని టీవీ 9 తెలుగు ధృవీకరించదు.)