Varanasi: కాశీలోని ఆ పురాతన దేవాలయం వెరీవెరీ స్పెషల్.. శివకేశవులకు చిహ్నం.. దర్శనంతోనే అనేక రెట్లు ఫలితం..

|

Jun 25, 2024 | 11:45 AM

వారణాసిని శివుని నివాసంగా భావిస్తారు. ఇక్కడ భోలాశంకరుడు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనం ఇస్తున్నాడు. ఇందులో అత్యంత ముఖ్యమైన ఆలయం విశేశ్వర ధామ్.. కాశీ విశ్వనాథుడు ఆలయం. ఈ ఆలయంతో పాటు మృత్యుంజయ ఆలయం, కాలభైరవుడి ఆలయం సహా త్రిలోచన మహాదేవ ఆలయం, శ్రీ తిలభండేశ్వర మహాదేవ మందిరం తో పాటు కేదార్నాథ్ దర్శనం కంటే అధిక రెట్లు పుణ్యాన్ని అందించే కేదారేశ్వర మహాదేవ ఆలయం కూడా ఉంది.

Varanasi: కాశీలోని ఆ పురాతన దేవాలయం వెరీవెరీ స్పెషల్.. శివకేశవులకు చిహ్నం.. దర్శనంతోనే అనేక రెట్లు ఫలితం..
Gauri Kedareshwar Mandir
Follow us on

ప్రపంచంలోనే అత్యంత పురాతన నగరం వారణాసి. ఈ నగరాన్ని స్వయంగా శివుడే నిర్మించినట్లు హిందువుల నమ్మకం. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఒకటి. శివయ్య నివసించే ఈ నగరాన్ని, ఈ ఆలయాన్ని సందర్శించడం వలన కేదార్‌నాథ్ ధామ్ సందర్శించడం కంటే 7 రెట్లు ఎక్కువ పుణ్యం లభిస్తుందని నమ్మకం. ఈ ఆలయం కేదార్ ఖండంలో ఉంది. దీనిని గౌరీ కేదారేశ్వరాలయం అని కూడా అంటారు.

కేదారేశ్వర మహాదేవ ఆలయం ప్రత్యేకత

వారణాసిని శివుని నివాసంగా భావిస్తారు. ఇక్కడ భోలాశంకరుడు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనం ఇస్తున్నాడు. ఇందులో అత్యంత ముఖ్యమైన ఆలయం విశేశ్వర ధామ్.. కాశీ విశ్వనాథుడు ఆలయం. ఈ ఆలయంతో పాటు మృత్యుంజయ ఆలయం, కాలభైరవుడి ఆలయం సహా త్రిలోచన మహాదేవ ఆలయం, శ్రీ తిలభండేశ్వర మహాదేవ మందిరం తో పాటు కేదార్నాథ్ దర్శనం కంటే అధిక రెట్లు పుణ్యాన్ని అందించే కేదారేశ్వర మహాదేవ ఆలయం కూడా ఉంది. సోనార్‌పురా రోడ్‌కు సమీపంలో ఉన్న కేదార్ ఘాట్ వద్ద ఉన్న కేదారేశ్వరాలయం వారణాసిలోని పురాతన పవిత్ర ప్రదేశాలలో ఒకటి. ఇక్కడే శివలింగం మొదట కనిపించిందని చెబుతారు. ఈ ఆలయంలోని శివలింగాన్ని సందర్శిస్తే కేదార్‌నాథ్ ధామ్ కంటే 7 రెట్లు ఎక్కువ పుణ్యఫలితాలు లభిస్తాయని నమ్మకం.

స్వయంగా నైవేద్యాన్ని తినడానికి వచ్చే శివయ్య

ఇతర ఆలయాలతో పోలిస్తే ఈ ఆలయ పూజా విధానం కూడా భిన్నంగా ఉంటుంది. ఇక్కడ బ్రాహ్మణులు కుట్టని బట్టలు ధరించి నాలుగు గంటల హారతిని ఇస్తారు. అదే సమయంలో స్వంభు శివలింగానికి బిల్వ పత్రాలు, పాలు, గంగాజలాన్ని అభిషేకం చేస్తారు. శివయ్యకు నైవేద్యంగా ఖిచ్డీని కూడా సమర్పిస్తారు. ఈ స్వామికి నైవేద్యంగా పెట్టే ప్రసాదాన్ని స్వీకరించడానికి శివుడు స్వయంగా ఇక్కడికి వస్తాడని నమ్మకం.

ఇవి కూడా చదవండి

రెండు భాగాలుగా చీలి ఉండే శివలింగం

కాశీలోని కేదారేశ్వర మహాదేవ శివలింగానికి ఒకటి కాదు రెండు కాదు ఎన్నో మహిమలు ఉన్నాయని విశ్వాసం. ఈ శివలింగం సాధారణంగా కనిపించే ఇతర శివలింగాల మాదిరిగా కాకుండా రెండు భాగాలుగా విభజించబడి ఉంటుంది. ఒక భాగంలో శివపార్వతిలు ఉండగా.. మరొక భాగంలో నారాయణుడు తన భార్య లక్ష్మితో ఉంటాడని విశ్వాసం.

గౌరీ కేదారేశ్వరుడు అనుగ్రహం

పురాణాల ప్రకారం మాంధాత ఋషి తపస్సుకు సంతోషించిన శివుడు ఇక్కడ ప్రత్యక్షమయ్యాడు. నాలుగు యుగాలకు గుర్తుగా నాలుగు రూపాలు ఉంటానని శివుడు చెప్పాడు. సత్యయుగంలో నవ రత్నమయంగా, త్రేతాయుగంలో బంగారు రంగులో, ద్వాపరంలో వెండి రూపంలో, కలియుగంలో రాతి రూపంలో భక్తులకు దర్శనం ఇస్తున్నాడు. ఇక్కడ ఉన్న శివయ్యను దర్శించుకోవడం వలన శుభాలుకలుగుతాయని విశ్వాసం.

 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు.