
శ్రీ మహావిష్ణువు కొన్ని అలవాట్ల గురించి చెప్పారు. ఈ అలవాట్లు కలిగిన వారు ఎంతటి ధనవంతులైనా పేదరికంలోకి వెళ్ళిపోతారని హెచ్చరించారు. అనవసర ఖర్చు, ఆలస్యంగా నిద్రించడం, అహంకారం, ఇతరులను కించపరచడం, దేవతలను గౌరవించకపోవడం వంటి అలవాట్లు కలిగిన వారు సంపద కోల్పోతారని గరుడ పురాణం సూచిస్తుంది.
చాలా మంది రాత్రి ఆలస్యంగా పడుకొని ఉదయం ఆలస్యంగా నిద్ర లేస్తారు. ఇది మంచి అలవాటు కాదు. ఉదయం సూర్యోదయానికి ముందే నిద్ర లేవడం ఆరోగ్యానికి మంచిది. ఆలస్యంగా నిద్ర లేచేవారు సోమరిపోతులుగా ఉంటారు. వారు జీవితంలో ఎప్పుడూ అభివృద్ధి చెందరు. ఉదయం బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవడం వలన మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. కొత్త ఆలోచనలు వస్తాయి. అదే విధంగా ఆలస్యంగా నిద్ర లేవడం వలన చాలా అవకాశాలను కోల్పోతారు.
కొంతమంది రాత్రి పడుకునే ముందు తిన్న ప్లేట్లు, వంట పాత్రలు శుభ్రం చేయకుండానే పడుకుంటారు. ఇది లక్ష్మీదేవికి ఆగ్రహం కలిగిస్తుంది. శుభ్రంగా ఉండేవారి ఇళ్లల్లోనే లక్ష్మీదేవి ఉంటుంది. మురికిగా ఉండేవారి ఇళ్లకు లక్ష్మీదేవి రాదు. అందుకే రాత్రి పడుకునే ముందు పాత్రలను శుభ్రం చేసుకోవాలి. అలాగే చిరిగిన బట్టలు వేసుకోకూడదు. శుభ్రమైన బట్టలు వేసుకోవాలి. ఇల్లును, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది.
కొంతమంది ఇతరుల ధనాన్ని, ఆస్తిని ఎలాగైనా కాజేయాలని చూస్తుంటారు. ఇది చాలా చెడ్డ పని. లక్ష్మీదేవి ఇలాంటి వారిని అసహ్యించుకుంటుంది. కష్టపడి సంపాదించిన ధనమే మనకు ఉపయోగపడుతుంది. ఇతరుల ధనాన్ని ఆశించడం వల్ల పేదరికం వస్తుంది. ఇతరుల కష్టాన్ని దోచుకోవడం మహా పాపం. దీని వలన భవిష్యత్తులో చాలా కష్టాలు ఎదుర్కోవలసి వస్తుంది.
కొంతమంది ఇతరులకు మాటలతో, చేతలతో హాని కలిగిస్తుంటారు. ఇలాంటి వారిని లక్ష్మీదేవి ద్వేషిస్తుంది. ఎప్పుడూ డబ్బు కోసం ఆరాటపడుతుంటారు. కోపం, ఆవేశం వంటి చెడు లక్షణాలు కలిగి ఉంటారు. ఇలాంటి ప్రవర్తన పేదరికానికి దారి తీస్తుంది. ఇతరులకు సహాయం చేయడం వలన పుణ్యం లభిస్తుంది. అదే విధంగా ఇతరులకు హాని చేయడం వలన పాపం వస్తుంది.
ధర్మం అంటే మంచి పనులు చేయడం. పెద్దలను గౌరవించడం, పేదవారికి సహాయం చేయడం, సత్యం మాట్లాడటం వంటివి ధర్మం కిందకు వస్తాయి. ధర్మాన్ని పాటించని వారు పేదరికంలోకి వెళ్ళిపోతారు. ధర్మం పాటించడం వలన సమాజంలో గౌరవం లభిస్తుంది. పుణ్యం కలుగుతుంది.
శ్రీ మహావిష్ణువు చెప్పిన ఈ అలవాట్లను కలిగి ఉన్నవారు వెంటనే వాటిని వదిలివేయాలి. అప్పుడే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ధనవంతులుగా ఉంటారు. అంతేకాకుండా మంచి పనులు చేయడం వలన మనశ్శాంతి కూడా లభిస్తుంది.