Garuda Puranam: ఉదయాన్నే చేసే ఈ 5 పనులు జీవితంలో ఐశ్యర్యాన్ని కలిగిస్తాయి.. అవేంటంటే..

|

Sep 24, 2023 | 11:07 PM

18 మహాపురాణాలలో ఒకటైన గరుడ పురాణంలో వ్యక్తి జీవితానికి సంబంధించిన అనే విషయాలను పేర్కొనడం జరిగింది. వ్యక్తి ఉదయం లేచింది మొదలు.. రాత్రి పడుకునే వరకు ఏం చేస్తే మంచిది.. ఏం చేయకూడదు.. ఏం చేయాలి.. వంటి కీలకమైన వివరాలను పేర్కనడం జరిగింది. ప్రధానంగా ఉదయాన్నే చేసే కొన్ని పనుల కారణంగా రోజంతా శుభప్రదంగా ఉంటుంది. మీ జీవితో సానుకూలతను తీసుకువస్తుంది. గరుడ పురాణంలో మోక్షాన్ని, మోక్ష మార్గాన్ని సూచిస్తుంది. మనిషి జీవన ఉద్ధరణకు స్ఫూర్తినిచ్చే గ్రంథమే గరుడ పురాణం.

Garuda Puranam: ఉదయాన్నే చేసే ఈ 5 పనులు జీవితంలో ఐశ్యర్యాన్ని కలిగిస్తాయి.. అవేంటంటే..
Garuda Puranam
Follow us on

Garuda Puranam: 18 మహాపురాణాలలో ఒకటైన గరుడ పురాణంలో వ్యక్తి జీవితానికి సంబంధించిన అనే విషయాలను పేర్కొనడం జరిగింది. వ్యక్తి ఉదయం లేచింది మొదలు.. రాత్రి పడుకునే వరకు ఏం చేస్తే మంచిది.. ఏం చేయకూడదు.. ఏం చేయాలి.. వంటి కీలకమైన వివరాలను పేర్కనడం జరిగింది. ప్రధానంగా ఉదయాన్నే చేసే కొన్ని పనుల కారణంగా రోజంతా శుభప్రదంగా ఉంటుంది. మీ జీవితో సానుకూలతను తీసుకువస్తుంది. గరుడ పురాణంలో మోక్షాన్ని, మోక్ష మార్గాన్ని సూచిస్తుంది. మనిషి జీవన ఉద్ధరణకు స్ఫూర్తినిచ్చే గ్రంథమే గరుడ పురాణం. గరుడ పురాణంలోని నీతిసార విభాగంలో రోజువారీ జీవితానికి సంబంధించిన అనేక విధానాలు, నియమాలు వివరించడం జరిగింది. అంతేకాకుండా.. ఇది ఇతర పనుల గురించి కూడా చెబుతుంది. కొన్న పనులు ఉదయాన్నే చేస్తే, జీవితం మెరుగుపడుతుంది. సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. ఈ అలవాట్లను అలవర్చుకోవడం ద్వారా జీవితాన్ని సుసంపన్నం చేసుకోవచ్చు. మరి పనులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

స్నానం: గరుడ పురాణం, గ్రంథాలలో శరీరం, మనస్సు స్వచ్ఛత కోసం స్నానానికి ప్రాముఖ్యత ఇవ్వడం జరిగింది. ప్రతి వ్యక్తి శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడానికి స్నానం చేస్తారు. కానీ ఉదయాన్నే క్రమం తప్పకుండా స్నానం చేసే వ్యక్తులు రోజంతా శక్తివంతంగా ఉంటారు. అనేక వ్యాధులకు దూరంగా ఉంటారు. అలాంటి వారు తమ పనిని కూడా శ్రద్ధగా చేస్తారు. దాని కారణంగా.. వారికి శుభ ఫలితాలు లభిస్తాయి.

విరాళం: ప్రతి వ్యక్తి తన సామర్థ్యం మేరకు ఎప్పటికప్పుడు దానం చేస్తూనే ఉండాలి. ఒక వ్యక్తి ఉదయాన్నే తన చేతులతో ఏదైనా దానం చేయాలని గరుడ పురాణంలో చెప్పడం జరిగింది. దీనివల్ల కుటుంబంలో ఎప్పుడూ ఆహారానికి, ధనానికి లోటు ఉండదు, ఐశ్వర్యం ఉంటుంది.

ఇవి కూడా చదవండి

దీపం: ఉదయాన్నే స్నానం చేసి పూజ చేయండి. ఇంట్లో ధూపం లేదా దీపం వెలిగించాలి. హవన్ కూడా చేయవచ్చు. ఇది ఇంటిని శుభ్రపరుస్తుంది. ప్రతికూల శక్తిని తొలగిస్తుంది. ప్రతిరోజూ హవనాన్ని నిర్వహించడం సాధ్యం కాకపోతే, మీరు తప్పనిసరిగా దీపం వెలిగించాలి. దీంతో వాస్తు దోషాలు కూడా తొలగిపోతాయి.

మంత్రోచ్ఛారణ: పూజలో మంత్రాలను పఠించడం ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. ఉదయం పూట మంత్రాలు జపించే ఇంట్లో పెద్ద అడ్డంకులు కూడా నివారిస్తాయని విశ్వాసం. అందుచేత కొంత సమయం తీసుకుని ఉదయాన్నే మంత్రాలను జపించండి. మీరు కష్టమైన మంత్రాలను జపించలేకపోతే, సాధారణ మంత్రాలనైనా జపించండి.

దేవుడి పూజ: ఉదయం స్నానం చేసిన తర్వాత, దేవుడిని పూజించి, నైవేథ్యం సమర్పించాలి. భగవంతుడిని పూజించడం ద్వారా ఇంట్లో దేవుడు అనుగ్రహం నిలిచి ఇంట్లో సుఖ సంతోషాలు కలుగుతాయి.

గమనిక: పైన పేర్కొన్న వివివరాలు మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..