Lord Ganesh Puja: ఆర్ధిక ఇబ్బందులు తీరడానికి బుధవారం గణపతిని ఎలా పూజించాలి? పాటించసిన మంత్రాలూ ఏమిటంటే

బుధవారం గణేశుడికి అంకితం చేయబడింది. ఈ రోజున విఘ్నాలకధిపతి గణపతిని పూజించడం శుభప్రదం అని నమ్మకం. బుధవారం గణపయ్య అనుగ్రహం కోసం ఉపవాసం కూడా పాటిస్తారు. ఇలా చేయడం ద్వారా గణేశుడు భక్తుడి కష్టాలను తొలగిస్తాడని, అతనికి శుభ ఫలితాలు లభిస్తాయని విశ్వాసం ఉంది. గణేశుడిని నియమ నిష్టలతో పూజిస్తే..భగవంతుడు సంతోషిస్తాడని నమ్ముతారు.

Lord Ganesh Puja: ఆర్ధిక ఇబ్బందులు తీరడానికి బుధవారం గణపతిని ఎలా పూజించాలి? పాటించసిన మంత్రాలూ ఏమిటంటే
Lord Ganesh Puja

Updated on: May 21, 2025 | 6:49 AM

హిందూ విశ్వాసాల ప్రకారం వారంలోని ఒకొక్క రోజు ఒకొక్క దేవుడికి అంకితం చేశారు. అంతేకాదు ఒకొక్క రోజు ఒక్కక్క గ్రహానికి సంబంధించినది. ఈ నేపధ్యంలో బుధవారం గణేశుడికి అంకితం చేయబడింది. బుధవారం రోజున గణపతిని ప్రత్యేక పూజించే సంప్రదాయం ఉంది. అలాగే ఉపవాసం కూడా పాటిస్తారు. ఇలా చేయడం ద్వారా గణేశుడు భక్తుడి కష్టాలను తొలగిస్తాడని, శుభ ఫలితాలు లభిస్తాయని మత విశ్వాసం ఉంది. గణేశుడిని ఆచారాల ప్రకారం పూజిస్తే.. భగవంతుడు అనుగ్రహం లభిస్తుందని ప్రతి రంగంలో విజయం సాధిస్తాడని నమ్ముతారు. గణపతిని పూజించడం ఎలా ఫలవంతమవుతుందో ఈ రోజు తెలుసుకుందాం..

  1. బుధవారం నాడు బ్రహ్మ ముహూర్తంలో మేల్కొని, గణేశుడిని ధ్యానించడం ద్వారా రోజును ప్రారంభించండి.
  2. దీని తరువాత స్నానం చేసి ఆకుపచ్చ దుస్తులు ధరించండి. ఎందుకంటే గణేశుడికి ఆకుపచ్చ రంగు అంటే చాలా ఇష్టం.
  3. సూర్యభగవానుడికి రాగి పాత్రలో నీరు పోసి మందారం పువ్వు, అక్షతలు వేసి అర్ఘ్యం సమర్పించండి.
  4. ఇప్పుడు ఒక పీటం మీద ఎరుపు లేదా పసుపు రంగు వస్త్రాన్ని పరిచి గణేశుడి విగ్రహాన్ని ప్రతిష్టించండి.
  5. ఇవి కూడా చదవండి
  6. గణేశుడికి పూలు, దర్భ గడ్డిని సమర్పించండి.
  7. ఇప్పుడు దేశీ ఆవు నెయ్యితో దీపం వెలిగించి హారతి ఇవ్వండి.
  8. దీని తరువాత గణపతి అనుగ్రహం కోసం గణేష్ చాలీసా, మంత్రాలను జపించండి.
  9. గణపతికి ఇష్టమైన అరటి పండ్లు, కుడుములు, ఉండ్రాళ్ళు, స్వీట్లు నైవేద్యంగా సమర్పించండి.
  10. తర్వాత ఈ ప్రసాదాన్ని ముందుగా కుటుంబ సభ్యులకు పెట్టి.. తర్వాత ప్రజలకు ప్రసాదం పంచిపెట్టండి.
  11. మీ శక్తికి అనుగుణంగా పేదలకు ప్రత్యేక వస్తువులను కూడా దానం చేయవచ్చు.

పూజ సమయంలో ఈ మంత్రాలను జపించండి

గణేష్ గాయత్రీ మంత్రం

ఓం ఏకదంతాయ విధమహే,
వక్రతుణ్డాయ ధీమహి,
తన్నో దన్తి ప్రచోదయాత్॥

ఔం ఏకదంతాయ విద్ధామహే,
వక్రతుండాయ ధీమహి,
తన్నో దంతి ప్రచోదయాత్॥

గణపతి బీజ మంత్రం

ఓం గం గణపతయే నమః

ఈ మంత్రాలను జపిస్తారో.. వారికి విశ్వం మొత్తం అతని ఆధీనంలో ఉంటుంది. ఎటువంటి అడ్డంకులు ఉండవని నమ్మకం.

 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

Follow Us