Solar Eclipse 2022: ప్రపంచాన్ని వణికిస్తున్న సూర్యగ్రహణం.. భయానికి కారణమిదేనా?..

|

Apr 29, 2022 | 11:56 PM

Solar Eclipse 2022: శనివారం.. చైత్ర అమావాస్య.. పైగా సూర్యగ్రహణం.. దీంతో ప్రపంచమంతా భయం వ్యాపించింది. ఈ ఏడాది ఏర్పడుతున్న తొలి సూర్యగ్రహణం యుద్ధ భయాలను పెంచింది.

Solar Eclipse 2022: ప్రపంచాన్ని వణికిస్తున్న సూర్యగ్రహణం.. భయానికి కారణమిదేనా?..
Solar
Follow us on

Solar Eclipse 2022: శనివారం.. చైత్ర అమావాస్య.. పైగా సూర్యగ్రహణం.. దీంతో ప్రపంచమంతా భయం వ్యాపించింది. ఈ ఏడాది ఏర్పడుతున్న తొలి సూర్యగ్రహణం యుద్ధ భయాలను పెంచింది. గ్రహాల రాశి పరివర్తనం విపత్తు సంకేతమన్న ప్రచారం జరుగుతోంది. ఖగోళంలో జరిగే మార్పులు భూమిపై ప్రభావం చూపుతాయా? జ్యోతిష్య శాస్త్రం ఏం చెబుతోంది? వైజ్ఞానికులు ఏమంటున్నారు? ప్రత్యేక కథనం మీకోసం.. ఏప్రిల్‌ 29న కుంభరాశిలో శని ప్రవేశం జరిగింది. దీంతోబాటు రవి, గురు గ్రహాల రాశి పరివర్తనం కూడా ఈ నెల్లోనే జరిగింది. మరోవైపు రవి, చంద్ర, రాహువులు మూడూ మేషరాశిలో ఉండటం యుద్ధ వాతావరణాన్ని సూచిస్తోందంటున్నారు. మూడు గ్రహాల రాశి పరివర్తనాన్ని గ్రహ యుద్ధమని సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

దీంతోబాటు శని అమావాస్యనాడు వస్తున్న సూర్యగ్రహణం ప్రళయ సంకేతమని కూడా ప్రచారం జరుగుతోంది. 2022లో తొలి సూర్యగ్రహణం తర్వాత జపాన్-ఇంగ్లండ్‌లో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటాయని సోషల్ మీడియాలో కథనాలు వ్యాపించాయి. గ్రహాల రాశి పరివర్తనం తర్వాత రష్యా-ఉక్రెయిన్‌ మధ్య ఉద్రిక్తలు ముదిరి విశ్వ యుద్ధానికి దారితీస్తాయన్న పోస్టులు వైరల్ అయ్యాయి. అలాగే పొరుగున పాకిస్థాన్‌-అఫ్ఘానిస్థాన్‌లో అధికార కుమ్ములాటలతో అస్థిరత మరింత పెరుగుతుందని అంచనా వేస్తు్న్నారు.

ఈ ఏడాది తొలి సూర్యగ్రహణం భారత కాలమానం ప్రకారం ఏప్రిల్ 30న రాత్రి 12:15 గంటలకు ప్రారంభమవుతుంది. ఆ తర్వాతి రోజు.. అంటే మే 1న ఉదయం 4 గంటల 7 నిమిషాల వరకు ఉంటుంది. దక్షిణ అమెరికాలోని దక్షిణాది ప్రజలు, అంటార్కిటా, దక్షిణ మహా సముద్ర ప్రాంతాల ప్రజలు ఏప్రిల్‌ 30న సూర్యాస్తమయ సమయానికి కొద్ది ముందు ఈ పాక్షిక సూర్య గ్రహణాన్ని వీక్షించవచ్చు. ఏప్రిల్‌ 30న శని అమావాస్య రోజున వచ్చే సూర్యగ్రహణం భారత్‌లో కనిపించదని నాసా పేర్కొంది. మరోవైపు మే 15- వైశాఖ పూర్ణిమనాడు వృశ్చిక రాశిలో సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఇది కూడా భారత్ లో కనిపించదు. కానీ ఈ రెండు గ్రహణాలపై శనిగ్రహ అతిచార చూపు ఏర్పడింది.

Also read:

Bollywood vs Sandalwood: లాంగ్వేజ్‌ లడాయి.. పొలిటికల్ టర్న్ తీసుకున్న హిందీ భాష వివాదం..

Power Crisis: దేశాన్ని అతలాకుతలం చేస్తున్న విద్యుత్ కోతలు.. అలర్ట్ అయిన కేంద్ర ప్రభుత్వం..

Yadadri Bhuvanagiri: యాదగిరిగుట్టలో ఘోర విషాదం.. కుప్పకూలిన రెండంతస్తుల భవనం..!