Shardiya Navratri: నవరాత్రుల తర్వాత విజయదశమి ఎందుకు జరుపుకుంటారు, ప్రాముఖ్యత ఏమిటంటే?

వాస్తవానికి విజయదశమిని చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ పండుగను జరుపుకుంటారు. ఈ రోజున కాత్యాయని దుర్గ దేవి ఇతర దేవతల సహాయం కోరి మహిషాసురుడిని చంపిందని నమ్ముతారు. హిందువుల నమ్మకాల ప్రకారం దుర్గాదేవి, మహిషాసురుల మధ్య 9 రోజులు యుద్ధం జరిగింది. పదవ రోజున దుర్గాదేవి శివుడు ఇచ్చిన త్రిశూలంతో మహిషాసురుడిని చంపింది.

Shardiya Navratri: నవరాత్రుల తర్వాత విజయదశమి ఎందుకు జరుపుకుంటారు, ప్రాముఖ్యత ఏమిటంటే?
Shardiya Navratri
Image Credit source: Unsplash

Updated on: Oct 08, 2023 | 12:47 PM

అక్టోబర్ 14 న సూర్యగ్రహణం.. ముగిసిన వెంటనే మర్నాడు నవరాత్రులు ప్రారంభమవుతాయి. అంటే  అక్టోబర్ 15 వ తేదీ ఆదివారం శారదీయ నవరాత్రులు మొదలు కానున్నాయి. తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని వివిధ రూపాల్లో పూజిస్తారు. నవరాత్రులలో మొదటి రోజున కలశాన్ని ఏర్పాటు చేసి దుర్గమ్మని పూజిస్తారు. నవరాత్రుల్లో తొమ్మిది రోజుల పాటు ఆచారాల ప్రకారం దుర్గాదేవిని పూజిస్తారు. నవరాత్రుల్లో దుర్గాదేవిని 9 రూపాలుగా పూజిస్తారు. ఈ నవరాత్రుల్లో దుర్గాదేవి 9 రోజుల పాటు భూమిపైకి వచ్చి ప్రతి ఇంట్లో నివసిస్తుందని నమ్మకం. అటువంటి పరిస్థితిలో దుర్గాదేవిని హృదయపూర్వకంగా ఆరాధించడం ద్వారా, ఎవరైనా దుర్గాదేవి ఆశీర్వాదాలను పొందుతారు. ప్రతి కోరిక నెరవేరుతుంది.

నవరాత్రుల 9 రోజుల తర్వాత పదవ రోజున విజయదశమి జరుపుకుంటారు. కొన్ని ప్రాంతాల్లో దసరాగా కూడా జరుపుకుంటారు. అసత్యంపై సత్యం సాధించిన విజయానికి ప్రతీక.. ఈ రోజు హిందూ మతంలో గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉంది. తొమ్మిది రోజులు పూజను అందుకున్న దుర్గాదేవి నిమజ్జనం చాలా వైభవంగా జరుపుతారు. అయితే నవరాత్రి తర్వాత పదవ రోజు విజయదశమి అని ఎందుకు అంటారు. ఈ కారణాన్ని తెలుసుకుందాం.

మహిషాసురుడిని సంహరించిన దుర్గాదేవి

వాస్తవానికి విజయదశమిని చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ పండుగను జరుపుకుంటారు. ఈ రోజున కాత్యాయని దుర్గ దేవి ఇతర దేవతల సహాయం కోరి మహిషాసురుడిని చంపిందని నమ్ముతారు. హిందువుల నమ్మకాల ప్రకారం దుర్గాదేవి, మహిషాసురుల మధ్య 9 రోజులు యుద్ధం జరిగింది. పదవ రోజున దుర్గాదేవి శివుడు ఇచ్చిన త్రిశూలంతో మహిషాసురుడిని చంపింది. అందుకే దుర్గాదేవిని మహిషాసుర మర్దిని అని కూడా అంటారు. పదవ రోజున మహిషాసురుడు సంహరించినందున ఈ రోజును విజయదశమిగా జరుపుకుంటారు. దుర్గాదేవికి  విజయ అనే పేరు కూడా ఉంది.

ఇవి కూడా చదవండి

అందుకే దసరా

అంతేకాదు నవరాత్రులు జరుపుకున్న మర్నాడు దసరా పండుగను కూడా ఈ రోజు జరుపుకుంటారు. ఈ కార్యక్రమంలో భాగంగా రావణ, మేఘనాథుడు, కుంభకర్ణుల దిష్టిబొమ్మలను దహనం చేస్తారు. ఈ రోజున రాముడు రావణుడిని చంపాడని నమ్ముతారు. దసరా రోజున చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా దసరా ఉత్సవాలను జరుపుకోవడం ప్రారంభించారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు.