Dussehra 2023: ఈ ఏడాది గ్రహణం తర్వాత నవరాత్రులు ప్రారంభం.. కలశ స్థాపన శుభ సమయం, పూజ విధానం ఏమిటంటే

|

Oct 08, 2023 | 9:53 AM

నవరాత్రుల్లో కలశ స్థాపనకు కూడా విశేష ప్రాముఖ్యత ఉంది. ఆచారాల ప్రకారం ఇంట్లో కలశాన్ని ప్రతిష్టించడం వల్ల ప్రతికూల శక్తి దూరంగా ఉంటుంది. సానుకూల శక్తి వస్తుంది. దీంతో ఇంటికి సుఖ సంతోషాలు రావడంతో పాటు ప్రతి సమస్య దూరమవుతుంది. నవరాత్రుల మొదటి రోజున కలశాన్ని ఏర్పాటు చేస్తారు. అయితే ఈ ఏడాది నవరాత్రికి ముందు సూర్యగ్రహణం ఏర్పడుతోంది.

Dussehra 2023: ఈ ఏడాది గ్రహణం తర్వాత నవరాత్రులు ప్రారంభం.. కలశ స్థాపన శుభ సమయం, పూజ విధానం ఏమిటంటే
Dussehra 2023
Follow us on

హిందువుల అతి పెద్ద పండుగల్లో ఒకటైన నవరాత్రులను దేశవ్యాప్తంగా అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ఈ  సమన్వయంతో దుర్గాదేవిని తొమ్మిది రూపాలుగా తొమ్మిది రోజుల పాటు పూజలు చేస్తారు. నవరాత్రుల సమయంలో దుర్గాదేవి భూమిపైకి వచ్చి ప్రతి ఇంట్లో నివసిస్తుందని నమ్ముతారు. ఈ సమయంలో అమ్మవారిని నిర్మలమైన హృదయంతో పూజించడం ద్వారా దుర్గదేవి సంతోషిస్తుంది. భక్తుల కష్టాలన్నింటినీ  తొలగిస్తుందని విశ్వాసం.

నవరాత్రుల్లో కలశ స్థాపనకు కూడా విశేష ప్రాముఖ్యత ఉంది. ఆచారాల ప్రకారం ఇంట్లో కలశాన్ని ప్రతిష్టించడం వల్ల ప్రతికూల శక్తి దూరంగా ఉంటుంది. సానుకూల శక్తి వస్తుంది. దీంతో ఇంటికి సుఖ సంతోషాలు రావడంతో పాటు ప్రతి సమస్య దూరమవుతుంది. నవరాత్రుల మొదటి రోజున కలశాన్ని ఏర్పాటు చేస్తారు. అయితే ఈ ఏడాది నవరాత్రికి ముందు సూర్యగ్రహణం ఏర్పడుతోంది. అటువంటి పరిస్థితిలో అన్ని రకాల ప్రతికూల శక్తిని దూరంగా ఉంచడానికి సరైన మార్గంలో, సరైన సమయంలో కలశాన్ని స్థాపించడం చాలా ముఖ్యం.

కలశాన్ని స్థాపించడానికి సరైన సమయం ఏమిటంటే?

శారదీయ నవరాత్రులు ప్రతి సంవత్సరం అశ్వినీ మాసం శుక్ల పక్షం ప్రతిపద తిథి నుండి ప్రారంభమవుతాయి. ఈ సంవత్సరం ఈ తేదీ అక్టోబర్ 14 రాత్రి 11:24 నుండి అక్టోబర్ 15 మధ్యాహ్నం 12:32 వరకు ఉంటుంది. ఉదయతిథి ప్రకారం ఈ సంవత్సరం నవరాత్రులు అక్టోబర్ 15 నుండి ప్రారంభమవుతాయని.. అదే రోజు కలశ ప్రతిష్ఠాపన చేసి అమ్మవారిని పూజించడానికి నవరాత్రులను ప్రారంభిస్తారు. కలశ స్థాపనను ఘట్ స్థాపన అని కూడా అంటారు. దీని ప్రారంభ సమయం ఉదయం 11:44 నుండి ప్రారంభమై మధ్యాహ్నం 12:30 వరకు కొనసాగుతుంది.

ఇవి కూడా చదవండి

కలశస్థాపనకు సరైన పద్ధతి

నవరాత్రుల మొదటి రోజున తెల్లవారుజామున నిద్రలేచి స్నానం చేసి, ఎరుపు లేదా పసుపు రంగు దుస్తులు ధరించండి. దీని తరువాత ఒక వేదికను ఏర్పాటు చేసి దానిపై ఎర్రటి వస్త్రాన్ని పరచి దుర్గాదేవి చిత్రాన్ని లేదా విగ్రహాన్ని ఉంచండి. అనంతరం కలశ స్థాపన కోసం ఒక రాగి లేదా మట్టి కలశంలో స్వచ్ఛమైన నీరు లేదా గంగాజలం నింపి, అందులో ఒక నాణెం, కుంకుమ, తమలపాకులు వేసి రెడీ చేయండి.

దీని తరువాత ఒక ఎర్రటి జాకెట్ ముక్కను లేదా ఎర్రని చున్నీని తీసుకుని దానిని కలశానికి మౌలిని కట్టి, కలశానికి కట్టండి. అనంతరం ఒక కొబ్బరి కాయను పెట్టి దీనిపైన కూడా ఒక వస్త్రాన్ని మౌలిని కట్టండి. మట్టి పాత్రను తీసుకొని అందులో మట్టిని వేసి శనగలు, మినుములు విత్తండి. అనంతరం కలశం.. విత్తులు ఉన్న కుండను దుర్గాదేవి చిత్ర పటానికి కుడి వైపున ఉంచి, ఆచారాల ప్రకారం దుర్గాదేవిని పూజించాలి. మొదటి రోజున దుర్గాదేవిని శైలపుత్రికాగా అలంకరించి పూజిస్తారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు.