
ప్రతి నెలలో గ్రహాలు రాశి సంచారం లేదా నక్షత్రం చేయడం అనేది కామన్. అయితే నవంబర్ నెలలో రాహు గ్రహం నక్షత్రం సంచారం చేయబోతుంది. దీని వలన కొన్ని రాశుల వారికి ఆర్థికం, ఆరోగ్యపరంగా కలిసిరానున్నది. ఇంతకీ ఆ రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం.

జ్యోతిష్యశాస్త్రం ఉన్న శక్తివంతమైన గ్రహాల్లో రాహువు గ్రహం ఒకటి. ఇది మంచి స్థానంలో ఉంటే ఆ రాశి వారికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి. అదే ఈ గ్రహం గనుక నీచ స్థానంలో ఉంటే, రాశుల వారికి కలిగే నష్టాలు, సమస్యలు గురించి ఎంత చెప్పినా తక్కువే.

అయితే రాహువు గ్రహం రాశిని లేదా నక్షత్రాన్ని మార్చిన ప్రతి సారి కొన్నిరాశుల వారికి లక్కు తీసుకొస్తే, మరికొన్ని రాశుల వారికి సమస్యలను తీసుకొస్తుంది. అయితే నవంబర్ 24న రాహు గ్రహం శతభిషం నక్షత్రంలోకి సంచారం చేయనుంది. దీంతో కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుందంట. అవి ఏ రాశులు అంటే?

మేష రాశి : మేష రాశి వారికి రాహువు నక్షత్రం సంచారం వలన కెరీర్ పరంగా అద్భుతంగా ఉంటుంది. వీరి జీవితం అనుకోని విధంగా కొత్త మలుపులు తిరుగుతుంది. కొత్త ఆదాయ మార్గాలు పుట్టుకొస్తాయి. అదే విధంగా జీవితంలో ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటాయి.

కన్యా రాశి : కన్యారాశి వారికి రాహు గ్రహ సంచారం వలన అదృష్టం కలిసి వస్తుంది. వీరికి పట్టిందల్లా బంగారమే కానుంది. అనుకోని మార్గాల ద్వారా ఆదాయం చేసికందుతుంది. అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి చేస్తారు. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది. ఏ పని చేసినా అందులో విజయం మీదే అవుతుంది.