
దీపావళి ప్రారంభం ధన్‌తేరస్ రోజు నుంచి పరిగణించబడుతుంది. ఇది ప్రతి సంవత్సరం కార్తీక మాసంలోని కృష్ణ పక్షంలోని త్రయోదశి తిథి నాడు జరుపుకుంటారు. ఈసారి త్రయోదశి తిథి రెండు రోజులు అంటే అక్టోబర్ 22, 23 తేదీల్లో వస్తోంది. కానీ ధన్తేరస్ పండుగ అక్టోబర్ 23 న జరుపుకుంటారు. ఎందుకంటే పంచాంగం ప్రకారం, కృష్ణ త్రయోదశి తిథి అక్టోబర్ 22, శనివారం సాయంత్రం 06:03 గంటలకు ప్రారంభమవుతుంది. ఇది అక్టోబర్ 23 ఆదివారం సాయంత్రం 06:04 వరకు ఉంటుంది. ఉదయతిథిని దృష్టిలో ఉంచుకుని.. అక్టోబర్ 23న ధన్తేరస్ జరుపుకుంటారు. ధన్తేరస్ రోజున బంగారం, వెండి, ఇత్తడి, చీపురు, పాత్రలు మొదలైన వాటిని కొనుగోలు చేసే సంప్రదాయం ఉంది. ఈ రోజున వీటిని కొనుగోలు చేయడం వల్ల ఇంటికి ఐశ్వర్యం చేకూరుతుందని నమ్ముతారు.
ధన్‌తేరస్‌లో ఆమెను పూజించడం ద్వారా సంపద, ఆరోగ్య వరం లభిస్తుందని కూడా చెబుతారు. కానీ ఈ రోజున కొన్ని పనులు చేయడం నిషేధించబడింది. ఈ రోజున ఈ నిషిద్ధ పనులు చేయడం వల్ల ఏడాది పొడవునా కఠిన పరిస్థితి ఉంటుందని నమ్ముతారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం