Spiritual: కర్పూరంతో ఇలా చేశారంటే.. ఆర్థిక సమస్యలన్నీ మాయం..

ఆర్థిక సమస్యలతో బాధ పడేవారు చాలా మంది ఉంటారు. అవసరానికి డబ్బు కుదరక, అప్పులు తీర, వచ్చిన డబ్బు వచ్చినట్టు ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఎంత కష్ట పడినా, ఎంత సంపాదించినా చేతిలో డబ్బు నిలవదు. ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. ఈ సమస్యలను కేవలం కర్పూరంతో తొలగించుకోవచ్చు. అదేంటి? నమ్మడం లేదా? ఒక్కసారి ఇలా చేసి చూడండి. మీకే ఫలితం కనిపిస్తుంది. కర్పూరాన్ని కేవలం మనం పూజలకు..

Spiritual: కర్పూరంతో ఇలా చేశారంటే.. ఆర్థిక సమస్యలన్నీ మాయం..
spiritual

Updated on: Jul 08, 2024 | 5:43 PM

ఆర్థిక సమస్యలతో బాధ పడేవారు చాలా మంది ఉంటారు. అవసరానికి డబ్బు కుదరక, అప్పులు తీర, వచ్చిన డబ్బు వచ్చినట్టు ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఎంత కష్ట పడినా, ఎంత సంపాదించినా చేతిలో డబ్బు నిలవదు. ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. ఈ సమస్యలను కేవలం కర్పూరంతో తొలగించుకోవచ్చు. అదేంటి? నమ్మడం లేదా? ఒక్కసారి ఇలా చేసి చూడండి. మీకే ఫలితం కనిపిస్తుంది. కర్పూరాన్ని కేవలం మనం పూజలకు మాత్రమే ఉపయోగిస్తూ ఉంటాం. కేవలం పూజలే కాకుండా ఇలా చేయడం వల్ల కూడా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోయి.. ఆర్థిక సమస్యలు తగ్గుతాయి. మరి కర్పూరంతో ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

కర్పూరం – లవంగాలు:

ఇంట్లో కర్పూరంతో పాటు లవంగాలు కూడా ఉంటాయి. ప్రతి రోజూ రాత్రి కర్పూరంతో పాటు లవంగాలను కూడా కలిపి కాల్చుతూ ఉండాలి. ఈ రెండింటినీ ఒకేసారి కాల్చడం వల్ల ఇంట్లో ఉండే గాలి శుద్ధి అవుతుంది. బ్యాక్టీరియా, వైరస్, క్రిములు ఏమైనా ఉంటే నశిస్తాయి. అంతే కాకుండా ఇంట్లో ఏమైనా వాస్తు దోషాలు ఉన్నా కూడా తగ్గుతాయి. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోయి.. పాజిటివ్ ఎనర్జీ నెలకొంటుంది. ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. ఖర్చులు కూడా అదుపులో ఉంటాయి. ఐశ్వర్యం సిద్ధిస్తుంది.

కర్పూరం – బిర్యానీ ఆకు:

ప్రతి రోజూ కర్పూరంతో పాటు బిర్యానీ ఆకును కూడా కలిపి కాల్చడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. ఆరోగ్య సమస్యలతో పాటు ఆర్థిక సమస్యలు కూడా తగ్గుతాయి. వీటిని కాల్చడం వల్ల వచ్చే గాలిని పీల్చడం వల్ల శ్వాస సంబంధిత సమస్యలు తగ్గుతాయి. అదే విధంగా ఆర్థిక సమస్యలు కూడా తగ్గి, డబ్బులో ఉంటుంది.

ఇవి కూడా చదవండి

కర్పూరం – దాల్చిన చెక్క:

కర్పూరంతో పాటు దాల్చిన చెక్క కాల్చడం వల్ల కూడా ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంటుంది. ఇంట్లో శాంతి నెలకుంటుంది. అంతే కాకుండా ఆర్టిక సమస్యలు తగ్గుతాయి. ఐశ్వర్యం కూడా సిద్ధిస్తుంది. డబ్బు పరమైన సమస్యలు కూడా తగ్గుతాయి. ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us