చీకట్లను పారదోలుతూ వెలుగులు నింపే పండుగ.. దీపావళి. విజయానికి గుర్తుగా జరుపుకునే పండుగ దీపావళి. ఈ పండుగ రోజున ప్రతీ ఇల్లు దీప కాంతులతో వెలిగిపోతుంది. ప్రతీ ఇంటా లక్ష్మీ పూజ, బాణా సంచా మోతతో కలర్‌ఫుల్‌గా మారుతుంది. మరి అలాంటి దీపావళి ఎప్పుడు? అక్టోబర్ 31నా? నవంబర్ 1నా? అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది.
దీపావళి రోజున లక్ష్మీదేవి భూమిని దర్శించుకోవడానికి వస్తుందని నమ్ముతారు. ఈ ఏడాది దీపావళి కచ్చితమైన డేట్ విషయంలో గందరగోళం నెలకొంది. నిజానికి దీపావళి ఆశ్వయుజ అమావాస్త రోజున వస్తుంది. దానికి ముందు రోజు వచ్చే ఆశ్వయుజ బహుళ చతుర్దశిని నరక చతుర్దశిగా జరుపుకుంటారు. మరి.. ఆ తిథి ఎప్పుడు వచ్చిందనే దానిపై క్లారిటీ లేదు.
ఈసారి ఎందుకీ కన్ఫ్భూజన్? శాస్త్ర నియమాల ప్రకారం నవంబర్ 1న దీపావళిని జరుపుకోవాలంటున్నారు పండితులు. ఆ రోజున దిపావళిని జరుపుకోవడం శుభప్రదమని అంటున్నారు. ప్రదోష అమావాస్య అక్టోబర్ 31న.. నవంబర్ 1న.. ఈ రెండు డేట్‌లలో వస్తుంది. యాధృచ్చికంగా నవంబర్ 1న ఆయుష్మాన్ యోగం.. స్వాతి నక్షత్రం కలయిక జరిగింది. అందుకే దీపావళి నవంబర్ 1న జరుపుకోవాలంటున్నారు పండితులు.
ఇక వేద పంచాంగం ఏం చెబుతుందో తెలుసుకుందాం.. దీపావళి నాడు లక్ష్మీ పూజ అమావాస్య తిథి, ప్రదోష కాలాల్లో.. సూర్యాస్తమయం నుంచి అర్థరాత్రి వరకు జరుగుతుంది. ఈ లెక్కన అమావాస్య తిథి, ప్రదోషకాలం, శుభ సమయాలున్న అక్టోబర్ 31న దీపావళిని జరుపుకోవడం మంచిదంటున్నారు.
హిందువులు జరుపుకునే ప్రధాన పండుగల్లో దీపావళి ఒకటి. ఈ పండుగను ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాసంలోని అమావాస్య తిథిన వైభవంగా జరుపుకుంటారు. ఆ రోజున గణేశుడు, సరస్వతి దేవి, కుబేరుడితో పాటు లక్ష్మీదేవిని నియమ నిష్టలతో పూజిస్తారు. అయితే ఈసారి దీపావళి కచ్చితమైన తేదీ విషయంలో కన్ఫ్యూజన్ నెలకొంది. ఫైనల్‌గా ఏ డేట్ ఫిక్స్ అవుతుందన్నది చూడాలి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..