Dhanteras 2024: ధన త్రయోదశి రోజున బంగారమే కాదు ఈ వస్తువులు కొన్నా శుభప్రదమే.. అవి ఏమిటంటే

|

Oct 16, 2024 | 6:54 PM

వేద క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది ధన త్రయోదశి తిథి మంగళవారం అక్టోబర్ 29, 2024 ఉదయం 10:31 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ త్రయోదశి తిథి అక్టోబర్ 30, 2024 బుధవారం మధ్యాహ్నం 1:15 గంటలకు ముగుస్తుంది. కనుక ఉదయం తిథి ప్రకారం ధన త్రయోదశి పండుగ అక్టోబర్ 29 న జరుపుకుంటారు.

Dhanteras 2024: ధన త్రయోదశి రోజున బంగారమే కాదు ఈ వస్తువులు కొన్నా శుభప్రదమే.. అవి ఏమిటంటే
Dhanteras Puja
Follow us on

హిందూ మతంలో దీపావళి పండగకు విశిష్ట స్థానం ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఈ దీపావళిని ఐదు రోజుల పాటు జరుపుకుంటారు. అలా ఐదు రోజుల పండగలలో ఒకటి ధన్‌తేరస్. దీనిని ధనత్రయోదశి అంటారు. ధన్‌తేరస్ పండుగ ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాసంలోని కృష్ణ పక్షం త్రయోదశి రోజున జరుపుకుంటారు. ఈ రోజున ధన్వంతరి, లక్ష్మీ దేవితో పాటు, సంపదకు దేవుడు అయిన కుబేరుని కూడా పూజిస్తారు. ఈ రోజున ధన్వంతరిని ఆరాధించడం వలన ఆరోగ్యాన్ని పొందుతారని నమ్ముతారు. అంతేకాదు లక్ష్మీ దేవిని, కుబేరుని పూజించడం ద్వారా సిరి సంపదలకు లోటు ఉందని విశ్వాసం.

ధన త్రయోదశి పూజ శుభ ముహూర్తం

హిందూ క్యాలెండర్ ప్రకారం అక్టోబర్ 29, మంగళవారం సాయంత్రం 6:31 గంటల నుంచి రాత్రి 8:13 గంటల వరకు ధన త్రయోదశి పూజకు అనుకూలమైన సమయం. అంటే ఈ ఏడాది మొత్తం 1 గంట 41 నిమిషాల సమయం ధన త్రయోదశి పూజకు అందుబాటులో ఉంటుంది.

ధన త్రయోదశి రోజున ఏమి కొనాలంటే

ధన త్రయోదశి రోజున కొన్ని వస్తువులను కొనుగోలు చేయడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఈ రోజున కొన్ని ప్రత్యేక వస్తువులను కొనుగోలు చేయడం వల్ల లక్ష్మీ దేవి అనుగ్రహం లభిస్తుందని. ఇంట్లో సిరి సంపదలకు లోటు ఉండదని నమ్మకం.

ఇవి కూడా చదవండి

బంగారు, వెండి నాణేలు

ధన త్రయోదశి రోజున లక్ష్మీదేవి గణపతి కలిసి ఉన్న చిత్రం లేదా బంగారం లేదా వెండి వస్తువు లేదా నాణేలను కొనుగోలు చేయవచ్చు. ఇలా చేయడసం చాలా పవిత్రమైనదిగా, ఫలవంతమైనదిగా పరిగణించబడుతుంది. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని.. ఆ ఇంట్లో నివసిస్తుందని నమ్మకం. ఈ రోజున బంగారం, వెండితో పాటు, ఇత్తడితో చేసిన వస్తువులను కొనుగోలు చేయడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది.

శ్రీ యంత్రం

ధన్‌తేరస్ రోజున శ్రీయంత్రాన్ని ఇంటికి తీసుకురావడం చాలా శ్రేయస్కరం. దీపావళి రోజున శ్రీ యంత్రాన్ని కొని పూజిస్తే సంపద పెరుగుతుందని నమ్మకం. అంతే కాదు లక్ష్మీదేవి ఆశీస్సులు కూడా లభిస్తాయని విశ్వాసం.

బియ్యం

ధన్‌తేరస్ రోజున బియ్యం కొనడం కూడా చాలా మంచిది. ఈ రోజున బియ్యం కొనుగోలు చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందుల నుంచి ఉపశమనం లభిస్తుందని.. ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుందని నమ్మకం. ఈ రోజు బియ్యం కొనుగోలు చేసే సమయంలో ఆ బియ్యంలో ముక్కలు అంటే బియ్యం నూక లేకుండా ప్రత్యేక శ్రద్ధ వహించండి.

ధనియాలు

ధన్‌తేరస్ రోజున ధనియాలు కొనుగోలు చేయడం చాలా శుభప్రదంగా, ఫలవంతంగా పరిగణించబడుతుంది. ధన్‌తేరస్ రోజున పూజించేటప్పుడు లక్ష్మీదేవికి ధనియాలు సమర్పించడం ద్వారా, దేవి ప్రసన్నురాలై సుఖ సంతోషాలను ప్రసాదిస్తుందని నమ్ముతారు.

చీపురు

ధన్‌తేరస్ రోజున చీపురు కొనాలి. చీపురు ఇంటిని శుభ్రపరుస్తుంది. చీపురు లక్ష్మిదేవికి చిహ్నంగా కూడా పరిగణించబడుతుంది. శుభ్రంగా ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుందని నమ్ముతారు. ధన్‌తేరస్‌ రోజున చీపురు కొనడం వల్ల పేదరికం తొలగిపోయి ఇంట్లో ఆనందం, శ్రేయస్సు నెలకొంటుంది.

గోమతీ చక్రం

ధన్‌తేరస్ రోజున గోమతీ చక్రాన్ని కొనుగోలు చేయడం కూడా చాలా శుభప్రదం. ఇది గుజరాత్‌లోని గోమతి నదిలో సహజంగా ఏర్పడిన నత్త ఆకారం. దీనిని నాగ చక్రం లేదా శిలా-చక్ర అని కూడా అంటారు. ఈ రోజున గోమతి చక్రాన్ని ఇంటికి తీసుకురావడం వల్ల సంపద పెరుగుతుందని, ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని నమ్ముతారు.

 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)