Vaikunta Ekadasi: వైకుంఠ ఏకాదశి వేళ వైష్ణవ ఆలయాలకు పోటెత్తిన భక్తులు..

|

Dec 23, 2023 | 6:55 AM

ముక్కో ఏకాదశి రోజున ఆలయాల్లో ఉత్తర ద్వారం గుండా విష్ణుమూర్తిని దర్శిస్తే సమస్త పుణ్యపరంపరలు చేకూరతాయని భక్తుల విశ్వాసం. ఇందులో భాగంగానే ప్రముఖ దైవ క్షేత్రం.. తిరుమలలో శనివారం తెల్లవారుజామున 1.45 గంటలకు వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి. స్వామివ్వారిని ఉత్తరం ద్వారం గుండా దర్శించుకునేందుకు పలువురు ప్రముఖులు తిరుమలకు వచ్చారు. వీఐపీల వైకుంఠ ద్వారా దర్శనానికి...

Vaikunta Ekadasi: వైకుంఠ ఏకాదశి వేళ వైష్ణవ ఆలయాలకు పోటెత్తిన భక్తులు..
Vaikunta Ekadasi
Follow us on

వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని నేడు (శనివారం) వైష్ణవ ఆలయాలకు భక్తులు పెద్ద ఎత్తున పోటేత్తారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలకు భక్తులు వేకువజామును నుంచి తరలి వస్తున్నారు. దీంతో వైష్ణవ ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ధనుర్మాసం శుక్లపక్షంలో వచ్చే ఈ ముక్కోటి ఏకాదశి రోజున మూడు కోట్ల మంది దేవతలు భూలోకానికి వచ్చి శ్రీమహా విష్ణువును పూజిస్తారని భక్తుల విశ్వాసం.

ముక్కో ఏకాదశి రోజున ఆలయాల్లో ఉత్తర ద్వారం గుండా విష్ణుమూర్తిని దర్శిస్తే సమస్త పుణ్యపరంపరలు చేకూరతాయని భక్తుల విశ్వాసం. ఇందులో భాగంగానే ప్రముఖ దైవ క్షేత్రం.. తిరుమలలో శనివారం తెల్లవారుజామున 1.45 గంటలకు వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి. స్వామివ్వారిని ఉత్తరం ద్వారం గుండా దర్శించుకునేందుకు పలువురు ప్రముఖులు తిరుమలకు వచ్చారు. వీఐపీల వైకుంఠ ద్వారా దర్శనానికి మూడు గంటలు పట్టింది. ఇక 5:14 గంటలకు సర్వ దర్శనం భక్తుల క్యూలైన్‌ ప్రారంభమైంది.

వైకుంఠ ద్వారా దర్శనం చేసుకున్న ప్రముఖుల్లో.. పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ప్రశాంత్ కుమార మిశ్రా, సూర్య కాంత్, హిమ కోహ్లీ, రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రవీంద్ర బాబు, సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్. ఎల్ భట్టి,రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్యామ్ సుందర్, కర్ణాటక రాష్ట్ర గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్, రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి తారాల రాజశేఖర్, రాష్ట్ర మంత్రులు అంబటి రాంబాబు, కారుమూరి నాగేశ్వరరావు, రోజా, గుడివాడ అమర్నాథ్, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, శాసన ఉప సభాపతి కోలగట్ల వీరభద్ర స్వామి, ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి, ఉష శ్రీ చరణ్, మేరుగు నాగార్జున, చెల్లబోయిన వేణుగోపాలకృష్ణ, సినీ నిర్మాత బండ్ల గణేష్, ఎంపీలు సిఎం రమేష్, రఘురామ కృష్ణంరాజు, టీడీపీ రాజ్యసభ సభ్యులు కనకమేడల, టీడీపీ ఎంపీలు కేశినేని నాని, రామ్మోహన్ నాయుడు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఉన్నారు.

ఇక తెలంగాణలో ప్రముఖ క్షేత్రమైన రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉదయం ఐదున్నర నుంచి ఉత్తర ద్వార దర్శనానికి బారులు భక్తులు బారులు తీరారు. అలాగే హన్మకొండలోని హన్మకొండలోని శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయం, వరంగల్ లోని శ్రీ బాలాజీ ఆలయాలలో భక్తులు ఉదయం నుంచి దర్శనానికి బారులు తీరారు.

వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని ఉమ్మడి పాలమూరు జిల్లాలో వైష్ణవ ఆలయాలకు వైకుంఠ శోభ సంతరించుఉకంది. మన్యం కొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి, జిల్లాలోని వివిధ ఆలయాల్లో వేకువజామున నుంచి భక్తులకు ఉత్తర ద్వారం దర్శనం కల్పించారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని శ్రీ వేంకటేశ్వర ఆలయానికి భక్తులు పెత్త ఎత్తును పోటేత్తారు.

ఇక తెలంగాణలో ప్రముఖ ఆలయం యాద్రాదికి కూడా భక్తులు పోటేత్తారు. యాదాద్రిలో ఉత్తర ద్వారం ద్వారా భక్తులకు శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారు దర్శనమిస్తున్నారు. స్వామి వారిని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య దర్శించుకున్నారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం క్లిక్ చేయండి..