CM KCR – Yadadri: యాదాద్రికి చేరుకున్న సీఎం కేసీఆర్.. పునఃప్రారంభ తేదీపై కాసేపట్లో ప్రకటన..

|

Oct 19, 2021 | 1:34 PM

సీఎం కేసీఆర్‌ యాదాద్రికి చేరుకున్నారు. పునః నిర్మాణ పనులను పరిశీలించిన తర్వాత ప్రారంభ తేదీని ప్రకటిస్తారు. సాయంత్రం 4 గంటలకు మీడియాతో మాట్లాడతారు..

CM KCR – Yadadri: యాదాద్రికి చేరుకున్న సీఎం కేసీఆర్.. పునఃప్రారంభ తేదీపై కాసేపట్లో ప్రకటన..
Cm Kcr
Follow us on

సీఎం కేసీఆర్‌ యాదాద్రికి చేరుకున్నారు. పునః నిర్మాణ పనులను పరిశీలించిన తర్వాత ప్రారంభ తేదీని ప్రకటిస్తారు. సాయంత్రం 4 గంటలకు మీడియాతో మాట్లాడతారు ముఖ్యమంత్రి. అప్పుడే తేదీలను ప్రకటిస్తారు. యాదగిరిగుట్ట టెంపుల్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ,, యాదాద్రి ఆధ్యాత్మిక నగర రూపకల్పనకు ప్రణాళికలు రూపొందించింది. 12 భాగాలుగా అంచెల వారీగా నిర్మాణం కొనసాగుతుంది. భక్తులకు సకల సదుపాయాలు కల్పించేలా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో యాదాద్రి నిర్మాణం చేపట్టింది తెలంగాణ సర్కారు. మొత్తం ప్రాజెక్టు సుమారు వెయ్యి ఎకరాల్లో రూపొందుతోంది. టెంపుల్‌ సిటీలోని 850 ఎకరాలలో.. మొదటి దశలో 250 ఎకరాల్లో అన్ని రకాల సౌకర్యాలతో కాటేజీలు, ఉద్యానవనాలు, రోడ్లు రాబోతున్నాయి.

గుట్ట దిగువన 14 ఎకరాల కొండను కొనుగోలు చేసి ప్రెసిడెన్షియల్‌ సూట్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. దాతల విరాళాలతో వీవీఐపీల విడిది కోసం 14 విల్లాలు, ఒక ప్రెసిడెన్సియల్‌ సూట్‌ నిర్మిస్తున్నారు. యాత్రీకుల బస కోసం కొండ కిందే వసతుల ఏర్పాటు చేస్తు్న్నారు. పెద్దగుట్టపై 850 ఎకరాలు కొనుగోలు చేశారు. తొలి ధపాలో 250 ఎకరాలలో లే అవుట్‌ పనులు చేపట్టారు.

సీఎం కేసీఆర్‌ యాదాద్రి విజువల్స్ ఇక్కడ చూడండి..:

ఇవి కూడా చదవండి: Sirimanu Utsavam: నేడు పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం.. లక్షలాదిగా తరలిరానున్న భక్తులు..

Chanakya Niti: ఇలాంటి శత్రువులతో జాగ్రత సుమీ.. అలాంటివారి పట్ల ఏమరపాటు అసలే వద్దు..