Chanakya Niti: ఆచార్య చాణక్య ( acharya chanakya ) మంచి నైపుణ్యం కలిగిన వ్యూహకర్త. ఆర్థిక శాస్త్రంలో గొప్ప పండితుడిగా ప్రసిద్ధి చెందాడు. చాణుక్యుడు రచించిన చాణక్య నీతి నేటి మానవాళికి ఆదర్శనీయం. ఈ నీతి శాస్త్రంలో మతం, సంస్కృతం, న్యాయం, శాంతికి సంబంధించిన అనేక అంశాల గురించి ప్రస్తావించాడు. కొంతమంది ప్రజలు డబ్బు సంపాదించడమే జీవిత లక్ష్యం అని అనుకుంటారు.. డబ్బు సంపాదించడం కోసం అహర్నిశలు కష్టపడతారు. అయితే చాణక్యుడు రచించిన నీతి శాస్త్ర పుస్తకంలో.. ధనవంతులు కావడానికి లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి సంబంధించిన కొన్ని విషయాలను ప్రస్తావించారు. ఈ రోజు అవి ఏమిటో తెలుసుకుందాం.
ఆచార్య చాణక్యుడు ఒక వ్యక్తి జీవితంలో ధనవంతుడు కావడానికి చాలా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పాడు. వ్యక్తి తన డబ్బును ఆదా చేసుకోవాలి. ఆ డబ్బును ఎలా ఆదా చేసుకోవాలో విషయంపై అవగాహన కలిగి ఉండాలి. ఒక వ్యక్తికి డబ్బుని ఖర్చు పెట్టె విధానంలో సరైన ప్రణాళిక లేకపోతే.. అది పేదరికానికి అవుతుంది. డబ్బును ఒకే చోట ఉంచడం వల్ల కూడా పేదవాడు అవుతాడు.
ఎవరైనా తమకు రావాల్సిన డబ్బులు తీసుకునేందుకు ఏ మాత్రం సిగ్గుపడకూడదు. అలా డబ్బుని తీసుకోవడానికి సిగ్గుపడితే.. అటువంటి వ్యక్తి తన స్వంత డబ్బును పోగొట్టుకుంటాడు. అంతేకాదు అలాంటి వ్యక్తి వ్యాపారంలో భారీ నష్టాలను కూడా ఎదుర్కొంటాడు. ఆ వ్యక్తి క్రమంగా పేదవాడుగా మారాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కనుక డబ్బు రాబడి. కర్చుల విషయంలో ఒక వ్యక్తి స్పష్టమైన వైఖరిని కలిగి ఉండాలని ఆచార్య చాణక్యుడు చెప్పాడు.
డబ్బు విషయంలో వ్యక్తులు అహంభావంతో ఉండకూడదు. డబ్బు మీద దురాశను కలిగిన వ్యక్తి జీవితంలో డబ్బు కోసం ఎంతకైనా దిగజారేవారు ఉంటారు. అటువంటి వారు ఎప్పుడూ జీవితంలో సంతోషంగా ఉండలేరు. డబ్బుందని అహం కలిగిన వ్యక్తులు జీవితంలో ఎప్పటికీ ముందుకు వెళ్లలేరని చెప్పాడు. అంతేకాదు డబ్బు సంపాదించడానికి తప్పుడు మార్గాన్ని ఎన్నుకున్నవాడు ఎప్పటికీ జీవితంలో ఎదగలేడని చాణుక్యుడు చెప్పాడు.
(ఇక్కడ ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలు , నమ్మకం ఆధారంగా ఇవ్వబడింది. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. సాధారణ ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)
Also Read: