Chanakaya Niti: ఎంత కష్టపడినా విజయం సాధించలేదా? చాణక్య చెప్పిన ఈ విషయాలు పాటించండి.. జీవితం మారుతుంది

భారతదేశంలోని పురాతన మరియు అత్యంత ప్రభావవంతమైన పండితులలో ఒకడు. చాణక్యుడు. ఆచార్య చాణక్య తన కాలంలో అత్యంత జ్ఞానవంతుడు. పండితుడు. తక్షశిలలో అధ్యాపకుడిగా పని చేశాడు. ఆచార్య చాణక్యుడిని ప్రజలు కౌటిల్యుడు, విష్ణుగుప్తుడు అని కూడా పిలుస్తారు. చాణక్య నీతి శాస్త్రంలో మనిషి జీవన నియమాల గురించి చెప్పాడు. అందులో ఒకటి ఎవరైనా సరే ఎంత కష్టపడి పనిచేస్తున్నా విజయం సాధించకపోతే.. కొన్ని విషయాలపై దృష్టి పెట్టాలని సూచించాడు. చాణక్య చెప్పిన ఈ మాటలను జీవితంలో పాటిస్తే.. మీ జీవితాన్ని విజయం వైపు నడిచేలా చేస్తాయి.

Chanakaya Niti: ఎంత కష్టపడినా విజయం సాధించలేదా? చాణక్య చెప్పిన ఈ విషయాలు పాటించండి.. జీవితం మారుతుంది
Acharya Chanakya

Updated on: Jul 10, 2025 | 8:30 PM

ఆచార్య చాణక్యుడు గొప్ప ఆర్థికవేత్త, ఉపాధ్యాయుడు, దౌత్యవేత్త మాత్రమే కాదు మంచి రచియిత కూడా. జీవితంలోని ప్రతి అంశాన్ని ‘చాణక్య నీతి’ అనే పుస్తకం ద్వారా సరళంగా, ఖచ్చితమైన, ప్రభావవంతమైన రీతిలో వివరించాడు. ఈ విధానాలలో ఎవరైనా ఎంత కష్టపడి పనిచేస్తున్నా.. జీవితంలో విజయం దక్కనప్పుడు కొన్ని విషయాల పట్ల శ్రద్ధ వహించాలని ఆచార్య చాణక్య కూడా ప్రస్తావించాడు. ఈ రోజు మనం ఆ విషయాల గురించి తెలుసుకుందాం.

చెప్పే విషయాన్ని సరైన సమయంలో చెప్పాలి
ఆచార్య చాణక్యుడి ప్రకారం ఏదైనా చెప్పడానికి దానికంటూ సరైన సమయం ఉంటుంది. కనుక ఎవరైనా సరే చెప్పాలనుకున్న విషయాన్ని దానిని సమయంలోనే చెప్పాలి. ఎంత మంచి విషయం అయినా.. దానిని తప్పు సమయంలో చెబితే దాని ఫలితం ఎల్లప్పుడూ చెడుగా ఉంటుంది. అందుకనే చెప్పాలనుకున్న విషయాన్నీ ఇతరులకు చెప్పే సమయంలో కూడా సరైన సమయాన్ని ఎంచుకోవాలి. అప్పుడే ఫలితం శుభప్రదంగా ఉంటుంది.

ఈ విషయాలను ఎవరితోనూ పంచుకోవద్దు
చాణక్య నీతి ప్రకారం ఎవరైనా సరే పొరపాటున కూడా తమ ప్రణాళికలను లేదా బలహీనతలను ఇతరులతో పంచుకోకూడదు. దీనితో పాటు మీ దగ్గర ఉన్న డబ్బు ఎంత ఉందో ఎవరితోనూ పంచుకోకూడదు. ఈ విషయాలను దాచి ఉంచిన వ్యక్తి మెరుగైన , సురక్షితమైన జీవితాన్ని గడపడానికి అవకాశం లభిస్తుంది.

ఇవి కూడా చదవండి

మనస్సు, ఆలోచనలను నియంత్రించండి
మీరు ఇతరులపై కోపం, అసూయ లేదా అసూయ భావాలను కలిగి ఉన్న వ్యక్తి అయితే.. ఈ విషయాలు మీ విధ్వంసానికి దారితీస్తాయని చాణక్య చెప్పాడు. మరోవైపు మీరు వీటిని నియంత్రించినప్పుడు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన వ్యక్తిగా మారవచ్చు. అటువంటి జీవితంలో ప్రతిదీ సులభంగా సాధించే అవకాశం లభిస్తుందని చెప్పాడు.

జ్ఞానం లేకపోవడం
చాణక్య నీతి ప్రకారం జ్ఞానం అనేది మానవునికి ఉన్న గొప్ప సంపద. జ్ఞానం అనేది మీ జీవితాంతం మీతో పాటు ఉంటుంది. మీతో నగలు, డబ్బులు, ఆస్తులు వంటి జీవితాంతం ఉంటాయో లేదో అనేది ఎవరికీ తెలియదు. కానీ జ్ఞానం మాత్రం మీతో జీవితాంతం ఉంటుంది. ఎవరైనా తమ జీవితంలో విజయం సాధించాలనుకుంటే ప్రతిరోజూ ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండాలి.

స్థిరత్వంగా ఉండండి.
ఎవరైనా సరే తప్పుడు వ్యక్తులతో స్నేహం చేస్తున్నా, తప్పు ప్రదేశంలో నివసిస్తుంటే.. దాని ప్రభావం మీ జీవితంపై చాలా త్వరగా పడుతుంది. చాలా తీవ్రంగా కనిపిస్తుంది. తప్పు ప్రదేశంలో నివసిస్తుంటే ఎవరి జీవితం అయినా నాశనం కావడానికి ఎక్కువ సమయం పట్టదు. మీకు సరైన మార్గాన్ని చూపించే, జీవితంలో సానుకూల మార్పును తీసుకువచ్చే వ్యక్తులతోనే ఉండాలని సూచించాడు.

 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.