Chanakya Niti: వీటిని పాటిస్తే ఎలాంటి వారినైనా ఈజీగా కంట్రోల్ చేయొచ్చు.. నీతిశాస్త్రంలోని ఆసక్తికర విషయాలు మీకోసం..

|

Sep 24, 2021 | 12:49 PM

Chanakya Niti: ఆచార్య చాణక్య.. రాజకీయ దౌత్య వ్యూహాలకు పెట్టింది పేరు. ఆయన తన ఎదుటి వారిని తన నియంత్రణలోకి తెచ్చుకోవడం కోసం ఎంతో

Chanakya Niti: వీటిని పాటిస్తే ఎలాంటి వారినైనా ఈజీగా కంట్రోల్ చేయొచ్చు.. నీతిశాస్త్రంలోని ఆసక్తికర విషయాలు మీకోసం..
Chanakya
Follow us on

Chanakya Niti: ఆచార్య చాణక్య.. రాజకీయ దౌత్య వ్యూహాలకు పెట్టింది పేరు. ఆయన తన ఎదుటి వారిని తన నియంత్రణలోకి తెచ్చుకోవడం కోసం ఎంతో చాకచక్యంగా వ్యవహరించేవారు. రాజకీయ దౌత్యంలో ఇది అత్యంత కీలకం. ప్రస్తుతం కాలంలో రాజకీయంగానే కాక.. అన్ని విషయాల్లోనూ ఈ నీతి చాలా అవసరమైపోయింది. ఎదుటి వారిని తమ నియంత్రణలోకి తెచ్చుకుంటే ఎలాంటి పనులు అయినా ఈజీగా పూర్తి చేయొచ్చు. సాధారణంగా ఇతరులను తమ ఆధీనంలోకి తీసుకోవడం అంటే చేతబడి వంటి క్షుద్రపూజల ద్వారా మాత్రమే సాధ్యం అని భావిస్తుంటారు. కానీ, మాటల గారడీతోనే ఎదుటి వ్యక్తులను తమపై లాగేసుకోవచ్చు. తమ నియంత్రణలోకి తెచ్చుకోవచ్చు అని ఆచార్య చాణక్య తాను రాసిన నీతిశాస్త్రంలో పేర్కొన్నారు. అయితే, వ్యక్తులు రకరకాల మనస్తత్వాలను కలిగి ఉంటారు. అలాంటివారిని వారి మనస్తత్వాలకు తగ్గట్లుగా వ్యవహరించి తమ వైపు తిప్పుకోవచ్చునని చాణక్య తెలిపారు. మరి ఎవరిని ఎలా తమ నియంత్రణలోకి తీసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం..

తెలివైనవారిని ఎలా మచ్చిక చేసుకోవాలంటే..
చాణక్య నీతి ప్రకారం తెలివైన వ్యక్తిని లొంగదీసుకోవడం చాలా కష్టమైన పని. అందువల్ల తెలివైన వ్యక్తిని నియంత్రించడానికి ఏకైక మార్గం అతని ముందు నిజం మాట్లాడటం. నిజాలు చెప్పడం ద్వారా ఇలాంటి వారిని ఈజీగా ప్రభావితం చేయొచ్చు. అతనిని గౌరవించడం ద్వారా కంట్రోల్‌లోకి తెచ్చుకోవచ్చు. అలా వారి విశ్వాసం పొందితే.. మీరు చెప్పిన ప్రకారం వారు కూడా నడుచుకుంటారు.

మూర్ఖుడిని ఎలా మచ్చిక చేసుకోవాలి..
ఒక మూర్ఖుడిని మచ్చిక చేసుకోవడం చాలా ఈజీ అని చాణక్య తన నీతిశాస్త్రంలో పేర్కొన్నారు. కేవలం అలాంటి వారిని ప్రశంసిస్తే చాలు.. వారు ఇట్టే బలహీనపడిపోతారట. ఇలాంటి వారికి ఏది తప్పు.. ఏది కరెక్ట్ అని గుర్తించే సామర్థ్య ఉండదు. ప్రశంసలు వినిపిస్తే చాలు ఉబ్బితబ్బిబ్బైపోతాడు. ఈ విధంగా వారిని కంట్రోల్‌లోకి తెచ్చుకోవచ్చు.

అత్యాశపరులను ఎలా మచ్చిక చేసుకోవాలి..
అత్యాశ గల వ్యక్తిని కూడా చాలా సునాయాసంగా మచ్చిక చేసుకోవచ్చు. వారికి డబ్బు ఇవ్వడం, ఇతర స్వల్ప అవసరాలను తీర్చడం ద్వారా వారిని మీ నియంత్రణలోకి తీసుకోవచ్చు. మీరు చెప్పినట్లుగా వారు నడుచుకుంటారు. ప్రస్తుతం మోగాళ్లు, మాయగాళ్లు అంతా జనాల్లోని అత్యాశను ఆసరా చేసుకునే భారీ మోసాలకు పాల్పడుతున్న విషయాన్ని మనం గ్రహించాలి.

కోపంతో ఉన్న వ్యక్తులను ఎలా మచ్చిక చేసుకోవాలి..
చాణక్య నీతిశాస్త్రం ప్రకారం.. ఆగ్రహ స్వభావం ఉన్న వ్యక్తులను కంట్రోల్ చేయడానికి ఒకటే మార్గం ఉంది. వారి కోపాన్ని భరించడం ద్వారా వారిని నియంత్రించవచ్చు. ఎందకంటే.. ఒక వ్యక్తి మరో వ్యక్తిపై కోపం ప్రదర్శిస్తే ఊరుకునే పరిస్థితి ఉండదు. అందుకే మనం ఎవరినైతే మన గ్రిప్‌లోకి తీసుకోవాలనుకుంటున్నామో.. వారి కోపాన్ని సహిస్తే క్రమంగా ఆ వ్యక్తి నియంత్రణలోకి మన వస్తారు అని చాణక్య పేర్కొన్నారు. కోపం అనేది బలహీనత.. ఆ బలహీనతను అర్థం చేసుకున్న వ్యక్తులను వదులుకోవడానికి ఎవరూ సిద్ధపడరు.

Also read:

Yoga Asanas: మెడ నొప్పి మిమ్మల్ని తీవ్రంగా వేధిస్తోందా? ఈ మూడు ఆసనాలతో ఉపశమనం పొందండి..

Anti Tobacco: ఆ యాడ్ నుంచి తప్పుకోండి.. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్‌కు టొబాకో ఆర్గనైజేషన్ లేఖ..

చాణక్య నీతి: మీ చుట్టూ ఉండే వారు ఎలాంటి వారో తెలుసుకోవాలా?.. ఈ 4 విషయాలను పాటించండి..