Chanakya Niti: ఆచార్య చాణక్యుడు తన జీవితంలో అనేక గొప్ప కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ప్రత్యర్థులు సైతం ఆయన నైపుణ్యం, మేధాశక్తి ముందు మోకరిల్లారు. ఉక్కు సంకల్పం ఆయన సొంతం. రాజకీయ చరితర్రలో ఆచార్య చాణక్య పేరు సువర్ణాక్షరాలతో లఖించబడినది. ఆచార్య చాణక్య కేవలం నైపుణ్యం కలిగిన రాజకీయవేత్త మాత్రమే కాదు, ఉపాధ్యాయుడు, ఆధ్యాత్మిక గురువు, రచయిత, ఆర్థికవేత్త కూడా. ఈయనను కౌటిల్యుడు, విష్ణుగుప్తుడు అని కూడా అంటారు. ఆచార్య తన విద్యను టాక్సిలా విశ్వవిద్యాలయం నుండి పూర్తి చేసారు. ఆ తరువాత, ఎంతో మందికి విద్యాబుద్దులు చెప్పారు. జీవిత పాఠాన్ని వారికి వివరించారు. ఈ క్రమంలోనే ఆచార్య చాణక్య.. జీవితానికి సంబంధించి అనేక రచనలు చేశారు. వాటిలో చాణక్య నీతి ఎంతో కీలకమైనది. ఇప్పటికీ దీనిని గొప్ప రచనగా పేర్కొంటుంటారు. ఒక వ్యక్తి జీవితంలో ఎలా ఎదగాలి, ఏం చేయాలి, ఏం చేయకూడదు వంటి అనేక వివరాలను ఇందులో పొందుపరిచారు. ఈ నేపథ్యంలోనే ఆచార్య చాణక్య.. 3 అంశాల పట్ల ఓపికడగా ఉండాలని చెప్పాడు. లేదంటే భారీ నష్టాన్ని చవి చూడాల్సి ఉంటుందని హెచ్చరించారు. మరి ఆ మూడు ముఖ్యమైన అంశాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
1. పురుషుల విషయంలో స్త్రీలు సంయమనం, సహనం పాటించాలని ఆచార్య చాణక్య సూచించారు. ఎవరైనా స్త్రీ సాన్నిహిత్యం పొందడానికి ఉత్సాహం చూపరాదని పేర్కొన్నారు. ఇది ప్రేమ, గౌరవంతో స్వీకరించబడాలి.. దీనికి సహనం అవసరం అన్నారు. ఒక వ్యక్తి ఆత్రపడితే తన ఆత్మగౌరవాన్ని కోల్పోవాల్సి వస్తుందన్నారు.
2. తినే తిండి విషయంలో సహనంతో ఉండాలి. ఆహారం ఎప్పుడూ తొందరపడకూడదు. తేలికపాటి ఆహారాన్ని మాత్రమే తినాలి. రుచికరంగా ఉందని అవసరం కంటే ఎక్కువగా తింటారు. దాని ప్రభావం మీ ఆరోగ్యంపై పడే అవకాశం ఉంది. మీరు ఆరోగ్యంగా ఉండాలనుకుంటే, మితంగా తినాలి అని చెప్పారు.
3. జీవితంలో డబ్బు చాలా ముఖ్యం, కానీ డబ్బు విషయంలో తెలివిగా నిర్ణయం తీసుకోవాలి. డబ్బు సంపాదనకు ఏమాత్రం తొందరపడొద్దు. లేదంటే తప్పుడు మార్గంలో వెళ్లే అవకాశాలు పెరుగుతాయి. తొందరపాటుతో తీసుకునే నిర్ణయాలు మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెట్టే ప్రమాదం ఉంది. అలాగే డబ్బు ఖర్చు చేసే విషయంలోనూ తొందరపడొద్దు. లేదంటే ఆర్థిక పరిస్థితి మరింత దిగజారిపోయే ప్రమాదం ఉంది. అందుకే.. డబ్బు సంపాదించడం, ఖర్చు చేయడం విషయంలో ఎల్లప్పుడూ సహనం, సంయమనంతో నిర్ణయాలు తీసుకోవాలని చాణక్య సూచించారు.
Also read:
Love Story : సెన్సార్ పూర్తి చేసుకున్న శేఖర్ కమ్ముల సినిమా.. లవ్ స్టోరీ మూవీ ఎన్నిగంటలంటే..
India Coronavirus: స్వల్పంగా పెరిగిన కోవిడ్ పాజిటివ్ కేసులు.. కేరళలో ఒకే రోజు 129 మంది కరోనాతో మృతి