ఆచార్య చాణక్యుడు తెలివైనవాడు, ధైర్యవంతుడు, జ్ఞానవంతుడు. శతాబ్దాల క్రితం ప్రసిద్ధ ఆర్థికవేత్త, తత్వవేత్త, ప్రాచీన భారతదేశంలోని రాజకీయ శాస్త్రంలో నిపుణుడైన ఆచార్య చాణక్యుడు వ్రాసిన అతని విధానాలు నేటి యుగంలో కూడా అనుసరణీయం. మానవాళికి ఉపయోగకరంగా ఉన్నాయి. ఆచార్య చాణక్య తన పుస్తకంలో స్త్రీల లక్షణాలను వివరించాడు. కొన్ని విషయాల్లో పురుషులు ఎప్పటికీ స్త్రీలను ఓడించలేరని చాణక్య పేర్కొన్నాడు. ఈ లక్షణాలలో పురుషుల కంటే స్త్రీలు ఎప్పుడూ ముందుంటారని తెలుపారు. ఆ లక్షణాలు ఏమిటో ఈరోజు తెలుసుకుందాం..
ధైర్యంలో మహిళలు :
చాణక్య విధానం ప్రకారం.. పురుషుల కంటే స్త్రీలు చాలా ధైర్యంగా ఉంటారు. ఎటువంటి పరిస్థితులనైనా గట్టిగా ఎదుర్కొంటారు. స్త్రీ పురుషుడి కంటే 6 రెట్లు ఎక్కువ ధైర్యంగా ఉంటుంది. ఎప్పుడైతే తీవ్ర సంక్షోభ ఏర్పడుతుందో.. అప్పుడు స్త్రీ ధైర్యంగా స్వయంచాలకంగా ముందుకు వస్తుందని చాణక్యుడు చెప్పాడు. ధైర్యం విషయంలో స్త్రీలను పురుషులు ఎప్పుడూ ఓడించలేరని స్పష్టం చేశారు చాణక్య.
స్త్రీలు భావోద్వేగం:
చాణక్య నీతి ప్రకారం.. స్త్రీ వయస్సు పెరిగేకొద్దీ.. ఆమె మరింత తెలివైనది అవుతుంది. అదే సమయంలో.. పురుషులు కంటే మహిళలు ఎక్కువ భావోద్వేగంగానికి గురవుతారు. ఇది వారి బలహీనత కాదు.. స్త్రీల అంతర్గత బలం. దీని కారణంగా స్త్రీలు ఎటువంటి పరిస్థితులు ఏర్పడినా.. తమ ఉనికిని కాపాడుకుంటారు.
స్వచ్ఛమైన హృదయం:
చాణక్య నీతి ప్రకారం.. అప్పుడప్పుడుస్త్రీలు స్వేచ్ఛగా ఏడుస్తారు. దీంతో చాలా స్వచ్ఛమైన హృదయం కలిగి ఉంటారు. తమకు కోపం వచ్చినా .. చేదు అనుభవాలు ఎదురైనా మహిళలు భావోద్వేగానికి గురై.. వెంటనే ఏడుస్తారు. ఇలాంటి స్త్రీలు ఎవరి మాటలను మనసులోకి తీసుకోరు.. అందరినీ త్వరగా క్షమించగలరు. . స్త్రీలాల్లోని ఈ స్వభావం కుటుంబం ఆనందం, శాంతిని కొనసాగించడంలో సహాయపడుతుంది.
నిబంధనలకు కట్టుబడి ఉండే మహిళలు:
త్వరగా భావోద్వేగానికి లోనయ్యే మహిళలు క్రమశిక్షణతో ఉండటానికి ఇష్టపడతారని ఆచార్య చాణక్య నమ్ముతారు. చాణక్య నీతి ప్రకారం, క్రమశిక్షణతో జీవిస్తూ.. నియమాలు, నిబంధనలను అనుసరించే మహిళలు తమ విజయానికి దారితీసే మార్గాన్ని నిర్ధారించడంలో నైపుణ్యం కలిగి ఉంటారు. అంతేకాదు ఇతరులకు ఆదర్శంగా నిలుస్తారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)