Chanakya Niti: మీ భాగస్వామి మనస్తత్వం తెలుసుకోవాలనుందా? చాణక్య చెప్పిన ఈ టిప్స్‌పై ఓ లుక్కేయండి..!

Chanakya Niti: ఆచార్య చాణక్యుడు తాను రచ్చించి నీతి శాస్త్రం గ్రంధంలో వ్యక్తి జీవితానికి సంబంధించిన అనేక వివరాలను పొందుపరిచారు.

Chanakya Niti: మీ భాగస్వామి మనస్తత్వం తెలుసుకోవాలనుందా? చాణక్య చెప్పిన ఈ టిప్స్‌పై ఓ లుక్కేయండి..!
Follow us

|

Updated on: Jun 30, 2022 | 3:49 PM

Chanakya Niti: ఆచార్య చాణక్యుడు తాను రచ్చించి నీతి శాస్త్రం గ్రంధంలో వ్యక్తి జీవితానికి సంబంధించిన అనేక వివరాలను పొందుపరిచారు. అలాగే వ్యక్తుల వ్యక్తిత్వాలు, వారి నైజం, సమస్యా పరిష్కారానికి అవసరమైన చర్యలు సహా అనేక అంశాలను అందులో పేర్కొన్నారు. ఇందులో భాగంగా.. యువతీ, యువకుడికి వివాహం నిశ్చయించే ముందు వారి వారి గుణగణాలు, మనస్తత్వం, కుటుంబం పట్ల వారు వ్యవహరించే తీరుతెన్నులను తెలుసుకునే కిటుకులనూ చాణక్య పేర్కొన్నారు. భాగస్వాములిద్దరూ.. నిర్మల హృదయం కలవారు, ఒకరినొకరు ప్రేమించుకునే వారు, దైవభక్తిని పాటించేవారు, భాగస్వామికి సత్యం మాత్రమే చెప్పేవారు, దొరికితే వారి జంట అన్యోన్యంగా ఉంటుందని, జీవితం ఆనందమయం అవుతుందని చాణక్య చెప్పారు. ముఖ్యంగా ఒక వ్యక్తి తాను చేసుకోయే భార్య ఎలా ఉండాలనే దానిపై కీలక సూచనలు చేశారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

ఆచార్య చాణక్యు తెలిపిన సూచనల మేరకు.. భార్య రూపవతి అయినా, సాధారణమైనదైనా.. ఆమె బాగా చదువుకున్నదా? లేదా?.. నిరక్షరాస్యురాలైనా, ఆమెకు విలువలు ఎలా ఉన్నాయనేది ముఖ్యం. సంస్కారవంతమైన స్త్రీ కుటుంబం గౌరవాన్ని, పేరు ప్రతిష్టలను పెంచుతుంది. తరతరాలకు మంచి విలువలను అందజేస్తుంది. మీరు చేసుకోబోయే స్త్రీ సంస్కారం కలిగిన వ్యక్తి అయితే, ఆమెతో మీ జీవితం ధన్యం అవుతుంది.

భార్య వ్యక్తిత్వాన్ని పరీక్షించాలనుకుంటే.. ఒక చిన్న పని ఇవ్వాలని ఆచార్య చాణక్య సూచించారు. నమ్మకం కలిగే పనిని ఇవ్వడం, ఆ పనిలో ఆమె విశ్వాసం ప్రదర్శిస్తే.. నమ్మదగిన వారా? కాదా? అనేది తెలుస్తుందన్నారు. అలాగే, మీ సుఖ దుఃఖాల సమయంలో, డబ్బు, కీర్తి లేనప్పుడు భార్య వ్యక్తిత్వం బయటపడుతుందన్నారు. మంచి గుణాలున్న భార్య ఆపదలో కూడా తన భర్తకు అండగా ఉంటుందని పేర్కొన్నారు.

మూర్ఖుడైన పిల్లవాడికి పాఠాలు చెబుతూ సమయాన్ని వృధా చేసుకున్నట్లే.. ఒక చెడు గుణాలు, దుర్భుద్ధి కలిగిన స్త్రీతో జీవిస్తున్నట్లయితే.. మీ జీవితంలోకి కష్టాలను ఆహ్వానిస్తున్నట్లే. ఇలాంటి భాగస్వాములతో జీవించడం కంటే జీవితంలో ఒంటరిగా ఉండటం మంచిదని సూచిస్తున్నారు ఆచార్య చాణక్య.

ఇదే సమయంలో భర్తలకు కూడా పలు సూచనలు చేశారు ఆచార్య చాణక్యుడు. భార్యను కాపాడుకోవడానికి డబ్బు పోగొట్టుకోవాల్సి వస్తే.. ఏమాత్రం సంశయించొద్దన్నారు. డబ్బు పోతేపోయింది.. భార్యను వదులుకోవద్దన్నారు. అయితే, ఆత్మగౌరవం విషయానికి వస్తే భార్య, డబ్బు రెండింటినీ కోల్పోవడానికి వెనుకాడొద్దన్నారు.