Chanakya Niti: ఈ అలవాట్లు భార్యాభర్తల మధ్య దూరాన్ని పెంచుతాయి.. ఈ తప్పులను నివారించండి

చాణక్య నీతి మానవ జీవిత విధానం గురించి అనేక విషయాలను ప్రస్తావించింది. పురాతన కాలంలో చెప్పిన ఈ విషయాలు నేటికీ అనుసరణీయమే.. చాణక్య నీతి ప్రకారం భార్యాభర్తల మధ్య సంబంధంలో చీలుకలు తెచ్చే కొన్ని గుణాలున్నాయి. ముఖ్యంగా ఇరువురి మధ్య అధికార భావన దూరాన్ని పెంచుతుంది, సహకార స్ఫూర్తిని అలవర్చుకోవడం ద్వారా సంబంధాన్ని ఎలా బలోపేతం చేసుకోవాలో తెలుసుకోండి.

Chanakya Niti: ఈ అలవాట్లు భార్యాభర్తల మధ్య దూరాన్ని పెంచుతాయి.. ఈ తప్పులను నివారించండి
Chanakya Niti

Updated on: Oct 05, 2025 | 2:45 PM

చాణక్య నీతి ప్రకారం సంబంధాల్లో ఆనందం, బలానికి అవగాహన .. సరైన దృక్పథం చాలా కీలకం. దౌత్యంలో నిష్ణాతుడైన ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో సంబంధాలలో ఆధిపత్యం లేదా అధికార భావాన్ని కలిగి ఉండటం తరచుగా దూరానికి దారితీస్తుందని నొక్కి చెప్పాడు. మనం తాడును ఎంత గట్టిగా పట్టుకుంటామో.. దాన్ని మన వైపుకు లాగడానికి ఎంత గట్టిగా ప్రయత్నిస్తామో.. అది మన చేతులకు అంత ఎక్కువ నొప్పిని, నష్టాన్ని కలిగిస్తుంది. మీరు ఇంకా ఎక్కువ శక్తిని ప్రయోగిస్తే… తాడు తెగిపోవచ్చు. ఇదే సూత్రం మానవ సంబంధాలకు కూడా వర్తిస్తుంది. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య బంధం నిలబడాలంటే అధికారం చూపించకూడదు.

జీవిత భాగస్వామి ఎప్పుడూ తమ సొంత కోరికలకు, తమ హక్కులకు ప్రాధాన్యత ఇస్తే.. సంబంధంలో ఉద్రిక్తత ఏర్పడి.. దూరం పెరుగుతుంది. ఈ ఆధిపత్య భావన సంబంధాన్ని బలోపేతం చేయడానికి బదులుగా బలహీనపరుస్తుంది. అందుకనే భార్యాభర్తల మధ్య సంబంధంలో దూరాన్ని తగ్గించేందుకు కొన్ని తప్పు చేయవద్దు అని చెప్పాడు.

చాణక్యుడు చెప్పిన అలవాట్లు ఏమిటంటే..

  1. మీ భాగస్వామి చెప్పేది ప్రశాంతంగా వినండి.. వారి దృక్కోణాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి.
  2. మీరు నిర్ణయాన్ని విభేదించినప్పటికీ, మీ భాగస్వామి భావాలను, కోరికలను గౌరవించండి. ఒకరితో ఒకరు విషయాలను పంచుకోండి.
  3. ఇంటి పనిలో, సంబంధాల విషయంలో ఇరువురు సమాన బాధ్యత తీసుకోండి. తద్వారా అది ఏకపక్షంగా భారంగా మారదు.
  4. ప్రతి సమస్య గురించి బహిరంగంగా మాట్లాడండి. ఒకరినొకరు నిందించుకునే బదులు పరిష్కారంపై దృష్టి పెట్టండి.
  5. చిన్న చిన్న విషయాలను కూడా అభినందించండి. ప్రతిరోజూ ఒకరికొకరు ప్రేమను చూపించుకోండి. ఒకరిపై ఒకరు ప్రేమను వ్యక్తపరుస్తూ ఉండండి.
  6. చాణక్య నీతి ప్రకారం సంబంధాలు హక్కులు ..యు ఒత్తిడి కంటే సహాయం.. సహకారంతో సాగుతున్నప్పుడు.. బంధంలో దూరాలు తగ్గుతాయి. బంధాలు బలపడతాయి. భార్యాభర్తల మధ్య అవగాహన, సమతుల్యత ఒకరికొకరిని దగ్గర చేస్తాయి.
  7. సంబంధాలలో దూరం భావోద్వేగ, మానసిక దూరానికి దారితీయడమే కాదు.. సంబంధాల విచ్ఛిన్నానికి కూడా దారితీస్తుంది. కనుక సహకార స్ఫూర్తిని అలవర్చుకోవడం ద్వారా భార్యాభర్తలు తమ సంబంధాన్ని బలంగా, సంతోషంగా .. శాశ్వతంగా మార్చుకోవచ్చు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.