
ఇంట్లో అమ్మాయి పుడితే లక్ష్మీదేవి ఇంటికి వచ్చింది అని, సంతోషపడే వారు చాలా తక్కువగా ఉంటారు. అమ్మాయి కంటే అబ్బాయే పుట్టాలి అని చాలామంది దేవుళ్లకు మొక్కుతూ ఉంటారు. జనరేషన్స్ మారుతున్నా ఆడపిల్లను భారంగా చూసే రోజులు మారడం లేదు. మగ పిల్లగాడు పుడితే వారసుడు వచ్చాడంటూ సంబరాలు జరుపుకుంటున్న సందర్భాలు మనం చూస్తూనే ఉన్నాం. అబ్బాయి పుడితే అదేదో ప్రపంచాన్ని జయించినట్లుగా ఫీలవుతుంటారు. అమ్మాయి కంటే అబ్బాయికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు. కానీ ఈ పరిస్థితి ఇప్పుడిప్పుడే మారుతుంది. ఆడపిల్ల పుడితే తమ ఇంటికి ప్రిన్సెస్ వచ్చిందనే భావించే మనుషులు తారసపడుతున్నారు. తాజాగా మెదక్ జిల్లా నర్సాపూర్‌లో ఆడబిడ్డను అలానే ట్రీట్ చేసింది ఓ కుటుంబం. ఇంటికి మహాలక్ష్మి లాంటి ఆడబిడ్డతో వచ్చిన దంపతులకు పూలు చల్లుతూ స్వాగతం పలికారు కుటుంబీకులు.
వివరాల్లోకి వెళ్తే మెదక్ జిల్లా నర్సాపూర్‌కు చెందిన కరుణాకర్, స్పందన దంపతులకు 27 రోజుల క్రితం ఆడపిల్ల పుట్టింది. ఇటీవల అమ్మమ్మగారి ఇంట్లో తొట్టెల కార్యక్రమం నిర్వహించారు. కాగా ఆదివారం కరుణాకర్ నర్సాపూర్‌లోని తన నివాసానికి పుట్టిన పాపను తీసుకొస్తుండగా బంధుమిత్రులు, కుటుంబసభ్యులు అందరూ కలిసి పూలు చల్లుతూ ఘన స్వాగతం పలికారు. తమ ఇంటికి సాక్షాత్తూ మహాలక్ష్మి వచ్చిందని సంబరపడ్డారు. ఆడపిల్ల పుట్టగానే భారం అనుకొని విసిరేసిన తల్లిదండ్రులను చూసాం, కడుపులో పెరుగుతుంది ఆడపిల్లని తెలుసుకొని అబార్షన్లు చేయించే తల్లిదండ్రులను చూసాం. కానీ ఆడపిల్ల పుట్టడంతో సంబరాలు జరుపుకుంటూ ఘనంగా స్వాగతించడం మాత్రం చాలా అరుదు. నిజంగా ఈ కుటుంబాన్ని అభినందిచాల్సిందే.
వీడియో దిగువన చూడండి…
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..