Padmavathi Temple: తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో ఈనెల 13వ తేదీన పద్మావతి అమ్మవారి ఆలయానికి భూమి పూజ జరుగుతుందని టీటీడీ పాలకమండలి సభ్యులు శేఖర్ రెడ్డి తెలిపారు. గురువారం నాడు మీడియాతో మాట్లాడిన ఆయన.. టీటీడీ ఆధ్వర్యంలో టి.నగర్‌లో ఆలయ నిర్మాణం జరుగుతుందని చెప్పారు. ఆలయ నిర్మాణ భూమి పూజ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, కంచి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి పాల్గొంటారని తెలిపారు. సినీ నటి కాంచన టి.నగర్‌లోని తన స్థలాన్ని టీటీడీకి విరాళంగా ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ స్థలంలోనే పద్మావతి అమ్మవారి ఆలయ నిర్మాణం చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయ నిర్మాణానికి రూ. 6 కోట్ల వ్యయం అవుతుందని శేఖర్ రెడ్డి వెల్లడించారు. రాతి కట్టడం కోసం అదనంగా మరో రూ. 1.10 కోట్లు అవసరం అవుతుందని చెప్పారు. అయితే అదనంగా అయ్యే మొత్తం ఖర్చును తానే స్వయంగా భరిస్తానని శేఖర్ రెడ్డి ప్రకటించారు. అంతేకాకుండా.. తమిళనాడులోని ఆలయాలకు గుడికో గోవు చొప్పున టీటీడీ ద్వారా అందిస్తామని ఆయన తెలిపారు. ఆసక్తి ఉన్నవారు ముందుకు వస్తే గోవులు ఇచ్చేందుకు టీటీడీ సిద్ధంగా ఉందన్నారు.
Also read:
సెబీ గ్రీన్ సిగ్నల్.. ఐపీవోకు రాబోతోన్న నురేకా, వంద కోట్ల సమీకరణ లక్ష్యం, ఫిబ్రవరి 15 నుంచి షురూ