Sri Ramanavami 2022: బీహార్(Bihar) శ్రీరామ నవమి సందర్భంగా చరిత్ర సృష్టించింది. భగల్పుర్(Bhagalpur) లో అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. ఏప్రిల్10న శ్రీరామనవమిని పురస్కరించుకొని రామ నవమికి ముందు 150 అడుగుల పొడవైన రాముడి చిత్రాన్ని రూపొందించారు. భాగల్‌పూర్‌లోని లజ్‌పత్ పార్క్ మైదానంలో 8 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో 5 లక్షల దీపాలతో శ్రీరాముని చిత్ర పటాన్ని తయారుచేశారు. ఈ చిత్ర తయారీకి గత ఐదు రోజులుగా సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో అనేక మంది పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వాహుకుడు అర్జిత్ చౌబే మాట్లాడుతూ.. 12 రకాల రంగులతో 150 అడుగుల ఎత్తులో శ్రీరాముడు చిత్ర పటాన్ని చిత్రీకరించామని చెప్పారు. ఇది
ప్రపంచ రికార్డు అవుతుందని అన్నారు. ఇప్పటికే గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ లో నమోదు చేసే జట్టు.. ఏప్రిల్ 6వ తేదీన భాగల్‌పూర్‌కు చేరుకుందని తెలిపారు.
ఏప్రిల్ 10 వ తేదీన జరిగే శ్రీ రామ నవమి రోజు జరిగే కార్యక్రమానికి బిహార్ ఉపముఖ్యమంత్రి తార్కిషోర్ ప్రసాద్, కేంద్ర మంత్రి అశ్వనీ చౌబే సహా పలువురు కేంద్ర మంత్రులు , ఎంపీలు హాజరుకానున్నారు.
Also Read: Andhra Pradesh: సీఎం జగన్ గుడ్‌న్యూస్.. నేడు నేరుగా వారి ఖాతాల్లోకి నగదు జమ
Health Tips: మండే ఎండలు.. మీకు తరచూ వేడి చేస్తుందా.. ఇదిగో టిప్స్
AP Crime News: పెళ్ళికి కట్నం అడిగిన ప్రేమించిన యువకుడు.. మనస్తాపంతో లాయర్ స్టూడెంట్ సూసైడ్..