Ayodhya Temple: తెలుగు గడ్డ నుంచి అయోధ్యకు బాలరాముడు.. రెండు రోజుల్లో హైదరాబాద్ కు చేరుకోనున్న రామయ్య విగ్రహం..

| Edited By: Surya Kala

Oct 21, 2023 | 1:39 PM

అయోధ్య రామ మందిరంలో ఉపాలయాలు ఉన్నాయి. వివిధ దశల్లో రాముడి విగ్రహాలను ఇక్కడ ప్రతిష్టించనున్నట్లు ఆశ్రమ నిర్వాహకులు తెలిపారు. ఇందులో భాగంగానే బాల రాముడి విగ్రహాన్ని ఆళ్లగడ్డలో తయారు చేశారని చెప్పారు. ఆళ్లగడ్డ నుండి రెండు తెలుగు రాష్ట్రాల్లో రాముడి విగ్రహాన్ని భక్తులు ధర్శనార్ధం ప్రదర్శించి ఆ తర్వాత అయోధ్యకు తరలించనున్నట్లు తెలిపారు.

Ayodhya Temple: తెలుగు గడ్డ నుంచి అయోధ్యకు బాలరాముడు.. రెండు రోజుల్లో హైదరాబాద్ కు చేరుకోనున్న రామయ్య విగ్రహం..
Bala Ramayya Idol
Follow us on

అయోధ్యలో రామమందిరాన్ని అత్యంత్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుండి పలువురు ఈ నిర్మాణంలో భాగస్వాములవుతున్నారు. పది రోజుల క్రితం తెనాలికి చెందిన వాసదాస ఆశ్రమం నుండి మూల విరాట్ దిగువున ప్రతిష్టించనున్న యంత్రాన్ని అయోధ్యకు పంపించారు. ఇప్పుడు అదే మాదిరిగా అయోధ్య ఆలయంలో ప్రతిష్టించేందుకు బాల రాముడి విగ్రహాన్ని ప్రత్యేకంగా తయారు చేయించి అయోధ్య పంపిస్తున్నారు.

అయోధ్య రామ మందిరంలో ఉపాలయాలు ఉన్నాయి. వివిధ దశల్లో రాముడి విగ్రహాలను ఇక్కడ ప్రతిష్టించనున్నట్లు ఆశ్రమ నిర్వాహకులు తెలిపారు. ఇందులో భాగంగానే బాల రాముడి విగ్రహాన్ని ఆళ్లగడ్డలో తయారు చేశారని చెప్పారు. ఆళ్లగడ్డ నుండి రెండు తెలుగు రాష్ట్రాల్లో రాముడి విగ్రహాన్ని భక్తులు ధర్శనార్ధం ప్రదర్శించి ఆ తర్వాత అయోధ్యకు తరలించనున్నట్లు తెలిపారు.

ఆళ్లగడ్డ నుండి బయలు దేరిని బాల రాముడి విగ్రహం గుంటూరు రామ నామ క్షేత్రం, అంగలకుదురు వాసదాస స్వామి ఆశ్రమం, భద్రాచలం, హైదరాబాద్ మీదుగా అయోధ్యకు చేరుకుంటుదని పీఠం నిర్వాహకులు చెప్పారు. గుంటూరు రామ నామ క్షేత్రం, అంగలకుదురులో బాల రాముడి విగ్రహానికి భక్తులు భారీ సంఖ్యలో స్వాగతం పలికారు. రోడ్డు కిరువైపులా నిలబడి పూలు జల్లుతూ బాల రాముడి దర్శనం చేసుకున్నారు.

రెండు మూడు రోజుల్లో బాల రాముడి విగ్రహం హైదరాబాద్ చేరుకుంటుందని అనంతరం విగ్రహాన్ని అయోధ్యకు తరలించనున్నట్లు వాసదాసస్వామి పీఠం నిర్వాహకులు తెలిపారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..