
Shani Dev: జ్యోతిషశాస్త్రంలో శని అత్యంత శక్తివంతమైన గ్రహంగా వర్ణించబడింది. శనిదేవుడు ఎవరిపై దయ చూపిస్తాడో.. వారి జీవితం పూల పాన్పులా మారుతుంది. ఎలాంటి సమస్యలూ వారి జీవితంలోకి రావు. సాఫీగా సాగిపోతుంది. కానీ, శని దేవుడి చెడు దృష్టి పడితే మాత్రం వారి జీవితం చిన్నాభిన్నం అవుతుంది. జీవితం మొత్తం సమస్యలే ఎదుర్కోవాల్సి వస్తుంది.
మీరు కూడా ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా బాధపడుతున్నట్లయితే.. ఖచ్చితంగా శని దేవుడికి కొన్ని పరిహారాలు చేయాలని సూచిస్తున్నారు వేద పండితులు. ఎందుకంటే జాతకంలో శని దోషం, శని సడే సతి, ధైయా దుష్ప్రభావాల కారణంగా.. జీవితం ఇబ్బందులపాలవుతుంటారు. అలాంటి పరిస్థితిలో శని దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి.. జ్యోతిష శాస్త్రంలో కొన్ని అరుదైన చర్యలు ప్రస్తావించబడ్డాయి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఉద్యోగంలో ఆటంకం: శని దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి శనివారం నల్ల కుక్కకు, నల్ల ఆవుకి రొట్టెలు తినిపించండి. నల్ల పక్షి, కాకికి ఆహారం వేయాలి. ఇది ఉద్యోగం, వ్యాపారంలో అడ్డంకులను తొలగిస్తుందని నమ్ముతారు. శని మహాదశ నుంచి ఉపశమనం లభిస్తుంది.
ఆర్థిక సంక్షోభం: శనికి కోపం వస్తే ఆ వ్యక్తి ఆర్థికంగా తీవ్ర నష్టపోతారు. పైసా కోసం తహతహలాడిపోతారు. శని సడే సతి, ధైయాలో ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది. ఉద్యోగం పోతుంది. కుటుంబ పోషణ కష్టంగా మారుతుంది. శని దోషం, మహాదశలో ప్రతి శనివారం సాయంత్రం పీపల్ చెట్టు క్రింద నూనె దీపం వెలిగించి, ‘ఓం శం శనైశ్చరాయ నమః’ అనే మంత్రాన్ని పఠిస్తూ 7 పరిక్రమాలు చేయాలి. ఆర్థిక సంక్షోభం తొలగిపోతుంది
సంతానం వృద్ధికి: శని మహాదశ కారణంగా, ఒక వ్యక్తి సంవత్సరాల తరబడి సంతానం పొందలేడు. శనిని ప్రసన్నం చేసుకోవడానికి, ప్రతిరోజూ హనుమంతుడిని పూజించాలి. ముఖ్యంగా మంగళవారాలు, శనివారాల్లో బజరంగబలికి చోళే నేవైద్యాన్ని అర్పించాలి. ఈ పరిహారం ప్రాపంచిక ఆనందానికి ప్రభావవంతంగా ఉంటుంది.
విద్యార్థుల వృత్తిలో ఆటంకాలు: శనిని శాంతింపజేయడం ద్వారా మనిషి బాధల నుండి విముక్తి పొందుతాడు. చదువులో ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్థులు, కెరీర్‌లో విజయం కోసం, పదునైన తెలివితేటల కోసం ఎర్రచందనం కలంతో భోజపాత్రపై ‘ఓం హ్రీన్’ అని రాసి శనివారం రాత్రి ఇంటి గుడిలో ఉంచి రోజూ పూజించాలి. విద్యార్థుల పురోగతికి ఇది చాలా ప్రభావవంతమైన ట్రిక్ అని నమ్ముతారు.
గమనిక: పైన పేర్కొన్న అంశాలు మత గ్రంధాల ఆధారంగా, ప్రజల విశ్వాసాల మేరకు ఇవ్వడం జరిగింది. దీని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..