Astro Tips: వాస్తు శాస్త్రం.. ప్రకృతికి సంబంధించి అన్ని లక్షణాలకు దగ్గరి సంబంధం కలిగి ఉన్నట్లు పరిగణించబడుతుంది. వాస్తు శాస్త్రంలో ఒక్కో ఋతువుకి కొన్ని పరిహారాలు ఉన్నాయి. ప్రస్తుతం వర్షాకాలం నడుస్తోంది. ఈ నేపథ్యంలో వర్షాకాలంలో వర్షపు నీటితో చేసే కొన్ని పరిహారాలు జీవితంలో ఆర్థిక కష్టాలను తొలగిస్తుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. మరి ఆ వాస్తు శాస్త్రం చెబుతున్న నివారణ చర్యలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
1. అప్పుల ఊబిలో చిక్కుకుపోయినట్లయితే.. వాస్తు ప్రకారం వర్షం నీటితో నివారణ చర్యలు పాటించడం ద్వారా ఆ ఊబి నుంచి బయటపడొచ్చని చెబుతున్నారు. వర్షపు నీటిని ఒక బకెట్‌లో సేకరించి, ఆ నీటిలో ఒక గ్లాసు పాలు కలపాలి. ఆ తరువాత ఈ నీటితో స్నానం చేయాలి. ఇలా చేస్తే త్వరలోనే అప్పులు తీరిపోతాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
2. వర్షపు నీటితో లక్ష్మీదేవిని పూజిస్తే ధనలాభం కలుగుతుందని కూడా విశ్వాసం. ఇత్తడి పాత్రలో వర్షపు నీటిని సేకరించి వాటితో లక్ష్మీదేవికి జలాభిషేకం చేయాలి. శుక్రవారం నాడు ఇలా చేయడం విశేష ప్రాముఖ్యత కలిగి ఉంది. మాతా లక్ష్మి దేవికి తామర పువ్వు సమర్పించాలి.
3. ఆర్థిక సంక్షోభం చుట్టుముట్టినట్లయితే.. ఒక మట్టి కుండను తీసుకొని వాన నీటితో నింపాలి. ఇంటి ఉత్తర దిశలో కాడ ఉంచండి. ఇలా చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని నమ్మకం.
4. వైవాహిక జీవితంలో చీలికలు ఏర్పడితే వర్షం నీటిని గాజు సీసాలో నింపాలి. ఈ బాటిల్‌ని కొన్ని రోజులు పడకగదిలో ఉంచాలి. ఇలా చేస్తూ ఉంటే.. వైవాహిక జీవితంలో మాధుర్యం ఏర్పడుతుంది.
5. చర్మ సంబంధిత వ్యాధులు దూరం కావాలంటే వాన నీటిలో పసుపు కలిపి ఆ నీటితో స్నానం చేయాలి. వర్షాకాలంలో తేనెను ఉపయోగించడం చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. వర్షం పడి తేమ ఉన్న రోజున ఆ రోజు తేలికపాటి ఆహారం తీసుకోవాలి.
గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం, ఖచ్చితమైనది అని టీవీ9 తెలుగు నిర్ధారించడం లేదు. కేవలం వాస్తు శాస్త్ర గ్రంధాలు, వాస్తు నిపుణులు అందించిన సమాచారం మేరకు ప్రజల విశ్శాసాలను దృష్టిలో పెట్టుకుని పబ్లిష్ చేయడం జరిగింది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..