Religious Significance of Tulsi: హిందూ మతంలో తులసి మొక్కను పవిత్రంగా భావిస్తారు. తులసి మతపరమైన దృక్కోణం నుండి ప్రాముఖ్యతను కలిగి ఉండటమే కాకుండా ఆయుర్వేదంలో దాని ప్రయోజనాలను కూడా ప్రస్తావించింది. అంతేకాకుండా, హిందూమతం ప్రకారం తులసికి సంబంధించిన అనేక నియమాలను ప్రజలు తప్పక గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఆదివారం నాడు తులసి ఆకులను అస్సతు తుంచకూడదు. మరి దీని వెనుక ఉన్న కారణాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
హిందూ మత గ్రంధాలలో, తులసి ఆకు మహిమ గురించి ఎంతగానో చెప్పడం జరిగింది. దానిలోని ఒక ఆకు కూడా ఎంతో పుణ్యాన్ని కలుగజేస్తుంది. తులసి మొక్కలో లక్ష్మి దేవి నివసిస్తుందని భావిస్తారు. తులసిని రోజూ పూజిస్తే ఆ ఇంట్లో ఎప్పుడూ సుఖ సంతోషాలు ఉంటాయని నమ్ముతారు. దీంతో పాటు, ఆర్థిక సమస్యలు, ప్రతికూలత నుండి కూడా ఉపశమనం పొందుతారు.
పౌరాణిక విశ్వాసాల ప్రకారం.. తులసి విష్ణువుకు చాలా ప్రీతికరమైనది. అదే సమయంలో హిందూ విశ్వాసాల ప్రకారం ఆదివారం కూడా విష్ణువుకు అంకితం చేయబడింది. ఈ కారణంగా ఆదివారం నాడు తులసి ఆకులను తుంచొద్దని పండితులు చెబుతారు.
ఆదివారాలు మాత్రమే కాకుండా.. చంద్రగ్రహణం, సూర్యగ్రహణం, ఏకాదశి, ద్వాదశి, సూర్యాస్తమయం తర్వాత కూడా తులసి ఆకులను తుంచొద్దు. ఎందుకంటే ఈ తేదీల్లో తులసి భగవంతుడు శ్రీ హరి కోసం నిర్జల వ్రతం ఆచరిస్తుందని విశ్వాసం. అందుకే, ఈ రోజుల్లో తులసిని తుంచడం మానుకోవాలి. అలాగే ఈ తేదీల్లో తులసికి నీరు కూడా పోయవద్దు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..