Astro Tips: బుధవారం రోజు ఇలా చేస్తే ఉద్యోగం, వ్యాపారంలో అద్భుత విజయం వరిస్తుంది..!

|

Apr 20, 2022 | 9:13 PM

Astro Tips: చంద్రుని కుమారుడైన బుధుడిని నవగ్రహాలలో యువరాజుగా పరిగణిస్తారు. జాతకంలో బుధుడు బలంగా ఉంటే సదరు వ్యక్తుల జీవితం ఆనందమయంగా..

Astro Tips: బుధవారం రోజు ఇలా చేస్తే ఉద్యోగం, వ్యాపారంలో అద్భుత విజయం వరిస్తుంది..!
Astrology
Follow us on

Astro Tips: చంద్రుని కుమారుడైన బుధుడిని నవగ్రహాలలో యువరాజుగా పరిగణిస్తారు. జాతకంలో బుధుడు బలంగా ఉంటే సదరు వ్యక్తుల జీవితం ఆనందమయంగా, విజయవంతంగా సాగిపోతుందని విశ్వసిస్తారు. ఇలాంటి వ్యక్తులు చాలా తెలివైన వారు, ఆందం, ఆకర్షణీయమైన వారిగా కూడా భావిస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధుడు తెలివితేటలు, విచక్షణ కలిగిన వాడిగా పేర్కొంటారు. బుధ గ్రహం అనుగ్రహం పొందిన వారు చాలా తెలివైనవారు, వాగ్ధాటి అవుతారు. క్లిష్టమైన సమస్యలను కూడా సులభంగా పరిష్కరించగల సామర్థ్యం వారి సొంతం. జాతకంలో బుధుడు బలంగా ఉండడం వల్ల సదరు వ్యక్తులు తాము చేసే వ్యాపారంలో అద్భుత విజయం పొంది అనతికాలంలోనే ధనవంతులు అవుతారు. కెరీర్‌లో గొప్ప విజయాన్ని సాధిస్తారు. కానీ, ఎవరి జాతకంలో అయితే బుధుడు బలహీనంగా ఉంటాడో వారి జీవితంలో అనేక కష్టాలు ఎదురవుతాయి. వృత్తి, వ్యాపారం సహా అనేక అంశాల్లో నిరాశ, నిస్పృహలే ఎదురవుతాయి. మరి మీ జాతకంలో బుధగ్రహం బలహీనంగా ఉన్నట్లయితే.. కొన్ని పరిష్కార మార్గాలను అనుసరించడం ద్వారా దుష్ప్రభావాల నుంచి విముక్తి పొందవచ్చు అని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. మరి ఆ నివారణ చర్యలేంటో ఇప్పుడొకసారి చూద్దాం..

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, జాతకంలో బుధ గ్రహం బలహీనత మీ కష్టాలకు పెద్ద కారణం అయితే దానిని నివారించడానికి మీరు ప్రతిరోజూ, ముఖ్యంగా బుధవారం నాడు గణేశుడిని పూజించాలి. గణపతి పూజలో గరకను పెట్టి పూజించాలి. అలా చేయడం వలన గణపతి అనుగ్రహమే కాకుండా.. బుధ గ్రహం అనుగ్రహం కూడా లభిస్తుందని విశ్వాసం.

జ్యోతిష్య శాస్త్రంలో మంత్రోచ్ఛారణ, తపస్సు, దాతృత్వం గ్రహాల శుభానుగ్రహం పొందడానికి ఉపకరిస్తాయని పండితులు చెబుతున్నారు. బుధుడి ప్రభావంతో కష్టాలు ఎదుర్కొంటున్నట్లయితే.. ప్రతి బుధవారం నాడు పప్పు, ఆకుపచ్చని దుస్తులు, ఆకుపచ్చని గాజులు, పచ్చి మేత వంటివి దానం చేయాలి. వీలైతే తొమ్మిది మంది అమ్మాయిలకు ఆకుపచ్చ దుస్తులను దానం చేసి వారి ఆశీస్సులను తీసుకోవాలి.

బుధుని అనుగ్రహం పొందడానికి ఇంట్లో తులసి మొక్కను నాటాలి. ఆ చెట్టుకు రోజూ పూజలు చేయాలి. వీలైతే తులసి మొక్కను కూడా దానం చేయాలి.

బుధ గ్రహం దోషాలను తొలగిపోవడానికి బుధవారం నాడు ఒక రాగి నాణెం, రంధ్రాలు ఉన్న రాగి ముక్కను తీసుకొని ప్రవహించే నీటిలో వేయాలి. అదేవిధంగా ప్రవహించే నీటిలో ఖాళీ మట్టి కుండను వేసినా బుధ గ్రహానికి సంబంధించిన దోషాలు తొలగిపోయి ఐశ్వర్యం లభిస్తుంది.

సనాతన సంప్రదాయంలో.. గ్రహాల అనుగ్రహాన్ని పొందడం, దేవతల ఆశీస్సులు పొందడం, సంబంధిత దోషాలను తొలగించడానికి మంత్రాలను పఠించడం చేస్తుంటారు. వేదమంత్రోచ్ఛారణలతో దోషాల నివారణకు ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ క్రమంలోనే జాతకచక్రంలో బుధ గ్రహ దోషాన్ని తొలగించడానికి ‘ఓ బం బుధాయ నమః’, ‘ఓం బ్రాం బ్రిం బ్రౌన్స్ః బుధాయ నమః’ అనే మంత్రాన్ని జపించాలి.

(ఇక్కడ ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలు, జ్యోతిష్య శాస్త్రం ఆధారంగా పేర్కొనడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించలేదు. సాధారణ ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని పబ్లిష్ చేయడం జరిగింది.)