Astro Remedies for Career: కొంతమంది కష్టపడకుండానే పైకి వస్తుంటారు. కెరీర్‌లో అద్భుత విజయం సాధిస్తుంటారు. మరికొందరు రాత్రి, పగలు కష్టపడినా అక్కడే ఉండిపోతారు. కెరీర్‌లో ఉన్నత శిఖరాలను అందుకోలేకపోతారు. అందుకే ఎంత కష్టపడినా.. ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలంటారు పెద్దలు. అయితే, కెరీర్‌లో ఉన్నత శిఖరాలను అధిరోహించాలంటే జ్యోతిష్య శాస్త్రంలో పలు నివారణలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు.
ఈ పోటీ ప్రపంచంలో.. ఆఫీసర్ ఉద్యోగాలైనా.. వ్యాపారమైనా వ్యక్తులపై తీవ్రమైన ఒత్తిడి పెరుగుతుంది. కెరీర్‌లో అభివృద్ధి చెందుతున్నా కొద్ది కొత్త సమస్యలు ఉత్పన్నమవుతుంటాయి. ఆ సమస్యలను ఎదుర్కొనేందుకు కొందరు విశ్వప్రయత్నాలు చేస్తుంటారు. కానీ, ఎంతచేసినా కెరీర్‌లో ముందుకు కదలరు. దాంతో నిరాశ, నిస్పృహలకు గురవుతుంటారు. ఒకవేళ మీరు కూడా మీ కెరీర్‌లో ఇలాంటి సమస్యనే ఎదుర్కొంటున్నట్లయితే.. జ్యోతిష్యశాస్త్రం చక్కటి పరిష్కార మార్గాలను చూపుతోంది. కొన్ని చిట్కాలు పాటిస్తే.. కెరీర్‌లో ఉన్నత స్థానానికి చేరుకోవచ్చని జ్యోతిష్కులు చెబుతున్నారు. మరి ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
1. కష్టానికి తోడు అదృష్టం కూడా ఉండాలి. ఆ అదృష్టం రావాలంటే భగవంతుడి కృప ఉండాలంటారు పండితులు. అందుకే ప్రతీ వ్యక్తి సూర్యోదయానికి ముందే నిద్ర లేవటం అలవాటు చేసుకోవాలి. ప్రతీ రోజూ సూర్య భగవానుడిని దర్శించుకోవాలి. రాగి పాత్రలో కొన్ని నీటిని తీసుకుని, అందులో కొన్ని అక్షింతలు, పుష్పాలు వేసి సూర్యుడికి అర్పించాలి. ప్రతీ రోజూ ఆదిత్య స్త్రోత్రం పఠించాలి.
2. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ మీ కెరీర్‌లో విజయం సాధించలేకపోతే.. ప్రతీరోజూ స్నానం చేసేటప్పుడు నీటిలో కొద్దిగా పసుపును కలిపి.. ఆ నీటితో స్నానం చేయాలి. ఇలా చేయడం ద్వారా భగవంతుడి కృప మీపై ఉంటుందని, కెరీర్‌లో అధ్భుత విజయం సాధిస్తారని పండితులు చెబుతున్నారు.
3. కెరీర్‌లో విజయం సాధించడానికి.. ఐదు గురువారాలు గుడికి వెళ్లి, ప్రత్యేకంగా బ్రాహ్మణులకు పసుపు రంగు స్వీట్లను దానం చేయండి. అదే సమయంలో, లక్ష్మీనారాయణ స్వామిని పూజించండి. నారయణుడి మంత్రాలను జపించండి.
4. మీరు వ్యాపారంలో సమస్యలతో సతమతమవుతున్నా.. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ సమస్యలు తీరకపోయినా.. ఓ పని చేయాల్సి ఉంటుంది. అదేమంటే.. మీ వ్యాపార స్థలంలో వ్యాపార వృద్ధి యంత్రం, శ్రీ యంత్రాన్ని ఏర్పాటు చేసి, ప్రతిరోజూ పూజించాలి.
5. ఏవేనీ కారణాల వల్ల మీ ప్రమోషన్ నిలిచిపోయినా, లేక ఇతర అడ్డంకులు ఎదుర్కొంటున్నట్లయితే.. ఆ సమస్య నుంచి బయటపడటానికి మీరు దేవాలయానికి వెళ్లి, నవగ్రహాల శాంతి కోసం పూజ చేయించుకోవాలి.
6. మీరు మీ కెరీర్‌ను కొనసాగించడంలో అందరి సహకారాన్ని పొందాలనుకుంటే, ముందుగా మీ ప్రవర్తనలో సానుకూల మార్పును తీసుకురావాలి. ఎందుకంటే మీరు ఎదుటి వారితో మంచిగా మాట్లాడితేనే ఎదుటివారు మీతో కలివిడిగా ఉంటారు. మీ మంచి ప్రవర్తన కారణంగా, మీ సహచరులు మీకు సహాయం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు.
(ఇక్కడ ఇచ్చిన సమాచారం మత విశ్వాసాలు, మతగ్రంధాల నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. సాధారణ ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ కథనం ప్రచురితమైంది)
Also read:
Viral News: 50 ఏళ్లుగా పచ్చి మాంసమే తింటున్నాడు.. సడెన్‌గా విషయం తెలిసిన భార్య ఏం చేసిందంటే..
Telangana News: భూమి నుంచి ఒక్కసారిగా ఉబికి బయటకు వచ్చిన నీటి సంపు.. షాక్ అయిన గ్రామస్తులు..