Amareshwar Temple: ఈ గుడిలో శివయ్యకు మొదట పూజ అశ్వత్థామదే.. చూడాలని ప్రయత్నిస్తే పిచ్చివారు అవుతారట ..

|

Jun 10, 2024 | 3:08 PM

నేటికీ సైన్స్ చేధించని రహస్యాలతో నిండిన దేవాలయాలు అనేకం ఉన్నాయి. వీటిల్లో ఒకటి అతిపురాతన ఆలయం. ఈ ఆలయంలో ప్రధాన దైవం శివుడిని అశ్వత్థామ స్వయంగా పూజించడానికి వస్తాడని నమ్మకం. ద్రోణాచార్యుడి తనయుడు అశ్వత్థామను శ్రీ కృష్ణ భగవానుడు మహాభారత యుద్ధ తర్వాత ఉప పాండవులను సంహరించిన అనంతరం కలియుగంలో కూడా సంచరించమని శపించాడు.

Amareshwar Temple: ఈ గుడిలో శివయ్యకు మొదట పూజ అశ్వత్థామదే.. చూడాలని ప్రయత్నిస్తే పిచ్చివారు అవుతారట ..
Amareshwar Temple
Follow us on

భారతదేశం ఆధ్యాత్మికతకు నెలవు. అనేక పురాతన దేవాలయాలున్నాయి. అందుకనే మన దేశాన్ని దేవాలయాల దేశం అని కూడా పిలుస్తారు. ఈ ఆలయాలన్నింటికీ సొంత ప్రత్యేకత ఉంది. కొన్ని ఆలయాలు రహస్యాలకు నెలవు. ఈ ఆలయాలను చూసినా.. వీటికి చెందిన విషయాలను విన్నా ఆశ్చర్యపోతారు. నేటికీ సైన్స్ చేధించని రహస్యాలతో నిండిన దేవాలయాలు అనేకం ఉన్నాయి. వీటిల్లో ఒకటి అతిపురాతన ఆలయం. ఈ ఆలయంలో ప్రధాన దైవం శివుడిని అశ్వత్థామ స్వయంగా పూజించడానికి వస్తాడని నమ్మకం. ద్రోణాచార్యుడి తనయుడు అశ్వత్థామను శ్రీ కృష్ణ భగవానుడు మహాభారత యుద్ధ తర్వాత ఉప పాండవులను సంహరించిన అనంతరం కలియుగంలో కూడా సంచరించమని శపించాడు.

ఆ ఆలయం ఎక్కడ ఉందంటే?

మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్‌పూర్ జిల్లాలో ఉన్న అసిర్‌ఘర్ కోటలో పురాతన శివాలయం ఉంది. ఈ కోట రామాయణ కాలంలో అంటే 14వ శతాబ్దంలో నిర్మించబడిందని నమ్మకం. ద్వాపర యుగంలో కృష్ణుడు ఇచ్చిన శాపం కారణంగా అశ్వత్థామ గత 5 వేల సంవత్సరాలుగా బుర్హాన్‌పూర్‌లోని ఈ కోటలో సంచరిస్తున్నాడని స్థానికుల నమ్మకం.

ఇవి కూడా చదవండి

శివుడికి తొలి పూజ చేసే అశ్వత్థామ

బ్రహ్మ ముహూర్త సమయంలో అసిర్‌ఘర్ కోటలోని శివాలయంలో శివుడికి తొలి పూజను అశ్వత్థామ చేస్తాడని నమ్మకం. పూజారులు ఆలయ తలపులు తెరవక ముందే శివుడిని పూజించి వెళ్ళిపోతాడని.. అందుకు సాక్ష్యంగా రోజూ ఉదయం శివలింగంపై తాజా పువ్వులు, విభూది ఉంటాయని పూజారులు చెబుతారు. ఈ రహస్యం నేటికీ చేధించలేదని స్థానికులు చెబుతారు. అశ్వత్థామకు సంబంధించిన అనేక కథలు స్థానికులు చెబుతారు. అంతేకాదు అడవుల్లో , గుడి ఆవరణలో సంచరించే అశ్వత్థామను చూసే ప్రయత్నం చేసినా.. ఆయన్ని చూసినా మానసిక స్థితి చెడిపోతుందని.. పిచ్చి వారిగా మారిపోతాయని స్థానికుల విశ్వాసం.

అనేక రహస్యాలకు నెలవు కోట

ఈ ఆలయానికి సంబంధించిన విశేషాలను తెలుసుకోవడానికి పురావస్తు బృందం కోట పశ్చిమ దిశలో తవ్వకాలు జరిపారు. ఈ తవ్వకాల్లో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. తవ్విన స్థలంలో భూగర్భంలో అందమైన రాజభవనం వెలుగులోకి వచ్చింది. ఈ రాజభవనం రాణి కోసం నిర్మించి ఉండవచ్చని అంటున్నారు. ఈ రాణి ప్యాలెస్‌లో 20 రహస్య గదులున్నాయి. పురావస్తు శాఖ ప్రకారం ప్యాలెస్ 100 బై 100 స్థలంలో నిర్మించబడింది. ఈ ప్యాలెస్‌లో స్నానపు చెరువు కూడా ఉంది. అంతేకాకుండా తవ్వకాల్లో జైలు కూడా లభ్యమైంది. జైలుకి ఇనుప కిటికీలు, తలుపులు కూడా ఉన్నాయి.

 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు